🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 14 / YOGA-VASISHTA - 14 🌹

✍️. రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
14 వ భాగము
🌴. ఉత్పత్తి ప్రకరణము 🌴
🌻. ఆకాశజుడు 🌻
ఆకాశజుడను బ్రాహ్మణుడొకడుండెను. అతడెంత కాలమైనను, ధ్యాన ప్రభావము వలన మరణించకుండెను.
మృత్యువు అతనిని ఎలాగైనా భక్షింపదలచి, అతని పురమునకు ప్రవేశించెను. అతడు అగ్ని మధ్యమున, ధ్యాననిమగ్నుడై యుండెను. మృత్యువు ఆ అగ్ని వలయమును ఛేదించి లోన ప్రవేశించి, అతనిని పట్టుకొన ప్రయత్నించెను. కాని, సంకల్ప సిద్ధుడైన ఆ బ్రాహ్మణుని, అతి బలశాలియైన మృత్యువు దరి జేరలేక పోయెను. మృత్యువు తదుపరి యముని చెంత కరిగి నిస్సహాయతను తెల్పెను.
అపుడు యముడు, వారి వారి పురాతన కర్మలే వారి మరణమునకు కారణమని, ఈ బ్రాహ్మణునకు అట్టి కర్మలు లేవని అందువలన నీవు అతనిని చంపలేవని తెల్పెను. అపుడు మృత్యువు అతని కర్మలేవైనా మిగిలియున్నవేమో తెలుసుకొనగోరి, నాలుగు దిక్కులందు, అడవులు, పర్వతములుగా గల భూమండలమంతయు గాలించినను ఎట్టి కర్మలు కనుగొనలేకపోయెను.
అపుడు మృత్యువు మరల యముని చేరి బ్రాహ్మణుని కర్మలెచట వున్నవని అడుగగా, అతడు ఆకాశము నుండి జన్మించిన వాడనియు, అతని కెట్టి సంచిత, ప్రారబ్ద కర్మలు లేవని, అతని చలనము దేహము వలన భ్రమ మాత్రమేనని తెల్పెను. అతనికి కర్మభావము లేదని తెల్పెను.
చెరువులోని అలలు చెరువులో భాగమే. అలలు శాశ్వతము కానట్లు, ఆకాశజుడును, ఆకాశములో ఒక భాగమే. అలల వలె అతడు భ్రమను కల్పించు చున్నాడు.
అతడు బ్రహ్మ వలన విరాట్ పురుషునిగా కనిపించి బ్రహ్మకు వేరుగా లేనివాడై యున్నాడు. అతనికి శరీరము లేదు, కర్మలు లేవు. కావున నీ ప్రయత్నములు మానుమని, యముడు మృత్యువునకు బోధించెను.
సంకల్పము అనగా భావించుట. మనస్సు యొక్క స్వరూపము. బ్రహ్మ దేవతలకు, అతి వాహకమైన, సూక్ష్మశరీరము మాత్రమే వుండును. తక్కిన ప్రాణులకు అతివాహిక మరియు పాంశ భౌతిక దేహములు రెండు వుండును. బ్రహ్మయే ప్రజాపతి. ఇతడు సంకల్ప మాత్రమున, సూక్ష్మశరీరము దాల్చి ఆకాశరూపుడై, ప్రజాసమూహమును సృష్టించును.
ప్రజాసమూహము బ్రహ్మ నుండి జన్మించినప్పటికి, జడశరీరము వలన అది సత్యమని భావించు చున్నారు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 YOGA-VASISHTA - 14 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj
🌴 VAIRAGGYA-PRAKARANA 🌴
🌷 Kala -
All the pleasurable objects of enjoyment in this world arising through Ajnana in the series of re-births take leave with the arrival of Yama (Death or Time), like a thread nibbled by a rat. There is nothing in this world which is not devoured by Kala (time) like Vadavaagni (the deluge fire) quenching the ocean waters abounding in crocodiles, fishes, etc.
Even in the case of the ineffable great Ones, he will not wait a minute beyond the allotted time. Having swallowed up everything, he would be all himself. Even glorious Divine Kings, the beneficent Brahma, Asura Vritra 7 of the might of Mahameru and others come under his clutches like a serpent under an eagle s grip. He will easily destroy all things, whether they be tendrils or leaves, a straw or Mahameru, the ocean waters or the lofty Mahendra mountains and wield them according to his will.
He now creates in the morning this forest of the universe with the Aswatha (fig) tree, wherein grow the fruits of the mundane eggs buzzing with myriads of the flies of egos and having seen them ripe in the noon through his eyes of the sun, plucks them now grown as the guardians of the quarters and eats them up (at night). He also strings in a rope of three gunas, even the gems of the highest men of the universe, and makes them his prey.
In this dilapidated dwelling of the small universe, he collects, in the casket of Death, all the worldly men scattered everywhere in it like rubies. Having hunted all the egos of beasts, birds, etc., in the great forest of this essenceless universe, he, at last, during the Maha- kalpa, sports in the tank of the great ocean filled with lotus of the shining Vadava fire. This personage of Time has, in the repast made of the diverse created worlds, all the living ones as his dainties of the six tastes such as bitterness, etc., and the incomparable seven seas of milk, clarified butter, etc., as his beverage; and cycles round and round in the objects created at every Mahakalpa.‟

Comments
Post a Comment