శ్రీ యోగ వాసిష్ఠ సారము - 80 / YOGA-VASISHTA - 80
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 80 / YOGA-VASISHTA - 80 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
🌴 2. స్థితి ప్రకరణము 🌴
🌻. శుక్రాచార్యుడు: భృగు, యముల వృత్తాంతము - 7 🌻
దేవతలను పూజించువారు దేవతలను, యక్షులను పూజించువారు యక్షులను; బ్రహ్మను ఉపాసించు వారు బ్రహ్మను పొందుచున్నారు. కాని ఏది యుత్తమమైనదో దానినే ఆశ్రయించవలెను. ప్రాపంచ వ్యసన కోశములున్నంత వరకు తాను ప్రధమమున పొందిన రూపమే గల్గి యుండును. అన్యము కాదు.
విజ్ఞానులు శమదమముల చేతనే ముక్తి లభించునని అందులకు విరుద్ధముగు నెద్దాని చేతను, ముక్తి లభించదని సిద్ధాంతీకరించారు. వేపలో చేదు, చెరకులో తీపి, అగ్నిలో వేడిమి మొ.వన్నియు, వారివారి భావనలను బట్టి, అభ్యాసమును బట్టి మారు చుండును. చంద్ర సూర్య మండలము లందు నివసించు దేవతలకు వాటి వలన, బాధ కల్గుట లేదు. బ్రహ్మనందము కొరకు యత్నించు మనుజులు, తనువును, మనస్సును బ్రహ్మమయ మొనర్చిన బ్రహ్మ ప్రాప్తి కల్గును. చైతన్యము, దృశ్యమగుటచే బంధ హేతువగు కర్మ, అదియె మాయ, అవిద్య.
మేఘములచే కప్పబడిన సూర్యుడు కనిపించనట్లు, ఈ బాహ్య దృష్టి వలన మనుజుడు, బ్రహ్మమును దర్శించలేడు. దృశ్యము అవిద్య వలననే, సంకల్ప మాత్రమున లభించుచున్నది. సంకల్ప రహితమైనపుడు, భావన నశింప, సహజముగనే, సమాధి, ఆత్మ విచారము వలన, అవి నశించుచున్నవి. సత్య దృష్టిచేకూరి, అసత్య దృష్టి నశించిన, నిర్వికల్పము, తద్వారా ఆత్మ దర్శనము జరుగును.
అట్టి పరమాత్మ స్ధితిలో, సుఖ దు:ఖములు వ్యక్తావ్యక్తములు లేనేలేవు. దేహేంద్రయ మందలి, అహంభావముచే, అనర్ధములేర్పడును. ఆత్మ పొందబడదు. అనంతములగు వాసన లేవియు లేని వానికి మాత్రమే ఆత్మప్రాప్తించును. రజ్జువునందు సర్పభ్రాంతివలె స్వాత్మయరదు బంధము కల్పించుకొనును. మహత్తరమైనది, స్వభావ సిద్ధము, ఉపాధి రహితము, భ్రమ వర్జితము, కల్పనల కతీతమైన ఆత్మ కేవలము సుఖము కొరుకే వున్నది.
శూన్య గుహ యందు సింహమును భావించి భయపడిన వ్యక్తి, బాగుగ పరికించి చూసిన, సింహము లేకపోవుటచే భయము తొలగినట్లు; కనిపించని ఆత్మను పరికించి చూచిన, దర్శనమగును. భర్త ఆలింగములో స్త్రీ, భార్యగను, అట్లే పుత్రిక ఆలింగనములో, మాతృభావన కల్గినట్లు, భావమే ప్రధానము, ధృడ భావనచే, చిత్త మెంతకాలము, ఎవ్విధమున దేనిని భావించిన అంతకాలము, దాని ఫలమును, ఆకృతిని పొందును.
కాన ప్రపంచమున, సర్వము సత్యమే, సర్వము మిధ్యయె. కావున ఓరామా! ఇచ్చారహితుడవై జగత్తును అభావముతో దర్శించుచు, అందలి యదార్ధ దర్శనమైన ఆత్మను కనుగొనుము.
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Yoga Vasishta - యోగ వాసిష్ఠ సారము Channel 🌹, [28.06.20 20:37]
🌹 YOGA-VASISHTA - 80 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj
🌴 UTPATTI PRAKARANA - 50 🌴
🌻 9. THE CONCLUSION OF UTPATHTHI PRAKARANA - 11 🌻
So said Vasistha when Rama questioned him thus „Oh guru of my race, how came the things enacted in the regions of the perturbed mind to objectivise themselves in the physical world?‟To which the Rishi replied thus „You will be able to better understand the heterogeneous manifestations of Maya, later on, in the story of Gadhi, wherein Maya is shown as producing diverse objects.
Like the coincidence of the fall of Palmyra fruit on the perching of a crow thereon, the wise of great knowledge say that the mind will merge unto itself through Vasanas. Therefore King Lavana saw as true, on the subsequent day, that illusion which Sambarika, the Siddha imposed on the previous day through his Indra-Jala on him (the king) as a Chandala (outcaste) and so on.
That illusion which was wrought on the king s brains in his JagratSwapna state, the Chandalas, living on the slopes of the hills, saw to be real through their own intelligence. Now what happened was this. That which dawned on the king‟s mind (as JagratSwapna) was reflected on those of the Chandalas as Jagrat for waking reality; and that which happened among the Chandalas again reflected itself on the mind of the king (as the same Jagrat reality).
If this is the work of Maya, who will be able to gauge its tremendous powers? It is only to Jnana light that all the visible Mayavic objects owe their existence in this world. Likewise are all objects observed through the five organs, nonexistent except through Jnana. Jnanatman occupies a state intermediate between the knower and the known. Hence Moksha may be said to be that state in which the objects, their knower or the knowledge are not found but which is yet the source of all three.
May you be ever impartite in that Chidananda wherein are unified „that,‟ the Brahman and „you,‟ the Kutastha, which is the neutral state of the mind when it passes from one object to another, and which is without name, intelligence or inertness. May you rest in your innate self in an illuminated state, having enquired thoroughly through your subtle mind and having eradicated all the conceptions of your mind which makes you falsely believe yourself to be under the trammels of Samsara.
Now, Rama, you should rend asunder, through enormous efforts on your part, the long rope of Vasanas tied to the vessels (of men) swung about as if on water-lifts. All the universes with their heterogeneity, though really Atma-Jnana, shine as worlds only through our illusory mind like the blueness in the sky which is really non-existent. If with the extinction of the pains-producing Sankalpa, the mind is also destroyed, then will the thick frost of Moha (delusion) affecting us from remote periods dissipate itself.
Then like an un- obscured sky in the autumnal season, Brahman alone will shine resplendent, blissful, imperishable, non-dual, formless and without birth or death.
End of UTPATTI PRAKARANA and Chapter 9.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments
Post a Comment