శ్రీ యోగ వాసిష్ఠ సారము - 33 / YOGA VASISHTA - 33


🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 33 / YOGA VASISHTA - 33 🌹

✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు

📚. ప్రసాద్ భరద్వాజ 


🌴. ఉత్పత్తి ప్రకరణము  🌴

🌻. భావనా జగత్తు - 1 🌻

  

లీలావతి వృత్తాంతము తరువాత వసిష్టుడు శ్రీరాము నుద్దేశించి ఇట్లు చెప్ప దొడగెను. దృశ్య పదార్ధములు, అసత్యములని లీలావతి వృత్తాంతము తరువాత తెలియుచున్నది. జ్ఞానులు దృశ్య పదార్ధములు మిధ్యయని ఎంచుదురు.


 చైతన్య రూపుడగు స్వయం ప్రభువు ఎట్లు భావించునో అట్లే జరుగును. సృష్టి, స్ధితి, లయములు అతని అభీష్టములే. నిర్మలాకాశమున ఈ జగత్తు, బ్రహ్మత్మకముగ ప్రతిభాసించుచున్నది. ఇయ్యది బుద్ది వికాసమగుట వలన జీవుని యందే ప్రకటితమగుచున్నది. అంతయు కేవలము భ్రాంతియె. ఎప్పుడు విజ్ఞానము పోందునో,అప్పుడు అతని కట్టి అనుభవమే కల్గును. 


నిరంతరము, అమృతమని భావించిన విషము కూడ అమృతమైపోవును. మిత్రుడని భావించిన శత్రువు మిత్రుడగును. పదార్ధములు ఏ భావమున భావించబడిన, భావనా ప్రభావము వలన, అట్లే ప్రకటితమగును. బుద్ధి చిత్తముననుసరించి సంకల్పించునట్లు పదార్ధములు అట్లే ప్రకటించును. 


ఒక్క నిముషమున పెక్కు కల్పములు భావించి, అట్టి బుద్ధిబడయగల్గిన, ఆ నిముషమే కల్పముగ తోచును. స్వప్నమున మరణించి మరల జన్మించి తాను, యువకుడ నైతినని, శతయోజనములు నడచితినని తోచును. హరిశ్చంద్రుడు ఒక రాత్రి యందు పది రెండు వర్షములు గడిపినట్లు అనుభవించినాడు. లవణుడను రాజు ఒక రాత్రి యందు నూరేండ్లు అయ్యెనని అనుభవించినాడు.


నారదుడు కొద్ది సమయములోనే వివాహము, పిల్లులు, సంసారము, దుఃఖములను అనుభవించాడు. ప్రజాపతి ముహూర్త కాలము మనువుకు జీవిత కాలము. బ్రహ్మ యొక్క జీవితకాలము, విష్ణువునకు దినము. విష్ణువు యొక్క జీవిత కాలము శివునికి ఒక్క దినము. నిర్వకల్ప సమాధి యందులీనుడైన యోగికి దివారాత్రి భేదము లేదు. అతనికి ఆత్మ పదార్ధము ఒక్కటియె సత్యము. దుఃఖము, ఆనందము, వైరాగ్యము అప్రియములు. మధురమైన భావమున చింతించిన కష్టతరమగు మనోరధము మధురమగును.


విషయభోగములు అనుభవింప సాయపడు బంధు మిత్రులు పురుషార్ధమునకు అడ్డంకులై శత్రువులగుదురు. కావున ఈ జగత్తు భావనామయము. శాస్త్ర పాఠములు, జపాదులు, సాధనలేనిచో కఠినములుగను, సాధన చేసిన వారికి తేలికగను తోచును. ఆకాశయానము చేయువానికి చెట్లు, గ్రహములు, భూమి కదలుచున్నట్లు తోచును. అజ్ఞానము వలన స్వప్నము నందువలె, శూన్యము కూడ పూర్ణముగ తోచును. గ్రహించుట యందలి దోషము వలనే పచ్చని పదార్ధములు నీలముగను, లేక తెలుపుగనో తోచును. స్వప్నము నందు వనిత రతిని గూర్చి నట్లు, జాగ్రత్తలో గూడ జరుగు రతి చివరకు భ్రాంతియె.


 మనో స్పందన వలెనే ఆకాశములో జగత్తు కనబడుచున్నది. బాలుడు మనోవికారము వలెనే, పిచాచమును గాంచును, తత్వజ్ఞులు మాయా కల్పితమైన ఈ జగత్తును అనిద్రితుడగు వాడు కాంచు అపూర్వ స్వప్నమని ఎఱుంగును. జీవాత్మ బ్రహ్మము నుండి వేరు కాదు. ఒకడు యద్దమొనర్చుచున్నట్లు కాంచును, అప్పుడది సత్యమే అని తలచును. తదుపరి అతనికి అది మిధ్య అని తెలియును. ఈ జగత్తు స్మృతిజ్ఞప్తుల నుండి కలుగుట వలన సంస్కారయుతమే. వాస్తవము కాదు. ఈ జీవులలో నెయ్యది బ్రహ్మకారమున వెలయుచు, విషయదోషములను గ్రహించి, అట్లే అది విదేహముక్తి వరకు ఉండి బ్రహ్మమున లీనమగుచున్నది.

 

సముద్రమున కరుగు మహానది, ఇతరములగు ఉపనదులను తన యందు కలుపుకొనునట్లు, సత్యమగు బ్రహ్మాకార జ్ఞానము మాయను జగత్తును లోబరుచుకొని, ముక్తిని పొందును. అత్యంత ధృడముగా బ్రహ్మ భావనకు ప్రయత్నించువారు, విజయమును పొందుచున్నారు. ఇతరులు ప్రయత్నములో నున్నారు. పరమాణు కణముల నుండి, భ్రాంతియగు ఈ సృష్టి వెలువడి నశించుచున్నది. లేని వస్తువులు లభించుట గాని, లభించకపోవుట గానిలేదు. చిదాకాశము ఒక్కటియె యున్నది. అవివేకమైన ఈ స్వప్నము బ్రహ్మసాక్షాత్కారమగు వరకు అగుపించుచున్నది.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 YOGA-VASISHTA - 33 🌹

✍️ Narayan Swami Aiyer

📚 🌻 Prasad Bharadwaj


🌴 UTPATTI PRAKARANA - 3 🌴


🌻 1.  THE STORY  OF AKASAJA, THE  SON  OF AKASA 🌻


🌷 Upon  hearing  the  adventures  of  him  who  rose  out of  Jnanakasa,  you  will  easily  understand  the  origin of  the  creation  of  this  universe  replete  with  Tamas. You  will  therefore  hear  this  story.  Once  upon  a time,  in  the  race  of  Brahman  was  born  one,  Akasaja (the  son  of  Akasa),  having,  as  his  cause,  the Jnanakasa  itself.  


He  rejoiced  in  the  possession  of uninterrupted  Samadhi,  earnest  regard  to  wards  all creatures  and  good  Dharmas  (or  virtuous  actions). Having  seen  him  live  for  a  long  period,  Kala (Time)  soliloquised  to  himself  thus  „How  is  it  I  am not  able  to  encompass  this  one,  when  I  am  able  to devour  the  whole  universe  as  a  mere  paltry  trifle. 


My  powers  are  such  as  to  annihilate  everything.  I am  led  to  infer  my  powers  have  been  much dullened  of  late,  like  the  blade  of  a  sword  in poison.  Persons  of  determined  efforts  will  never abandon  their  pursuits.‟  With  these  cogitations  in his  mind,  he  at  once  marched  straight  to  the habitation  of  the  Brahmin  (Akasaja)  and  entered his  gates  when  he  was  (bedazzled  and)  scorched by  the  intense  glory  of  the  Brahmin‟s  spiritual  fire. 


Nothing  un  daunted,  Kala  pierced  through  the spiritual  glory  and  with  his  tall  and  stalwart  arms, I,000  in  number,  seized  hold  of  the  Brahmin  but was  disappointed  in  his  efforts,  as  he  was  too much  for  Kala.  As  Akasaja  was  immovable  like  one of  the  forms  (aspects)  of  Sankalpa  (Divine  will), Kala  was  unable  to  overpower  him  and  so returned  from  that place  to  go  to  Yama (22)  (or  God  of death)  and  consult  with  him.  To  Yama,  Kala related  all  that  happened  between  him  and  the Brahmin.   


Note 22 : Kala  here  refers  to  unconditioned  time  whereas  Yama  refers  to  the conditioned  one  in  the  Rupa  Lokas putting an  end  to  mortals,  etc.   


🌷 The  advice  of  Yama:  🌷

At  which,  Yama  said  thus  „This universe  which  arose  through  Karmas  will  perish through  Karmas  only.  The  weapons  with  which  we can  wield  the  destruction  of  the  universe  are  the former  Karmas.  Therefore  try  to  take  hold  of  those Karmas  (in  the  life  of  the  Brahmin)  through  which means you  will  be  able to overpower  him.‟   


Hearing  those  words  of  Yama,  Kala  fished  about for  the  former  Karmas  of  the  Brahmin  in  different places,  such  as  the  holy  waters,  tanks,  the  sphere  of the  earth,  quarters  and  others.  But  nowhere  was  he able  to  discern  any,  in  spite  of  all  his  tedious search.  At  last,  he  returned  and  disclosed,  to  the wise  Yama,  the  fruits  of  his  vain  search.  


Thereupon Yama  deliberated  for  a  long  time  and  delivered himself  of  the  following  words  „Born,  as  he  is,  out of  the  pure  Akasa,  this  imperishable  Brahmin  is  no other  than Jnanakasa  itself.  And  as  he  has  no  cause, instrumental  or  material,  he  cannot  be  said  to perform  Karmas,  though  performing  them.  There being  really  no  cause  at  all,  the  Karmas  he performs  do  not  really  exist.  The  Sanchita  Karmas (past  Karmas  in  latency)  which  will  enable  you  to put  an  end  to  him,  do  not  exist  in  his  case.  ‟So  said the  fulfiller  of  Dharmas  (laws),  namely,  Yama,  at which  the  noble  Kala  quietly  betook  himself  to  his own  place  in  great  wonderment.


At  these  words  of Vasistha,  Raghava  having  eyed  him  said  thus „From  the  story  given  out  now  by  your  reverence,  I am  led  to  conclude  that  the  son  of  Jnanakasa  is  no other  than  Brahma,  the  self-create  and  the  nondual  one  of  the  nature  of  Vijnana.  

🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 257 / YOGA-VASISHTA - 257

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹