శ్రీ యోగ వాసిష్ఠ సారము - 45 / YOGA-VASISHTA - 45
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 45 / YOGA-VASISHTA - 45 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ఉత్పత్తి ప్రకరణము 🌴
🌻. సమాధానములు 🌻
అంతట మంత్రి, ఓ రాక్షసి నీ ప్రశ్నలన్నింటికి నేను సమాధానమొ సంగెదను.
ఉత్తమ వచనములచే నీవు పరమాత్మను గూర్చియె తెలిపి నావు. వాక్కున కతీతము, పంచేద్రియముల చేతను, మనస్సు చేతను గూడ పొంద నశక్యమైనది యునగు ఆత్మయె, అణు స్వరూపమును, ఆకాశము కంటెనూ స్మూక్షమమును అయివున్నది. ఆ పరమ మగు చిదణువు నందే ఈ జగత్తంతయు, బీజము నందు వృక్షము వలె స్పురించుచున్నది.
సద్వస్తువు, సర్వుల యనుభవరూపమును అగుట చేతను, అందరి ఆత్మయై యుండుట చేతను, సృష్ట్యాది యందును స్ధితి గల్గి యున్నందు చేతను, సమస్త పదార్ధములను దాని వలనే సత్తను బడయుచున్నవి.
చిదణువగు ఆ పరమాత్మయె, బాహ్య వస్తు శూన్యమగుటచే నాశమనియు, శుద్ధ చైతన్యము మగుటచే నాశము కంటే భిన్నమనియు, చెప్పబడును. ఆ చిదణువు ఇంద్రియముల కవిషయముగాన రూప రహిత మనబడినది. అంతయు తన రూపమగుటచే, సర్వరూపి యనియు, దృశ్య రహితమగుటచే అ రూప మనియు నది చెప్పబడును. ఏ యుక్తిచే నయినను సత్తు అసత్తు కాజాలదు. కర్పూరము తన సుగంధము ద్వారా, అంతయు వ్యాప్తమై యుండు చందమున, సద్రూపమగు ఆత్మయె అంతటను, అనుభూతమగు చున్నది.
ఇంద్రియ వృత్తులచే, ఆచిద్వస్తువు అనేక రూపములుగ ప్రతీత మగుటచే, అంతయునదే యగును పరమాత్మ ఏకమై యున్నను, ఉపాధి భేదముచే, అనేకముగ నున్నది. సర్వుల ఆత్మ స్వరూప మగుటచే, జగత్తు నంత నదియె ధరించుచున్నవి.
ఇంద్రియముల కప్రాప్యమగుటచే శూన్యమనియు, ఆత్మసాక్షాత్కారముచే లభ్యమగునదిగాన, ఆకాశ రూపమైనను శూన్యము కాదనియు చెప్పబడుచున్నవి. ఈ చైతన్యాణువే ఆకాశమువలె, అనేక యోజనములు వ్యాపించి యున్నందున చలించుచున్నను, చలించకయున్నది. సర్వ వ్యాప్తమై యున్నందున, ఎల్లెడల సంచరించు చున్నను. స్ధిరముగా నుండును.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 YOGA-VASISHTA - 45 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj
🌴 UTPATTI PRAKARANA - 15 🌴
🌻 2. THE STORY OF LILA 🌻
Saraswati replied „It is only through the development of Jnana that all the dual substances in this world will become non-dual. As you were in possession of Jnana (knowledge) not freed from the thoughts of „I‟ (or individuality), the true (or voluntary) Sankalpa did not arise in you. Hence it was that all those in the royal assembly were not able to see you. But then in the second case, with the possession of the true Jnana divested of all thoughts of individuality, you created the conception of „I‟ through your own Sankalpa and it was only then that the sons, etc., did see you.‟
Then Lila overjoyed gave vent to the following words „Through your grace, Oh Saraswati, I have known all my former births as clear as daylight. I have cleansed myself of all sins arising from the three gunas. After being differentiated as a separate entity out of the one Brahman, I have undergone different births in 800 bodies (33.) Like bees in a lotus flower, I have been inhabiting the many worlds created through Maya-Vikalpa (or the modifications of Maya).
I was born as a Vidyadhara lady and then as a human being through the force of Vasanas. In another loka of Maya-Vikalpa, I went through a series of births in the different bodies of Indrani, a huntress clad in leaves, a bird rending the snare it was enmeshed in, a king of Saurastra country and a mosquito. Thus have I been whirling in many births and having been tossed to and fro in the clutches of Maya, like a straw in ocean waves, I have now been landed safely on the shore of Mukti (Salvation) through your aid.‟ Thus did Lila eulogise her and both then mounted up the Akasa.
Note : 32 - i.e. the world
33 - The number above given tallies nearly with that given out in the Theosophical literature by Mr. Sinnett
Passing through the Akasa by dint of Yoga power, they went to where Padma was and saw his body. After that was over, they went to where the king Viduratha was, who was the second incarnation of King Padma.
At this juncture, both these peacocklike ladies observed the incomparable king of Sindhu of tremendous prowess march against Viduratha. A fierce war was waged between the two armies, striking terror into the heart of Death even. Viduratha s innumerable army was reduced by the enemy to an eighth of its original number. Then the sun disappeared from view, as if afraid of either this terrible war or the mountain heap of carcases. With the setting in of intense darkness, both the armies ceased to battle.
With the disappearance from the field of the enemies hosts, king Viduratha returned with a broken heart along with the shattered remnants of his army to his own palace. Whilst he rested upstairs in sleep, Saraswati and Lila came up to where he lay. Being quite refreshed by their Tejas (radiant effulgence) which was like the nectary rays of the moon, his lotus-like eyes began to bloom and beheld, before him, these two ladies whom he saluted and eulogised.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments
Post a Comment