శ్రీ యోగ వాసిష్ఠ సారము - 47 / YOGA-VASISHTA - 47

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 47  / YOGA-VASISHTA - 47 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. ఉత్పత్తి ప్రకరణము  🌴
🌻. సమాధానములు - 3 🌻
   
ఇట్లు మంత్రి రాక్షసికి, తన ప్రశ్నలకు సమాధానమివ్వగా, రాక్షసి రాజు నుద్ధేశించి, తన ప్రశ్నలకు సమాధాన మొసగమని చెప్పెను. అంత రాజు రాక్షసి కిట్లు చెప్పెను. 

జాగ్రత్‌, స్వప్న, సుషుప్తులను త్రివిధ అవస్ధలందును ప్రాపంచిక, వృత్తులను, రహిత మొనర్చుట చేతనే తురీయావస్ధ కల్గును. కాని సమస్త సంకల్పములను, తొలగింపబడినపుడే, అట్టి ఆత్మ నిష్టగల్గును. ఎవని సంకోశ వికాసములచే జగత్తు ప్రళయము, సృష్టి సంభవించు చున్నదా అతడు వాగతీతుడు. పరమాత్మను గూర్చి యవ్విధముగనే వేదాన్త శాస్త్రము లందు ప్రతిపాదింపబడినది. బ్రహ్మము సత్తు, అసత్తులకు శూన్యాశాన్యములకు, విలక్షణమై, అనిర్వచనీయమేయై మొప్పుచున్నది. 

ఎవడు విశ్వ రూపమున ప్రకాశించుచున్నను, అతడు దేనిచే బాధింపబడక యండునో, అట్టి నిత్యుడగు పరబ్రహ్మను గూర్చియే నీవడిగివివి. శుద్ధ చైతన్యమగు బ్రహ్మము, వాయువుగను, అగ్ని, ఆకాశము, నీరు, పదార్ధములుగను ప్రకాశించుచున్నది. అట్టి ఆత్మ జ్ఞానము లభించుట కష్టము. అనేక యత్నముల చేతనే, అది పొందబడును. 

అజ్ఞానము నశించినపుడే, ఆత్మజ్ఞానము పూర్ణముగ లభ్యమగును. ఆత్మయే సాకార రూపము వహించి, దృశ్యమగునపుడు అట్టి దృశ్య మందు నిమగ్నుడగు జ్ఞాని, ఎండమావు లందుజలబుద్ది గలవాని వలె, విషయభోగ యుక్తమగు జీవితముచే, తన యాత్మను తాను మరచి పోవు చున్నాడు. 

చిదణువే దేశ కాల వస్తు రూపమున, అంతయు నిండియున్నది. ఈ చైతన్య మాత్మ స్వరూపమై యుండుటచే, ప్రకాశాంధకారములు రెండును ఆత్మ దీపము చేతనే ప్రకాశించుచున్నవి. సూర్యాది పదార్ధయుక్తమగు, ఈ జగత్తంతయు జడమే అయిన, దానిని ప్రకాశింపజేయు చైతన్య యొక్కటే దానికాధారము. ప్రకాశము, తెలుపు; అజ్ఞానము నలుపు. జడత్వము నందు ఈ రెండును సమానమే అగును.

ఆత్మ సాక్షాత్కరము పొందిన జీవునకు, వివిధ భోగ వ్యవహారములతో గూడి యున్న ఈ త్రిలోకములు, ఆత్మ చేతనే ప్రకాశింపబడునట్లు అనుభూతి కల్గును.

సూర్యుడు దిన రాత్రులను నిర్మించునట్లు, చైతన్యమే సద సత్తుల సత్తును గల్గ చేయుచున్నది.వృక్షము నందు, పత్ర పుష్ప, ఫలాదులు సూక్షరూపమున నున్నట్లు, చిదణువు నందు, అనుభవములన్నియు స్థితి కల్గియున్నవి. చేతనా రూపమగు అణువు సర్వవ్యాపక మగుటచే, తన, చైతన్యము విస్తరించి బ్రహ్మండము నంతటను గప్పియున్నది. 

ప్రళయము నందు లీనమై సంస్కార మాత్రముగనున్న, ఈ జగత్తంతయు మరల ఉత్పత్తి అగుచున్నది. ఈ చిదణువు అవయవరహితమైనను, అండజాది చతుర్విధ ప్రాణుల అంతరాత్మ యగుటచే, అనేక హస్త క్షేత్రాదులు కల్గి యున్నది. స్వప్న మందలి బాల్య వార్ధక్యములవలె, ఈ చేతనాణువు యొక్క, నిమేష అంశము, అనేక కల్పములవలె తోచును. జీవించి యున్నను, స్వప్నము నందుతాను మరణించినట్లును. 

భుజింపక యుండినను, భుజించునట్లు, మిధ్యానుభవము కలుగజేయు వృత్తులు, వాసనాత్మకములై యుండును. ఈ చైతన్యాణువు నందె జగత్తులన్నియు గలవు. జగత్‌కు సంబంధించిన అణువులన్నియు, దీని వలననే గల్గుచున్నవి. బీజ మందు, వృక్షమున్నట్లు, ఈ చైతన్యము నందే, భూత భవిష్యత్‌ వర్తమాన కాల మందు జగత్తులును, అందలి ప్రాణి సమూహములన్నియు గలవు. 

చైతన్యము, జగత్తు కంతయు ఆత్మయై యున్నను, కరృత్వ భోకృత్వాదులచే, స్పృశింపబడక, కేవల ముదాసీనముగనవున్నది. జగత్తు నెవ్వడు సృష్టించుట లేదు, లయ మొనర్చుట లేదు. సృష్టి లయములు రెండును కల్పితములే. సువర్ణమునకు ఆభరణ నిర్మాణ మందెట్లు, సామర్ధ్యము కలదో, అట్లే చైతన్యమగుటచే దృక్కుకును, దృశ్య నిర్మాణ సామర్ధ్యము కలదు. ఆభరణము స్పురించునపుడు సువర్ణమే దానికి సత్త గలుగ జేయుచున్నది. దృశ్యమున్నపుడే ద్రష్టయు, ద్రష్టయున్నపుడే దృశ్యమును వుండును. ద్రష్ట దృశ్యము, దర్శనములు మూడింటిని , ఆత్మయె ప్రకాశింప జేయుచున్నది.

సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹


🌹 YOGA-VASISHTA - 47 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 UTPATTI PRAKARANA - 17 🌴

🌻 2. THE STORY  OF LILA 🌻

Hence  though  seeing  the  whole universe,  you  see  it  not.  Being  of  the  nature  of  all, you  art  shining  through  your  wisdom  in  the  Atmic Reality.  The  old  adage  runs  to  the  effect  that  a  nonlisping  baby,  which  is  obsessed  while  in  the  cradle, will  be  freed  from  such  pos  session  in  the crematorium  only.  

Similarly  is  the  Ajnana  (illusion) in  man;  and  to  the  ignorant  full  of  this  painful Ajnana,  the  universe  appears  to  be  real.  Persons ignorant  of  gold  will  assert  an  ornament  made  of gold  to  be  the  former  8  58  alone  and  not  the  latter. Likewise,  persons  devoid  of  spiritual  vision  will maintain  this  universe  to  be  the  inert  one  only, (and  not  spirit,  the  seer  free  from  the  seen).  Know also  all  the  universes,  arising  through  the  egoism of  „I‟and  „mine,‟etc,  to  be  nothing  but  a  dream  and the  different  objects  seen  therein  to be as  illusory  as things  in  a  dream.  Such  objects  and  universes  are no  other  than  of  the  nature  of  that  Jnana  (Reality) which  is  all  permanent  Paramakasa,  actionless, full,  vast  and  immaculate. 

 It  is  the  one  reality which,  being  all  and  having  all  with  the  different Saktis  (potencies),  manifests  itself,  without  being diminished  thereby,  in  different  forms  according  to the  fructification  of  time  and  Karmas.  Through Lila,  I  have  initiated  you  into  the  mysteries  of  the true  Jnana  state.  Your  mind  has  been  illumined through  the  undecaying  Tatwa  (Truth).  Therefore we shall depart.‟

After  reflecting  well  upon  the  enjoyment  (of  bliss) into  which  he  was  now  initiated,  Viduratha remarked  thus  „Even  persons  coming  to  me  for  aid are  accustomed  to  receive  at  my  hands  whatever they  long  for.  Therefore  is  it  surprising  for  me  to attain  any  object  of  my  quest  at  the  hands  of  you both  who  are  like  fresh  Chinthamani 35?  When  shall I  be  able  to  resume  my  former  body  of  Padma?‟To which  Saraswati  replied  thus  „You  will  perish  in this  war  and  with  your  death,  you  will  resume your  Padma  body.‟  

Here  a  herald  came  in  with  the following  announcement  to  the  king.  „An  ocean  of army  is  discharging  showers  of  arrows  at  us,  and our  town  is  reduced  to  ashes  through  the  enemy  s flames.  Oh  puissant  king,  I  have  to  announce  to you  these  painful  tidings.‟  While  the  information was  thus  being  given  to  the  king,  his  ears  were deafened  by  the  terrible  sounds  of  the  enemy  s hosts  which  made  the  hearts  of  all  in  the  three worlds  to  quail.  

The  cries  of  shrieking  roving townsman  collided  with  those  of  the  enemy  and rent  the  air  like  a  thunderbolt.  The  hissing  flames which  were  like  Vadava  Agni  enveloped  the  whole welkin  with  its  volumes  of  smoke.  Thus  all  eyes and  ears  ceased  to  function  and  the  whole  town became  nothing  but  a  heap  of  ruins.  

All  these devastations  were  personally  witnessed  by Saraswati  and  Lila,  the  king  and  his  minister.  At this  time,  the  queen  of  the  king  Viduratha  came  to where  her  husband  was  with  great  trepidation  and giddiness.  Her  handmaids,  who  accompanied  her, apprised  the  king  of  the  fact  that  all  the  damsels and  wealth  in  the  palace  were  being  ravished  and ravaged  by  the  foe.  Hearing  which,  he  entrusted his  wife  to  the  custody  of  those  near  him  and sallied  forth  to  war.   

Note 35 :  This  is  a  stone  supposed  to  yield  anything-  the  possessor  of  it  thinks of. 

Continues... 
🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 257 / YOGA-VASISHTA - 257

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹