శ్రీ యోగ వాసిష్ఠ సారము - 49 / YOGA-VASISHTA - 49
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 49 / YOGA-VASISHTA - 49 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ఉత్పత్తి ప్రకరణము 🌴
🌻. ఐందవో పాఖ్యానము - 1 🌻
బ్రహ్మ ఒకానొకప్పుడు ఉదయముననే మేల్కొని, ఆకాశమును బరికించగా, అచట అంధకారముగాని, ప్రకాశముగా లేకుండెను. అపుడు సృష్టి గావించుటకై, ఏకాగ్ర చిత్తమున, అతడు బాగుగ అవలోకించి, విష్ణువు మొదలగు వారిచే పాలింప బడు వేరు వేరు సృష్టులను గాంచెను. అండజాది, చతుర్విధ ప్రాణులతో కూడియున్న, భిన్నభిన్న సృష్టుల గాంచెను.
దేవతలు, మనుజులు దానవులు, వివిధ ఋతువులు, స్వర్గ నరకాదులు, భూతకోటులు, తమతమ యభీష్ణ సిద్ధి కొరకు చేయు కృత్యములు, సప్తలోకములు సప్తద్వీపములు, సప్తసముద్రములు, పర్వతములతోను, విద్యుత్ కాంతులు, నక్షత్రములతోను, ఆకాశము నిర్మలముగ నున్నట్లు చూచెను. ఆ లోకము లందంతట, యుగ, కల్ప, క్షణ, నిమిషాది రూపమున నున్న కాలము సమస్త పదార్ధముల నాశనముకై, ప్రతీక్షించుచుండెను.
ఇవన్ని చర్మ చక్షువులకుగాక, మనోనేత్రమునకు, ఎందు వలన కనిపించు చున్నవని ఆలోచించెను. తదుపరి బ్రహ్మ, ఆకాశమున నున్న ఒక సూర్యుని పిలచి ఈ జగత్తు ఎట్లు ఉత్తన్నమైనది తెలుపుమని అడిగెను. అంతట సూర్యుడు బ్రహ్మ నుద్దేసించి, ఈ సృష్టి యంతయు కేవలము, మనో విలాసము మాత్రమే నని, చెప్పుచూ ఐందవోపాఖ్యనము నిట్లు తెల్పెను.
పూర్వకాలమున, జంబూద్వీపమున సువర్ణ జటయను పేరు గల ప్రదేశము నందు బ్రహ్మ విదుడైన, కశ్యప కులోత్పన్నుడైన ఇందువను బ్రాహ్మణుడుండెను. అతడు బ్రహ్మ విష్ణువుల సాంగత్యముతో, భార్యతో నివసించుచుండెను. కాని వారికి సంతతి లేకుండెను.
అందుచే దంపతులిరువురు, పుత్ర సంతాన ప్రాప్తికై, కైలాస పర్వత ప్రదేశ మందున, జలాహారముతో, ఘోరతపము చేయదొడగిరి. చివరకు చంద్ర శేఖరడగు మహదేవుడు, ప్రత్యక్షమై, అభీష్టవరమును కోరుకొమ్మనెను. అంతట ఆ దంపతులు, యుత్తమ గుణ సంపన్నులు, బుద్ధి శాలురగు పదుగురు కొమరులు గల్గునట్లు అనుగ్రహించమని కోరెను.
ఈశ్యరుడు వారికి ఆ వరము నొసగి అంతర్ధానమయ్యెను. క్రమముగా బ్రాహ్మణ స్త్రీ గర్భవతియై, పది మంది పుత్రులను గనెను వారు క్రమముగ, ఏడు సంవత్సరముల ప్రాయముననే, సర్వశాస్త్రముల నెరిగిరి. చాలాకాలము తదుపరి, వారి తల్లిదండ్రుల, శరీరము త్యజించి విదేహముక్తులైరి. అంతట ఆ పది మంది కైలాస పర్వతమునకు పోయి, ఇట్లు చర్చించు కొనసాగిరి
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 YOGA-VASISHTA - 49 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj
🌴 UTPATTI PRAKARANA - 19 🌴
🌻 2. THE STORY OF LILA 🌻
This king of Sindhu who has come to oppose him will gain the day over Viduratha in accordance with my mandates at his propitiation of myself and will become a king.‟ Whilst these were discoursing thus, the day broke and the battle field on both sides became completely void of all its living contents. Then both the kings alone survived and to ok up their bows and filled the sun, the moon, the quarters and the welkin with showers of arrows. The arrows hissing flames everywhere, it seemed as if the end of the Yuga was approaching. Then Viduratha was left alone without his car and driver.
His bow was unstrung; his diamond armour was shattered to pieces by his enemy s semi-circular arrows; all his limbs were rent asunder and thrown promiscuously; and then Viduratha‟s trunk came flat upon the ground. Whereupon the new Lila addressed her of the white lotus thus, „My husband is about to breathe his last; please allow me to join my husband,‟
Saraswati having prepared the way for it, the new Lila became light and ascended the Akasa. Having crossed one after another the Mandalas (spheres) of clouds, Vayu, the hot Surya (Sun)and Nakshatra (stars) and then Satya loka and other divine lokas and then breaking open the Mundane egg and piercing through the septenary veils of (Ap) water and others, she reached soon the immeasurable and endless Reality of Chidakasa at last.
There she went into the harem where Padma s dead body was lying, after crossing the Jnanakasa with its Avarnas (veils) in the midst of the many mundane eggs which are as innumerable as the fig fruits in a fig forest and which are uncrossable even in a long time with the speed of Garuda (eagle). Concluding that the dead body, covered up with flowers, was her Lord s and that somehow, through Saraswati s grace, she came ahead of him, she sat beside his body and fanned it gently.
While so the Jiva of king Viduratha was winging its way in the Akasa and without noticing the two ladies of Saraswati and Lila of Divine vision who were going behind it, reached the recess where Padma s body was lying. There these two ladies accompanied it and saw the new Lila before them. In the golden dome, the Jiva of Viduratha was arrested in its progress and prevented by Saraswati from getting ingress into the body of Padma.
Then the old Lila looked about for her former body and not finding it there, asked Saraswati as to what became of it. The goddess re plied thus When you fell into a profound trance of meditation, the ministers taking you for dead have disposed of it by consigning it to flames. If you stay on earth with Adhivahika body, then it will only revolutionize the world with wonder that the deceased Lila came corporeally here from Deva loka.
And as you have divested yourself of all Vasanas in this your Adhivahika body, it is but right that you should abandon that Adhibhautika body of yours,‟ Saraswati then willed in her mind that the new Lila should see her. Whereupon the latter was like one who had discovered the hidden treasure of a long lost personage and then saluting Saraswati by falling at her two feet, eulogised her.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments
Post a Comment