శ్రీ యోగ వాసిష్ఠ సారము - 42 / YOGA-VASISHTA - 42
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 42 / YOGA-VASISHTA - 42 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ఉత్పత్తి ప్రకరణము 🌴
🌻. కర్కాటియను రాక్షసి కధ - 3 🌻
ఆ తపః ప్రభావమున ఇపుడది పవిత్రయు, పాప రహితము నయ్యెను. ఆకార రహితులకు, ఏదేని ఆకారము లేనిచో ఏకార్యమును చేయజాలరు. కనుక జీవ సూచిక, లోహ సూచిక నాధారము, చేసుకొని తపమాచరించెను.
ఇంద్రుడు తదుపరి, ఆ కర్కటికి వర మొసంగదలచి, వాయువును దాని కొరకై వెదకుటకు పంపును. వాయువు సర్వప్రదేశము అలందు వెదకి వెదకి చివరకు హిమాలయము లందు గల, వున్నత శిఖర మందు, సూచికను గాంచెను. అది ఏక పాదముపై నిలబడి, నిరాహారి అగుట చే శరీరము శిధిలమై యుండెను. ఈ సూచికను గాంచిన వాయువు ఆశ్చర్యముతో దానికి నమస్కరించి, తిరిగి గగన మార్గమున ఇంద్ర పురిజేరి, సూచికా దర్మనమును గూర్చి ఇంద్రునకు తెల్పెను.
ఇంద్రుడు వాయుప్రేరియుడై, దేవతలతో గూడి, బహ్మ వద్ద కేగి సూచికను గూర్చి వివరించెను. అంతట బ్రహ్మ, సూచికకు వర మొసంగుటకై హిములయముల కరిగెను. అపుడు కర్కట ఛాయా సూచి, జీవసూచి, లోహ సూచి, ఈ మూడింటిని కూడి యుండి, తపస్సుచే పవిత్రమై, ఆన్యతత్వమును గూర్చి విచారించినదై, బ్రహ్మమును గూర్చి తెలుసుకొని యుండెను.
ఇట్లు జ్ఞానోదయమైన పిదప వేయి సంవత్సరములు గడిచిన అనంతరము బ్రహ్మదేవుడు సూచిక వద్దకు బోయి వరముకోరు కొమ్మనెను. అంత సూచిక ఇట్లు తలచెను. నాకు జ్ఞానోదయమైనది. ఇపుడు నేను శాంతముగను, సుఖముగను వున్నాను. ఏ కోరికలు లేవు అని చింతించుట గమనించిన బ్రహ్మ ప్రసన్నుడై సూచికతో ఇట్లనెను. వరము కోరుకొనుము.
కొంతకాలము భూతలము పై భోగములనను భవించి పిదప యత్తమ మగు బ్రహ్మ పదమును జెందెదవు. ఇది ఈశ్వర నియతి. మేమును ఏమియు జేయజాలము అని పల్కెను. నీవు మరల నీ విశాల శరీరమును పొంది, హిమాలయములపై సంచరించమని పల్కెను. నీవు నీ పూర్వ దేహమును పొందినను, మునుపటి వలె లోకమునకు బాధ కలుగ చేయకుందువు. నిర్వ కల్ప సమాధిలో నుండెదవు.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 YOGA-VASISHTA - 42 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj
🌴 UTPATTI PRAKARANA - 12 🌴
🌻 2. THE STORY OF LILA 🌻
The Goddess replied thus, ‟I never told you an untruth. I will now explain you how my words are true. Persons like myself will never derogate from the laws of Iswara but will hold to them as the true ones. The Brahmin s Jiva lives invisibly in his own house in the city. All his kingdom and Padma regality are of the nature of Jnanakasa only.
Now, Oh Lila, with eyes bedaubed with black ointment, Vasistha of the nature of Chidakasa, when he became overjoyed (with the sight of the king), saw all these things in the Manas Akasa. This old thought (or creation) of Vasistha without manifesting itself as such to you now appears to you as different (as Padma creation). Just as the many events of the Jagrat (waking) state are not enacted in the dreaming state, Padma creation and its thoughts do then predominate without the reminiscences of the Vasistha state.
Out of the above mentioned all-pervading Jnanakasa shining through Sat which is its own power and form part essence of that (JnAna)Akasa arose this terrible universe through the Sankalpa of the mind, like an image reflected in a glass. All the shining universes will be latent as light within the Jnana Reality which is the illuminated supreme Atom. There fore it is that the abovementioned earth and others of the Brahmin will manifest themselvey in (and out of) Jnana.
Now you shall know all these directly.‟ So said Saraswati, when Lila asked her „It was stated by you, that the Brahmin expired on the eighth day. That period passed with me as millenniums. Please explain this to me.‟ Then the goddess continued thus „Just as space, which, as mentioned before, is nothing but a play (or mode) of consciousness, is not all-pervading and hence not real, so also is time.
As it is the Jnana light alone devoid of the modifications of Maya, that manifests itself as time and space, hence there is no such thing as the limit of time or space. Through the illusion of death, the body became entranced for a moment and the Jiva parted from it.
Becoming oblivious of all the thoughts of its former body, it is filled with the thoughts of this life only. It is only when the Jiva revives from the fatal trance of such false conceptions as I am greatly supported by these, „My body is getting fat, he is my parent, I am going to die in so many years, My relatives are augmenting in number, * this is my beloved seat and so on it is only then that the Jiva will begin to know its real state. Therefore you forgot all about your former birth, remembering only this birth.‟
After Saraswati had finished these words, Lila said „Having been blessed by you with Divine vision, I have understood all things truly. Now to gratify my desires, please show me the abode of Vasistha and others.‟
🌹 🌹 🌹 🌹 🌹
Comments
Post a Comment