శ్రీ యోగ వాసిష్ఠ సారము - 48 / YOGA-VASISHTA - 48

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 48  / YOGA-VASISHTA - 48 🌹
✍️. రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ఉత్పత్తి ప్రకరణము  🌴
🌻. సమాధానములు - 4 🌻

ఆత్మ సర్వ వ్యాపియు, సర్వానుభవ స్వరూపమును అగుటచే, ఆత్మానుభవమెపుడు సిద్ధించునో, అపుడన్నింటితో నైక్యము సహజముగ సంప్రాప్త మగును. పరమాత్మ నేత్రాదింద్రియములచే, నెఱుగ బడనందున, అవివేకులు అసత్తుల్యునిగ భావించెదరు. ద్వైతము మిధ్యయనియు, ఏకత్వము సత్యమనియు కూడ చెప్పదగదు. రెండవవస్తు వుండిననె, ఏకత్వమనునది సంభవించును. కాన ద్యైత, ఏకత్వములలో ఒక దాని యునికి లేక రెండవది సిద్దించదు. 

సముద్రము కంటె ద్రవత్వము వేరు కానట్లు, ద్వైత ఎకత్వములు రెండును, ఆ పరమాత్మ కంటె భిన్నములు కావని ఎరుగవలెను. ద్వైత ప్రపంచము బ్రహ్మమున కన్యము కాదు. తత్వవేత్త, ఈ ద్వైత స్ధితి యొక్క యదార్ధ మెరిగి యుండును. కాన ద్వైతము మిధ్య అనియె అతడు నిశ్చయించును. జలమునకు ద్రవత్వము, వాయువునకు చలనము, ఆకాశమునకు శూన్యత్వము వేరు కానట్లు, ఈశ్వరునకు ద్వైత ప్రపంచము అన్యము కాదు.

ఏకమేవా ద్వితీయ బ్రహ్మం'' అనువాక్యముచే, ఆత్మయందు మాయ యుండుట అసంభవము. *యదార్ధమునకు ద్వైతాద్వైతములు, బీజాంకురములుగాని, అణు బ్రహ్మండములు గాని లేవు. కేవలము చైతన్యమే కలదు. ద్వైత స్థితి యందుకూడ, సచ్చిదానంద పరబ్రహ్మమే రూపమై ప్రకాశించుటచే, క్రియా రూపమగు ఈ జగత్తు అధిష్టానమగు ఆత్మతత్వము కంటే, భిన్నము కాదు. ఈవిధముగ నేను ప్రపంచ రూపుడను గాక, కేవలము ద్వైత పరబ్రహ్మమేనని రాజు రాక్షసికి తెల్పెను.

అంతట రాక్షసి, రాజు వలన ఆత్మజ్ఞానము బడసి, తన మాత్సర్యమును చిత్త చాపల్యమును విడనాడెను. అంతట ఆ రాక్షసి, రాజు మంత్రుల బ్రహ్మజ్ఞానమునకు సంతసించి, మీరిరువురు నాకు పూజనీయులు. మీ వాంఛితము ఏదైన తెలుపుడు, నెరవేర్చెదను అని పల్కెను. అంత రాజు రాక్షసి నుద్ధేశించి, ఈ ప్రదేశమున మనుజులను శూలము వలె విషూచిక అధికముగ బాధించు చున్నది. ఇక జీవిని హింసించకుండునట్లు అంగీకరించుము. 

రాక్షసి అట్లేయని బదులు చెప్పెను. అంతట రాజు నీవు ఆహారము లేకుండగ, ఎట్లు జీవించెదవని ప్రశ్నించగా, తాను తిరిగి పర్వశిఖరమున కరిగి, ధ్యాననిష్టలో నుండెదనని. పరమాత్మ ధ్యానానంతరము, నాయిచ్ఛాను సారము, శరీరమును త్యజించెదననియు. తాను కర్కటి యను రాక్షసియని తన వృత్తాంతమంతయు తెల్పెను. తనకు బ్రహ్మదేవుడొ సగిన విషూషి నివారణ మంత్రమును రాజుకు తెల్పెను. అంతట రాజు మంత్రి రాక్షసికి, శిష్యులు, మిత్రులు గూడనయి, రాజు ఆహ్వనము ననుసరించి, ఆతిధ్యమును స్వీకరించుటకు ఒప్పుకొనెను. తనకు నరమాంసమే ఆహారమని తెల్పెను. 

అపుడు రాజు తన రాజ్యమందలి దుష్టులు, చోరులు, వధార్హులు నగు వారిని, నీకు భోజనముగ అర్పింతునని పల్కెను. అనంతరము తపస్సును కొనసాగించుమనియు, తదుపరి నీ కెపుడు ఆహారము కావలసి వచ్చినను, ఇచటకు వచ్చిన తగిన ప్రాణులను నీ కర్పింతునని పల్కెను. అంతట ఈ రాక్షసి వల్లెయని చెప్పి, రాజు మందిరమునకు, స్త్రీ రూపమున ప్రవేశించి ఆరు దినములు గడిచిన పిదప రాజు, మూడు వేల మంది వధార్హులను రాక్షసి కొసగెను. వారందరిని రాక్షసి పర్వతమునకు కొనిపోయి భుజించి 3 రోజులు నిద్రించి తరువాత ఆరు సంవత్సరములు సమాధి నుండి పిమ్మట రాజు కోర్కెననుసరించి, వారి రాజ్యమునకు బోయెను. 

రాజు మునుపటి వలె రాక్షసికి ఆహారమిడెను. ఇట్లు రాజు తదుపరి తన కుమారుడు, రాక్షసికి మిత్రులుగ వుండి చిరకాలము గడిపెను. తదుపరి ఆ కిరాతరాజ ప్రజలు కర్కటి విగ్రహమును ప్రతిష్టించి, కంధరాదేవి, అమంగళి అని పేరిడి వారి బాధలు నివారించుటకు, ఆమెకు వధ్య ప్రాణులను బలిచ్చు చుండిరి. వారి బాధలు తొలగింపబడు చుండెను. నేటికిని ఆ కంధరాదేవి ఆ కిరాట రాజ్యమున విజయము గాంచుచుండెను.

ఇట్లు వసిష్టుడు కర్కటి చరిత్రను పూర్తి చేసి, ఈ జగత్తంతయు ఆది మధ్యాంత రహితమును, పరమ కారణమగు, బ్రహ్మము నుండి, యుత్పన్నమైనదని, యధాతధముగ నేవియు యుత్పన్యము కాలేదనియు తెల్పెను. బీజము కంటె వృక్షము, ఫలములు వేరు గాకయున్నట్లు, జగత్తు బ్రహ్మము కంటే భిన్నము కాదు. 

ఈ తత్వోపదేశము వలన జ్ఞానోదయ మయి నపుడే, జగత్తంతయు, బ్రహ్మము నుండి కల్గినదని, మరల బ్రహ్మ మందే లయించు చున్నదని తెలియగలదు. విద్య, అవిద్య, సుఖము, దు:ఖము మొదలగునవన్నియు మిధ్యాకల్పనలె. అజ్ఞానుల కొరకే అవి కల్పించబడినవి. యదార్ధమునకు బ్రహ్మమందే విధమైన భేదము లేదు. ఈ దృశ్యమంతయు, అద్యంత రహితము, అఖండమునగు ఒక పరమాత్మయె. అని ఆత్మబోధ వలన తెలియగలదు. వాద వివాదము లన్నియు తత్వమెఱింగిన పిమ్మట, లేనివేయగుచున్నవి. 

ఈ చిత్తము మాయా రూపమగు, జగత్తుతో ఎట్లు విస్తరించుచున్నదో, ఆత్మ, దృశ్య రూపమెట్లు పొందెనో తెల్పెదనని వసిష్టుడుశ్రీరామునకు తెల్పెను. బ్రహ్మదేవుడొ కప్పుడు వసిష్టునకు తెల్పిన కతను వసిష్టుడు శ్రీరామునికిట్లు తెల్పెను.

సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹


🌹 YOGA-VASISHTA - 48 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 UTPATTI PRAKARANA - 18 🌴

🌻 2. THE STORY  OF LILA 🌻

Now  Lila,  the  spouse  of  Padma  was  extremely surprised  to  find  Lila,  the  spouse  of  Viduratha,  an exact  counterpart  of  herself,  like  an  image  reflected in  a  glass.  Thereupon  she  queried  Saraswati  as  to how  it  was  she  was  re-duplicated  afresh?  The moon-coloured  Saraswati  cleared  her  doubts  in  the following  manner  „Actuated  by  an  excessive  love towards  you  your  husband  Padma  thought,  at  the moment  of  death,  of  enjoying  your  company without  being  ever  separated.  Accordingly  he  was able  to  get  you  here.  

Whatever  is  thought  of  by  one at  the  time  of  his  agonizing  death  that  will  be realized  by  him  afterwards.  Will  a  glass  reflect other  than  that  which  is  placed  before  it?  Inasmuch as  death,  birth,  mental  delusion,  the  waking, dreaming  and  dreamless  states  are  all  one,  not being  in  another  as  its  cause  (or  each  of  them  not having  another  as  the  cause),  all  things  that  are  and that  are  not,  are  of  the  nature  of  delusion  only  and hence  increase  beyond  number.  

Now  the  impure enjoyments  are  of  two  kinds.  Please  hearken  to them.  Some  experiences  arise  as  the  result  of former  ones.  Others  arise  newly,  being  entirely different  from  the  previous  ones.  Hence,  as  in  the former  case,  the  new  Lila  with  all  your  former form,  observances,  race  and  conduct  of  life, appeared  not  different  from  you  like  your  shadow. It  was  through  the  thought  of  the  king,  that  she was  moulded  unto  her  present  form  like  yourself. Vidti-  ratha  will  perish  in  this  war  and  then assume the  body of  Padma.‟   

So  said  Saraswati,  when  the  new  Lila  submitted thus  „Oh  you,  who  seem  to  be  Saraswati  herself whom  I  adored  in  former  times,  please  confer  on me  the  boon  that,  in  the  event  of  my  partner perishing  in  this  war,  I  may  live  in  this  body  of mine  along  with  him  wherever  he  is.‟  To  which Saraswati  nodded  assent.   

Again  the  old  Lila  questioned  the  Mother  of  Vedas thus  „How  was  I  able  to  journey  to  the  higher  Loka and  the  supreme  Girigrama  with  the  aid  of Adhibhautika  body  only  and  not  with  the Adhivahika  body  (while  the  new  Lila  was  blessed otherwise)?  To  which  the  goddess  replied  thus  „I never  give  anything  (without  any  cause)  to  any person.  People  get  all  things  according  to  (or  as  the result  of)  their  thoughts.  

You  thought  of (acquiring)  Jnana  before  and  implored  me  for  it and  I  gave  you  therefore  the  Divine  Vision  longed for  by  you.  This  damsel,  your  shadow,  prompted by  excessive  desire  asked  of  me  another  boon which  was,  as  promptly,  granted.  All  men  through my grace get  whatever  their  minds  long after.‟ 

With  a  terrible  angry  face,  the  valiant  Viduratha mounted  his  car,  marched  into  the  field  of  battle with  his  multitudinous  host  and  attacked  his enemies  so  furiously  as  to  drive  them  into  the  path of  Death.  Both  the  Lilas  of  undying  affection  for their  Lord  and  yet  in  anticipation  of  his  death addressed  Saraswati  thus,  „Oh  mother,  how  comes it  that  in  spite  of  our  Lord‟s  dauntless  courage  and your  grace,  our  husband  should  die  so  soon  in  this war?‟Saraswati  replied  „As  the  learned  Viduratha longed  after  the  higher  spiritual  state,  he  has  to merge  secondless  into  the  supreme  Seat. 

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 257 / YOGA-VASISHTA - 257

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹