శ్రీ యోగ వాసిష్ఠ సారము - 35 / YOGA VASISHTA - 35


🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 35  / YOGA VASISHTA - 35 🌹

✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు

📚. ప్రసాద్ భరద్వాజ 


🌴. ఉత్పత్తి ప్రకరణము  🌴

🌻. నియమబద్ధత (నియతి) 🌻

   

11 భోగములందు జీవునకు ఏ మాత్రము విరాగము గల్గిన, అతడు ఉత్తమ మగు పదము పొందునని శ్రుతి పల్కుచున్నది. సంపూర్ణ విరాగము వలన జీవస్ముక్తి కల్గును.


స్వప్నమునను ఇంద్రజాల మందు కనిపించు పర్వతములు, పట్టణములు, మిధ్య అయినట్లు, సృష్టి మిధ్య అయినను, సంకల్ప బలము వలన, అనుభవ యోగ్యములగు చున్నవి. దేహి యొక్క దేహము నుండి, హస్త పాదాది అంగములు వేరుగా కనబడుచున్నవి. దీనినే దైవ మందురు. ఇది సర్వకాల వ్యాప్తి, సకల వస్తు వ్యాప్తి, చైతన్య రూపమగు ఈశ్వర సంకల్పము. దీని చలనమిట్లుండును. ఈ సమయమున, ఈ విధముగా ఇదియుత్పన్నమగు నియతియె దైవము. 


ఈ నియతి పురుషాకారము, పురుష ప్రయత్నము వలన ఏర్పడును. నేను చెప్పుట నీవు వినుట ఆచరించుట మొదలగువన్ని నియతి యొక్క ఫలమే. ఈ బ్రహ్మమును, నియతియు, సృష్టియు ఒక్కటే. కల్పారంభము నుండి, ప్రళయము వరకు జరిగెడి వన్నియు నియతి వలననే జరుగుచున్నవని గ్రహించవలెను. జరుగవలసినది నియతి ప్రకారము జరుగక మానదు. అగ్ని తాపము నిచ్చుట, నీరుపల్ల మునకు ప్రవహించుట నియతికి నిదర్శనము. పురుషాకారము నియతి ప్రకారమే ఆచరింపవలెను.


ఎవడైన నియతి ననుసరించి భోజనాధులను వర్జించిన అతనికి క్షుద్బాద తప్పదు. అయినా కొంత కాలము జీవించును. కాని ఉశ్వాస, నిస్వాస రూపమగు పురుషాకారము త్యజించిన నతడు మరణించును కదా! నిర్వి కల్ప సమాధి యందు, వాయువును నిరోధించి, ముక్తి నందుట పురుషాకారము వలననే, అందువలన నియమ బద్ధత ననుసరించి పురుషాకారము ననుసరించవలెను. నీటి వలననే తృణ, లత, వృక్షాది రూపములు ప్రకాశించునట్లు, సర్వగామి యగు బ్రహ్మమే నియతి రూపమున ప్రకాశించుచున్నది.


బ్రహ్మతత్వము సర్వకాల సర్వావస్ధల యందును శక్తివంతమై వెలయుచున్నది. ఈ బ్రహ్మమే ఆత్మ. సాత్విక ఉపాధులందు శాంతమును, తామసిక ఉపాధులందు జడశక్తిని, రాజస ఉపాధు లందు రాగద్వేషములను, ప్రకటించును. ప్రళయ, సుషిప్తి కాలమున నేమియు ప్రకటించబడదు.


ఈ బ్రహ్మం ఎచ్చట ఏ రూపమున నుండునో అచ్చట ఆ లక్షణములు ప్రకటించును. బుద్ధి మంతులు లౌకిక వ్యవహారము లందు నానాత్వము కల్పించినప్పటికి, ఆత్మ యందు ఎట్టి భేదము లేదు. ఏది బుద్ధికి తోచునో, అది అట్లే గోచరించును. కాన పరమార్ధ దృష్టికి అంతా ఒకటే. చిచ్చక్తియె వివిధములుగ ప్రకాశించుచున్నది. బ్రహ్మం ఒక్కటియె సత్యం.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 YOGA-VASISHTA - 35 🌹

✍️ Narayan Swami Aiyer

📚 🌻 Prasad Bharadwaj


🌴 UTPATTI PRAKARANA - 5 🌴


🌻 1.  THE STORY  OF AKASAJA, THE  SON  OF AKASA 🌻


🌷 The  time  for  the  minds  destruction: 🌷

Like  a  dream gene  rating  another  dream  in  it,  the  mind  having no  visible  form  will  generate  non-existent  visibles. Not  resting  on  any  object  firmly,  it  is  characterised by  an  excessive  fluctuating  power.  It  will  fluctuate and  be confused;  will  flit  away (from  an  object) and then  return  to  it;  will  rejoice  jubilant  in  vain  and  be intoxicated  with  Ahankara  (or  egoism).  But  at  the period  of  Maha  Pralaya  which  alters  the  form  of everything,  Akasa,  etc.  will  be  absorbed  in  their highest  essence  and  there  will  remain  the  solitary all-quiescence  (of  Jnana).  


This  is  the  primeval Brahman,  the  one  Reality  which  is  the  Sun  of never-  setting  Self-Jyotis  (effulgence),  limitless  and not  in  the  least  painless,  which  is  the  all  and  the evolutor  of  all,  and  is  in  all  places  and  times  and which  is  all-pervading.  Though  above  the  reach  of all  words,  it  is  yet  dubbed  with  different  illusory appellations  by  the  wise.


The  most  intelligent Sankhyas  term  It  Atman;  the  Vedantins  of  pure Jnana  call  It  Brahman;  the  Vijnanis (24)  say  It  is Vijnana;  the  atheists  give  It  the  pseudonym  of Void;  and  so  on.  (But  this  much  may  be  said  of  It, that)  It  is  the  light  of  Sun  s  light,  illumines  all  and shines  as  the  (abstract)  Light  only.  


From  this Principle  which  is  firmly  tacked  to  the  world  and the  body  and  yet  is  not  and  which  (seems  to)  talk, examine,  hear,  see,  eat  and  think,  a  Jnana-light arises  like  light  from  the  sun.  Now  this  (light  of) consciousness  pervading  the  Akasa  has  the  Manas full  of  Vasanas  as  its  root,  the  organs  as  the flowers,  the  mundane  eggs  as  the  fruits  and  Maya as  the  ground  on  which  to  take  root.  With  these,  It enacts  its  affairs  in  this  Puriashtaka (25) body,  like  a gem in  a casket.


Note : 24. Those  who  cognize  it directly.

25. Puriashtaka  body  is  the  body  composed  of  eight  principles  as  the organs  of  sense,  etc.


🌷 Atman’s  Nature: 🌷

 *Being  the  immaculate  Jnana,  It  is the  all-pervading  Akasa  itself.  Whatever  objects  It contemplates  upon,  those  objects  come  into existence  (at  once).  In  that  Jnana,  all  the  three worlds  will  arise  and  be  destroyed,  like  water  in  a mirage.  Having  evolved  all  objects,  It  will  yet  be  in its  true  state  unaffected,  as  if  disconnected  with them.  The  origin  and  absorption  of  the  universe  do not  take  place  from  and  into  Nirvikalpa (26) Atman direct.  If  one  should  hold  communion  with  that Supreme  Principle,  devoid  of  mental  fancies  and modifications,  then  the  great  bondage  of  the  mind will  cease,  all  doubts  will  vanish,  and  all  Karmas will  perish.


Note 26 : Nirvikalpa  Atman  -  Atman  free  from  Vikalpas,  etc.   

🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 31 / YOGA VASISHTA - 31