🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 27 / YOGA VASISHTA - 27 🌹


🌹.  శ్రీ యోగ వాసిష్ఠ సారము - 27  /  YOGA VASISHTA - 27 🌹

✍️. రచన : పేర్నేటి గంగాధరరావు

📚. ప్రసాద్ భరద్వాజ 


27 వ భాగము

🌴. ఉత్పత్తి ప్రకరణము  🌴

🌻. యుద్ధము - 1 🌻


ఒకానొక చోట యుద్ధ బేరీలు మ్రోగుచుండెను. ఇరువర్గముల వారు, వారి వారి ఆయుధములతో, గుర్రములు, ఏనుగులు, రధములు, కాల్బలములతో ఇరువైపుల, బారులతీరి, యుద్ధోన్ముఖులగుచుండిరి. అయ్యది పద్ముని రాజ్యము. సరస్వతి లీలావతులు, ఆకాశమున, సూక్ష్మరూపమున నుండి యుద్ధమును తిలకించుచుండిరి. ఇరువైపుల నుండి లక్షల సంఖ్యలో వీరులు తలపడుచుండిరి. మెరుపులవలె కత్తుల నుండి నిప్పురవ్వలు వెలువడసాగెను. ధనుష్టాంకారములు, హుంకారధ్వనులు వినబడుచుండెను. శూరుల శిరములు తెగిపడుచుండెను. రక్తప్రవాహములు ఏరులై పారుచుండెను. అంగములు తెగిన భటులు, మృత్యు భయముతో రోదించుచుండిరి. యుద్ధరంగమున ధూళి పైకెగసి పడుచుండెను. ధూళి, మేఘముల వలె ఏర్పడుచున్నది. అప్పుడొక వీరుడు అరుదెంచి సముద్రునివలె సేనలను చిందరవందర చేయుచు, సైనికులను, గుర్రములను, ఏనుగులను వధించుచుండెను. మృతి చెందిన వీర సైనికులకు స్వర్గమున అప్సరసలు స్వాగతము పల్కుచుండిరి. ఆ సంగ్రామము క్రమముగా ఉన్మత్తము, భీషణము నవసాగెను. బీరులగు వారు ఓడిపోయి, నలుదిక్కుల పరుగెడుచుండిరి. యక్ష, రాక్షస పిశాచాదులు, రుధిరసముద్రమున గ్రీడించసాగిరి. ఆ రణరంగమున చక్రధరులు, ధనుర్ధరులు, ఖడ్గధారులు, ముసలద్గరులు, ముద్గరులు, శూలపాణులు, పరశుధారులు, త్రిశూలధారులు, ప్రళయసాగరము వలెఢీకొనిరి.


లీలానాధుడగు పద్మునికి సాయము చేయుటకు, అష్టదిక్కుల నుండి రాజులు, సైన్యములను పంపుచుండిరి. కోసల, కాశి, ఉత్కళ, కర్కర, మద్రదేశస్తులు, వింధ్య, చేది, వత్స, అంగ, వంగ, కళింగ, కర్ణాంధ్ర, కిష్కింద దేశముల నుండి; సురాష్ట్ర, సింధు, సౌవీర, ద్రవిడ దేశముల నుండి సైన్యములు వచ్చుచుండెను. ఇట్లు యుద్ధ మత్యంత భయంకరముగ జరుగుచుండెను. ఇరుపక్షముల వారు అలసిపోయిరి. ఏనుగులు, గుర్రములు డస్సిపోయెను. అపుడు ఇరుపక్షములవారు, మంత్రులు సేనాపతులతో యోచించి యుద్ధము నాపుజేయ దూతలను పంపసాగిరి. అచ్చటచ్చట శవ సమూహములు పడియుండెను. రక్త నదులు ప్రవహింపజొచ్చెను. ఇట్లు యుద్ధ ప్రదేశము మృత్యుదేవత విహరించు వనము వలె కన్పడసాగెను.


అపుడు లీలావతి, సరస్వతిదేవియు నాకాశమును పరిత్యజించి రాజగృహమున సూక్ష్మశరరముతో ప్రవేశించిరి. అపుడు వసిష్టుడు రామునకిట్లు చెప్పెను. స్ధూల శరీర భ్రాంతి గల్గినవారు, అణు ప్రమాణ రంధ్రమున ప్రవేశింపజాలరు. సూక్ష్మశరీరములో అతివాహిక దేహ నిశ్చయము గలవారు, సూక్ష్మశరీరులై అచట ప్రవేశించిరి. 


వీరు ఇచ్చవచ్చినట్లు ఆకాశమున, కొండగుహలందు, పరమాణురూపముగ మారగలరు. స్ధూలశరీరులు తానుపురుషుడు, నాతండ్రి,నామిత్రులు, నాతల్లి, ధనము, పాపపుణ్యములు మొదలైన జగత్‌భ్రమలు స్పురించుచుండును. ఈ స్ధూల విశ్వము మన సంకల్పమే, చంచలమే, క్షణభంగరమే.


మహా ప్రళయమున, హరిహరాది దేవతలు కూడ విదేహ ముక్తులగుదురు. బుద్ధజీవుల జనన మరణములకు వారి స్మృతియె కారణమగుచున్నది. ఇయ్యది స్వప్నాంగనా సంయోగమువలె, అనుభూత మగుచున్నను, అసత్యమే. ఇట్లు ప్రతి వారికి గలుగు జగద్భ్రమయను వనము, భూమి, నక్షత్రములు, పూలు, చిగుళ్ళ, మనుష్యులు, మృగములు, దేవతలు పక్షులు, మొదలగు అంకురములు వారి యందు గలవు.


 నిరాకార మగు పరబ్రహ్మమున నెన్ని అసత్‌ స్వరూపము లుద్భవించుచున్నవో, ఉద్భవింప నున్నవో, ఎవ్వరు నిరూపించగలరు. ఇంద్రజాలికుడు ఆకాశమున వివిధ ఛిద్రములను కల్పించి, అందు నా, నా విధములగు విచిత్ర వస్తువులను దోప జేయునట్లు, మిధ్యారూపమున, అనాదియగు మాయ కూడ చిదాకాశమున లేక చిత్తాకాశమున, నామరూపములు గల జీవభావమును స్పురింపజేయుచున్నవి. 


అలానే ఆకాశ స్వరూపిణిలగు లీలా సరస్వతులు, తమతమ ఇచ్చిననుసరించి, ఆ గృహమున ప్రవేశించిరి. వారి ప్రభావమున నృపతి తప్ప అందరు నిద్రితులై యుండిరి. అపుడు పద్ముడు ఆహ్లాదితుడై మేల్కొనెను. అంతట సింహాసనాద్వయమున వెలయచున్న అప్సరసల నిరువురనుగాంచెను.


నృపతి వారి పాదములకు సుమాంజలినర్పించెను. సరస్వతి కృప వలన మంత్రి నిద్ర నుండి మేల్కొనెను. అపుడు దేవి రాజునుద్దేశించి తన వృత్తాంతమును తెలుపుమని పల్కెను. మంత్రి, రాజు వృత్తాంతము నిట్లు తెల్పెను.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 YOGA-VASISHTA - 27 🌹

✍️ Narayan Swami Aiyer

📚 🌻 Prasad Bharadwaj


🌴 MUMUKSHU PRAKARANA - 4 🌴


The  four  means  of  Moksha:  

If  the  four  sentinels  that wait  at  the  gates  of  Moksha  (salvation)  viz.,  Shanti (sweet  patience  or  quiescence  of  mind),  Vichara (Atmic  enquiry),  Santosha  (contentment  of  mind) and  Sadhu-Sanga  (association  with  the  wise)  be befriended,  then  will  there  be  any  obstacle  to  the attainment  of  salvation?  (No).  Like  the  waiters, posted  at  the  gates  of  the  palace  of  a  king protecting  the  earth,  who  allow  ingress  to  the visitors  without  to  see  the  king  within,  the  above four  sentinels  allow  admittance  within  into Moksha.  


Even  if  one  of  them  be  befriended,  then he  will  introduce him  (the  new comer) to the rest of his  fellows.  Therefore  you  should  ceaselessly endeavour  to  hold  fast  to  one  at  least,  throwing aside  all  obstacles  that  come  in  the  way  and associate  with  him  intimately.  In  order  to  put  an end  to  the  ephemeral  re-births,  we  should,  above all,  develop  our  (spiritual)  intelligence  through association  with  the  wise,  enquiry  into  Atman Jnana  books  and  deep  Samadhi  (or  Meditation). The  venom  of  the  pains  of  Samsara  will  be dispelled  (and  the  man  bitten  will  be  cured  of  the poison)  through  the  Garuda-Mantra called  Jnana. 


Note : 19.  It  is  the  belief  in  India  that  a  person  bitten  by  a  serpent  will  be  cured by Garuda  Mantra;  Garuda  or  eagle  being-  the  enemy  of  the  serpent. 


Then  (with  the  development  of  Jnana),  even showers  of  arrows  discharged  at  him  will  be  (to him)  like  those  of  soft  lily  flowers;  a  bed  of  flames will  resemble  to  him  a  soft  cushioned  bed  redolent of  rosewater  besprinkled  in  it;  and  the  chopping  off of  his  head  will  be  like  Sushupti  (the  dreamless sleeping  state)  wherein  happiness  is  enjoyed.  The ripping  open  of  his  stomach  will  be  like  the application  of  sandal  over  his  body  and  the piercing  in  his  breast  of  straight-  pointed innumerable  lancets  will  be  like  cool  water sprinkled  from  a  pump  in  the  long  summer  season. The  poisonous  disease  of  sensual  objects  unfit  to  be associated  with,  can  be  avoided  only  by  those  who have  developed  the  discriminative  (spiritual) wisdom  and  not  by  any others.    


It  is  not  through  a  mere  enquiry  into  Atman  Jnana know  ledge  that  Nirvanic  bliss  is  attained?  If  one should  conduct  himself  in  such  a  way  as  to assimilate‟(as  one),  within  himself,  the  knowledge derived  from  the  three  sources  of  his  self- experience,  the  true  significance  of  the  holy sentences  in  the  spiritual  Books  and  the instructions  of  a  wise  Guru,  then  the  inseparable Atmic  wisdom  will  rise  in  him.  


The  mere  study  of rare  Jnana  books  by  persons  of  petty  intelligence will  but  breed  Ajnana  in  their  minds.  Books treating  of  devotion  and  the  performance  of  rituals will  generate  less  Ajnana  than  the  study  of  Jnana books  (unaccompanied  by  the  other  two  above mentioned).  And  it  should  be  remembered  that  it  is far  better  to  lead  a  mendicant  s  life  by  begging  for food  at  the  doors  of  even  outcastes  with  a  bowl  in hand  than  to  pass  a  life  of  Ajnana.  Immense wealth,  friends,  relatives,  Benares  and  other  sacred places,  bathing  in  the  Ganges  and  other  waters,  the hermitage  of  Munis,  religious  austerities  afflicting the  body  and  other  like  things  are  not  the  sure means  of  ever  reaching  the  higher  state;  but  it  is through  the  mind  s  efforts  that  the  immaculate  and supreme Seat  can  be attained.

🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 257 / YOGA-VASISHTA - 257

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹