శ్రీ యోగ వాసిష్ఠ సారము - 44 / YOGA-VASISHTA - 44
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 44 / YOGA-VASISHTA - 44 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ఉత్పత్తి ప్రకరణము 🌴
🌻. కర్కటి ప్రశ్నలు 🌻
ప్రశ్నలు : యదార్ధముగా ఒక్కటియెయైనను, ఉపాధి భేదముచే అనేకముగా కన్పడునదేది?
సముద్రము నందు బుద్భుదము వలె, ఏ అణువు నందు లక్షల కొలది బ్రహ్మండములు లయమగును. శూన్యము గాని ఆకాశమేది? లేనిదైనను ఉనికి గల దేది? నేనెవరను?
మీ యందు అహంభావము కల్గియున్నదేది? నడుచు చున్నను నడవనిదేది?
గతి నిరోధ మొనర్పకున్నను స్ధిరముగ నుండున దేది?
చేతన వస్తువైనను రాయి వలె కదలనిదేది? చిదాకాశమున విచిత్రముగ చిత్రించున దెవరు?
తన రూపమును త్యజించనిదియు, దహనశక్తి లేనిదియునగు అగ్ని ఏది?
అగ్ని కానట్టి దేని నుండి నిరంతరము అగ్ని యుత్పన్నమగును?
నాశరహితుడును, సమస్తమును ప్రకాశింప జేయు వాడెవరు?
చంద్ర, సూర్య, అగ్ని, నక్షత్రములకు విలక్షణమైనది?
నేత్రమునకు విషయము కానిదైనను, దృష్టికి హేతువైయున్నదేది?
తరు లతాధులను జన్మాంధులను, ఇంద్రియములు లేవి ఇతర జీవులను లెస్సగ ప్రకాశింప జేయునదేది?
ఆకాశాదుల నుత్పన్నము చేయువారెవరు? అన్నిటికిని సత్తాను గలుగ జేయునదేది? జగత్తను రత్నమునకు నిలయమేది?
ఏ మణిమయ కోశము నందు ఈ జగత్తు గలదు?
తపస్సును గూడ ప్రకాశింపజేయున దేది?
ఉన్నదియు లేనిదియునగు అణువేది?
దూరమున నున్నను, సమీపమున నుండునదేది?
గొప్ప పర్వతమువలె నుండు అణువేది. కల్పమైనను నిమేషముగా నుండునదేది?
ప్రత్యక్షముగ నున్నను లేనట్లు తోచునదేది? చేతన మైనను ఆచేతన మగునదేది?
వాయు రూపమైనను వాయువు కానిది శబ్ధ రూపమైనను శబ్దము కానిది, అంతయు తానే ఐనను, ఏదీ కానిది భోగ జీవితముచే ఎది తన్నుతాను నశింపజేసుకొనును?
మేరు పర్వతమును, త్రిలోకములను తన యందు ఇముడ్చుకొను అణువేది?
అణువైనను అనేక యోజనములు వ్యాపించున దేది?
భూత భవిష్యత్ వర్తమాన రూపమగు. ఈ మిధ్యా జగత్ జాలమంతయు, బీజమందు వృక్షము వలె ఏ వస్తువు నందుసర్వదా స్ధితి బడయుచున్నది?
ఏది తన యందు కోట్ల కొలది మందర పర్వతములు కల్గియున్నది! దేని శక్తి చే నీవు సమస్త వ్యవహారము లందును లెస్సగ వర్తించుచున్నావు?
ఇట్లనేక ప్రశ్నలు అడిగి కర్కటి, రాజును, తన సంశయములను తీర్చమనియు, లేనిచో నేను మీ రాజ్యమందలి, ప్రజల నందరను మ్రింగివైచెదనని పలికెను.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 YOGA-VASISHTA - 44 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj
🌴 UTPATTI PRAKARANA - 14 🌴
🌻 2. THE STORY OF LILA 🌻
Saraswati and Lila, who had thus conferred together that night, went into Swarupa Samadhi free from the trammels of their body and remained motionless. In this state, Saraswati shining with her former Jnana body along with Lila with her newly assumed Jnana one, rose up high in the Akasa, as if I0 digits high.
Having penetrated far into the Akasa which is like an ever-ebbing great ocean at the time of deluge, they observed there the following. In the immeasurable, transparent and subtle Chidakasa replete with the bliss arising from zephyrs, there were to be found the hosts of Siddhas who journeyed fleeter than wind. In it whirled, in all quarters, Rakshasas and Pisachas as well as successive rows of innumerable yogins, having the faces of dogs, cows, camels and asses.
There were also the multitudinous Dakinis (elementals), dancing about gleefully and the white Ganga running with its speedy current. There the songs of Narada and Tumburu were heard vibrating on their lyre in non- immured space. Clouds, as at the end of a Kalpa, rained down their currents without any noise like a painted picture. To wit, they saw bevies of fair women collected together.
Then they passed through diverse places for the immeasurable ten Ghatikas‟ distance, some replete with petrified sable gloom inaccessible to any and others, radiant with the lustre of Agni (fire) or the Sun journeying on his swift car. Thus waded they through the Akasa of the three worlds, wherein abode the myriads of Jivas created by Brahma buzzing like the swarms of flies collected in a ripe fig fruit.
Then contemplating upon reaching their longedfor place, they crossed Brahma‟s egg 32 and reached Girigrama in the Loka where Vasistha lived. As the new arrivals were invisible to the menials, relatives and offsprings of the Brahmin suffering from dire pains, Lila, of Satya-Sankalpa willed that the inmates of the house should see her and her comate. Thereupon taking these two, who were like Lakshmi and Parvati, to be some sylvan goddesses, the menials, etc., worshipped them and paid them proper respects.
Of these, the eldest son ad dressed them thus „You should lighten us of the load of grief under which we are groaning ever since the demise of our parents. Oh ladies of great knowledge, are there any results not attainable through the visits, of great personages like yourselves?‟ Thereupon the effulgent, Lila touched their forehead and relieved them of their grief. Then both of them disappeared from view, from that spot that very instant.
Now that we have accomplished our object of seeing the different states of the universe according to our thought please acquaint me with your further wish. So said Saraswati to Divine Lila, at which the latter asked the former: „How came it that during our Samadhi, the persons seated in the regal assembly were unable to see me whilst those in the beautiful house alone were able to do so?‟
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments
Post a Comment