🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 22 / YOGA-VASISHTA - 22 🌹

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 22 / YOGA-VASISHTA - 22 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🌴 ఉత్పత్తి ప్రకరణము  🌴
🌻 లలోపాఖ్యానము   🌻

ఈ సందర్భమున వసిష్ఠుడు శ్రీరామునకు లీలోపాఖ్యానమును ఈ విధముగా తెలియజేసెను.

పద్ముడను మహారాజొకడు ఈ భూమండలమును ఒకప్పుడు పరిపాలించెను. అతడు సకల గుణశోభితుడు, సర్వకళా సంశోభితుడునై, అతని భార్య లీలావతి భర్తకు తగిన ఇల్లాలు. మృధుబాషిణి పవిత్రతగల్గి, వసంతలక్ష్మివలె నొప్పుచు, భర్తకు ఛాయవలె సంచరించెడిది. ఇరువురు అపరిమిత ప్రేమతో, సర్వ ప్రదేశము లందును సంచరించుచు, రమణీయ క్రీడలతోను, పరిహాస వాక్యములతోను, శృంగార క్రీడలతోను సంచరించుచు పరమ సుఖమున తేలియాడుచుండ ఆ రాజపత్ని లీలావతి ఇట్లు తలపోసెను.

తాను తన ప్రియుడు శతయుగములు, జరామరణములు లేకుండ, యవ్వనమున నుండ గల్గుటకు యుపాయమేమిటని భావించెను. తదుపరి అందులకై లీలావతి; యమ, నియ మాధ్యనుష్టానముల నవలంభించి, తపో, జపముల నాచరించి, తన భర్త తాను, జరామరణములు లేకుండా వుండునట్లు, యత్నింతునని భావించి అందుకు, జ్ఞానవృద్ధులను, తపోధనులను విద్యాధికులను పూజించి, అమరత్వమును పొందు మార్గమును తెలుపుమని కోరెను. అందుకు వారు జపతప నియమాదుల నాచరించిన, ఇతరములన్నియు లభించును గాని, అమరత్వము లభించదనిరి.

అపుడు లీలావతి చింతించి, ఇట్లు తలచెను? తాను వెయ్యేండ్లుగడచిన పిదపనైనను, తన కంటే తన భర్త ముందుగ మరణించిన, అతని ప్రాణములు గృహము నుండి వెలువడ కుండునట్లు చూచిన, యావజ్జీవము తాను సుఖముగ నుండ వచ్చునని భావించెను.

తదుపరి ఆమె, తన భర్తకు తెలియకుండా శాస్త్రానుసారము, కఠోర నియమములాచరించి, తన భర్త అమరత్వమునకై సాధన మొదలుపెట్టెను.
ఆమె ఉపవాసముల ద్వారా, దేవ, బ్రాహ్మణుల పూజల ద్వారా, స్నాన,దాన, తపోధ్యానాది, క్లేశకర కార్యములకై తన శరీరమును, వినియోగించుచు శాస్త్రానుసారము యథా సమయమున, భర్తను సేవించుచు, అతనికి సంతోషమును గూర్చుచుండెను. ఇట్లు కఠోర తపమును ఆచరించుచు, త్రిరాత్రి శతవ్రతమును ఆచరించెను. ఆ తపః ప్రభావమున వాగ్దేేవి సరస్వతి ప్రసన్నమై తన కిష్టమైన వరమును కోరుకొమ్మనెను. అపుడు లీలావతి జయ వాచకములు పలికి రెండు వరములు కోరుకోనెను.
1) తన భర్త ప్రాణములు వదలినను, ఆ జీవాత్మ తన అంతఃపురము నుండి వెలువడ కుండునట్లు
2) తాను తలచు కున్నపుడెల్ల తనకు దర్శనమీయ వలెనని చెప్పెను. అందుకు వాణి సమ్మతించి వరముల నొసగెను. అంత లీలావతి సంతసంబున భర్తతో కొంతకాలము గడిపిన తదుపరి, తన భర్త పద్ముడు ప్రాణము వదలెను. భర్త మృతుడగుట గని లీలావతి, దుఃఖముతో మృత్యుపాయ మయ్యెను. విరహ పీడితమై తాను కూడ మరణించ నెంచుచుండెను.

అపుడు ఆకాశవాణి ప్రసన్నమై ఇట్లు పలికెను. ''నీ భర్త శవము కూడ పాడవదు. ఇతడు మరల జీవించి, నీ అంతఃపురమును విడిచి ఎచ్చటకును వెళ్ళడు'' అది విని లీలాదేవి, ఇతర బంధువులు పూలతో అతని శరీరమును కప్పి దాచివుంచిరి.
తదుపరి లీలావతి ఆదినమున అర్ధరాత్రి, ధ్యాన పరాయణయై, దుఃఖముతో సరస్వతీ దేవిని ప్రార్థించెను. అంత సరస్వతి ప్రత్యక్షమై నీవేల దుఃఖించు చుంటివి, ఈ సంసారము భ్రమయనియు, మృగతృష్ణవలె మిధ్యయని తెలియదా! అని పల్కెను. అపుడు లీలావతి, తన్ను కూడ తన భర్త వద్దకు చేర్చుమని, అతడెచట వున్నాడో తెల్పమని కోరెను.
🌹 🌹 🌹 🌹 🌹


🌹 YOGA-VASISHTA - 22 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 VAIRAGGYA-PRAKARANA 🌴

🌻 THE STORY OF  SUKA 🌻

When  the  king  of  kings  named  Janaka  thus initiated  Suka  into  the  Atmic  mysteries 14  (through his  direct  presence),  the  stainless  Rishi  attained quiescence  in  his  Atman  or  Higher  Self,  being  freed  from  the  pangs  of  birth  and  the  agonies  of  death; then  all  his  enquiring  spirit,  perplexities  of  mind and  doubts  vanished  through  (direct)  selfcognition.  Then  having  reached  the  highest pinnacle  of  Mahameru,  he  went  into  the  nonfluctuating    Nirvikalpa  Samadhi  and  after  a  period of 15,   thousand  solar  years  merged  into  the Jnanakasa like  a  light  which,  when  divested  of its  wick  and  ghee,  returns  back  to  its  fount  of Akasic  Agni  (fire).  Like  water-drops  becoming  one with  the  ocean  of  waves,  he,  being  cleansed  of  the stains  of  contemplation  (or  thinking),  merged  into the  secondless  Brahman,  the  vibration  that  started in  himself  (as  the  „I‟)  having  melted  away.  Thus did  he  attain  quiescence  (of  mind)  free  from  the delusion of  Maya.   

This  is  exactly  the  path  you  should  follow,  oh, Rama.  The  right  characteristic  of  a  mind  that  has known  all  that  should  be  known  is  the  nonidentification  of  itself  with  the  ever  pleasurable worldly  enjoyments.  With  the  proclivities  of  the mind  towards  material  objects,  bondage  in  objects becomes  strengthened;  otherwise,  the  bondage becomes  slackened  and  in  course  of  time  perishes. Oh  Rama,  the  extinction  of  Vasanas  alone,  is Moksha  (salvation);  but  the  concretion  of  the  mind in  material  objects  through  Vasanas  is  bondage. Those  persons  are  Jivanmuktas  who  have  quite disabled  the  Vasanas  and  are  indifferent  to  the many  worldly  enjoyments  without  the  aids  of Tapas  (religious  austerities),  Vratas  (religious observances)  and  others.  That  one  Principle  which Rama  s  mind  has  cognized  through  the  utterances of  the  Great  Ones  is  the  one  Reality  and  none  else. Now  the  only  person  who  is  able  to  relieve  this Great  Soul  of  Rama  from  all  his  doubts  and  render his  mind  quiescent  is  the  omniscient  Vasistha  who knows  clearly  the  three  periods  of  time,  is  the  Guru of  men  in  this  world  and  is  a  witness  to  all  things having  name,  form,  etc.  ‟So  said  Viswamitra  in  the king‟s  assembly.
🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 257 / YOGA-VASISHTA - 257

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹