శ్రీ యోగ వాసిష్ఠ సారము - 34 / YOGA VASISHTA - 34
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 34 / YOGA VASISHTA - 34 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ఉత్పత్తి ప్రకరణము 🌴
🌻. భావనా జగత్తు - 2 🌻
ఈ స్వప్నము పూర్వానుభూతము మిధ్యయె.వృక్షము, ఆకులు, పూలు, పండ్లలో నిండివున్నప్పటికి వృక్షములోని భాగములే.
అట్లే నా నా విధాకారములు ఈ సృష్టిలో స్పురించుచున్నను బ్రహ్మమొక్కటియె. ఈ బ్రహ్మమును ఒకసారి గ్రహించిన మరల మరువజాలము. ఆకాశము శూన్యమే అయినను అందు ముత్యములు, భ్రాంతి వలన గోచరించునట్లు, బ్రహ్మమున ఈ జగత్తు గోచరించుచున్నది.
నీటి యందు తరంగములు లేచుచు లీన మగుచున్నవి. అవి నీటి యందు వేరు కావు. అట్లే బ్రహ్మమున సృష్టితరంగములు లేచుచు లీనమగుచున్నవి. అవి బ్రహ్మము నుండి భిన్నము కావు. ప్రకృతి నుండి వాయువు యుత్పత్తి అగుచున్నది. అది బ్రహ్మము కన్న వేరుకాదు. వాయువు నుండి తేజము; తేజము నుండి జలము వేరగుచున్నది. అలానే జలము నుండి పదార్ధము వేరగుచున్నది. ఇట్లు ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి, అను పంచభూతములు ఏర్పడుచున్నవి. ఇవన్నియు బ్రహ్మమునకు వేరు కాదు. అలానే ఆకాశము శబ్దముతో కూడియున్నది. వాయువు స్పర్శ జ్ఞానము కల్గియుండగా; అగ్నిరూపము; జలము రుచి; భూమి వాసన లక్షణములు కల్గియున్నవి.
తేజము ప్రకాశము అను బుద్దితో చూచిన అది సత్యము. అలానే బ్రహ్మము, జగత్తు ఒకటే అనుకొనిన అది సత్యమే అగును. గింజ నుండి మొక్క ఎట్లు ఏర్పడుచున్నదో, చివరికి ఆ మొక్క నుండే గింజ రూపొందుచున్నది. అలాగే బ్రహ్మము నుండి ప్రకృతి. ఆ ప్రకృతియె అంతర్గతముగ భ్రమై యున్నది. పాల యందు తీపి, మిరియము నందు కారము, గాలి నందు చలనము కలిసియున్నట్లు, బ్రహ్మము ప్రకృతి యందు ఇమిడి యున్నది. ఎట్టి కారణము లేకుండ గనే బ్రహ్మము జగ దూపమున ప్రకాశించుచున్నది. ఈ ప్రకాశము బ్రహ్మము నుండి వేరుకాదు.
వాసనలు చిత్తము. జీవులు, మనస్సు నుండి యుత్పన్న మగుచున్నవి. జ్ఞాన యోగము, ధృడ అభ్యాసము, పురుషప్రయవ్నము వలన మనస్సు నాశనమయిన, బ్రహ్మము వ్యక్తమగును. సర్వాత్మకము, శాంతము, అజము, చిన్మయమునగు బ్రహ్మము నిత్య ప్రకాశమై, జనన మరణ రహితమైయున్నది. ఈ సృష్టి పరంపర యంతయు పరమాణువులతో కూడుకొని యున్నది. పరము నందు స్వప్నములుండవు. కావున అవన్నియు మిధ్యయె. నీటి యందు అలలు వెలువడును. అవి అణగి యుండును. అలానే జీవుని యందు జగత్, స్వప్న సుషిప్తి వ్యవస్థలు వెలయుచుండెను.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 YOGA-VASISHTA - 34 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj
🌴 UTPATTI PRAKARANA - 4 🌴
🌻 1. THE STORY OF AKASAJA, THE SON OF AKASA 🌻
‟Thereupon the immaculate Vasistha said thus „We have known thus the words which passed between the havocproducing Kala and Yama. (We shall describe still further what took place between them.) When, at the end of a Manu, the never-idle Kala who had swallowed up all the universes rose up, he tried to overpower even Brahma (as stated before). Then the lofty Yama delivered himself of the following words to the griefless Kala „Will that thought of yours fructify, which aims at destroying the incomparable Brahma that is of the nature of the stainless and matchless Brahmakasa, (or Jnanakasa) alone?
The indestructible Brahma shines like the above mentioned Sankalpa-Purusha of the form of pure Akasa alone without being composed of the elemental forms. It is the selfexistent Para Brahm only which is Chidakasa itself, alone and without beginning, middle or end, that manifests itself as true, like one having a body of dimensions or an eternal Purusha; but it really has no form (and is unreal) like the son of a barren woman.‟ So said Yama to Mrityu (or Kala).
At these words of Vasistha, Rama lifted up his eyes and questioned him thus „While all souls possess two kinds of bodies, viz., the lasting Adhivahika (23) and the temporary Adhibhautika how comes it that Brahma possess the former subtle body alone?
‟To which, Vasistha said thus „As all the Jivas have two causes, vie., Brahman and the universe due to Brahmic light, they have two kinds of bodies; but as Brahma who is not separate from Brahman has no other cause than Brahman, he has the one Adhivahika body alone. Then as this universe is nothing but a mode of the mind self-evolved from Brahman, the cause of the universe, hence this all-pervading world is but consciousness itself.‟ So said the Muni lovingly, when Rama asked to be enlightened as to why this illusory universe is but a mode of the mind.
Note 23 : Adhivahika is the subtle body with which the soul lives while separated from Adhibhautika, the physical body.
The mind creating the universe: Vasistha continued thus „The individualised mind which is Avidyafull, form less and all-pervading though existing in name, has no form, either externally or internally, like the Akasa permeating everywhere. The mere manifestation in all objects of reality (or non-reality therein) is the mind.
Wherever there is the Sankalpa, there does the mind exist. The form of the mind is Sankalpa alone. Both of them are identical. The multitudinous denominations of unreality, delusion, impurity, bondage, Avidya, Maya, Tamas and others are the fit synonyms of Sankalpa.
With the annihilation of this Sankalpa, all conception of the differences between the seer and the seen will vanish and then the Reality of Brahman will begin to shine unintercepted. Then this shadow of all the universe moveable and fixed, will be found absorbed in It in a non-dual state, though, in another sense, they cannot be said to commingle with it. Then Consciousness alone will shine without the reflections of a glass.
If all the heterogeneous differences of objects arising through the conception of the mythical „I‟ and „You‟ are controlled and even a scintilla of the visibles be completely destroyed beyond resurrection, then such a destruction is itself the certitude of Kaivalya (or Salvation).
🌹 🌹 🌹 🌹 🌹
Comments
Post a Comment