శ్రీ యోగ వాసిష్ఠ సారము - 257 / YOGA-VASISHTA - 257
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 257 🌹 🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 54 🌴 ✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు 📚. ప్రసాద్ భరద్వాజ 🌻. 135. జీవన్ముక్తులు - 1 🌻 దేహధర్మము అనగా వ్యవహారాధులు, జీవన్ముక్తునకు వర్తింపవు. ముక్త చిత్తము మరల ఎన్నటికి బంధింపబడదు. తొడిమనుండి పడిన ఫలము,మరల ప్రయత్నము చేసినను, ఎవని చేతను ఆ తొడిమ బంధింపబడజాలదు. కాబట్టి అట్టి వారు ఇతరులచే జీవన్ముక్తుని తెలియబడజాలరు. ధారణాదులచే గూడిన యోగులు, ఇతరులచే నెఱుగబడుదురు కాన మోక్షము ధారణాదులవలె ఇతరులచే నెఱుగబడినది కాదు. అది మధుర పదార్ధముల ఆస్వాద సౌఖ్యమువలె స్వాద్వైక వేద్యమే యైయున్నది. అభ్యంతరమున శీతలత్వముతో గూడిన(శాంతి) చిత్తమే ముక్తియని, సంతప్త చిత్తమే బంధమని చెప్పబడుచున్నది. కావున బంధమోక్షములు చిత్తాదీనములే గాని, దేహాదీనములు కావు. దేహమునందు బంధమోక్షములు లేవు. శరీరము ముక్కలు ముక్కలుగ కోయబడినను, ఏడ్చుచున్నను, నవ్వుచున్నను, జీవన్ముక్తునకు అంతఃకరణమున దేహసంబంధ దుఃఖము, సుఖము కొంచెమైననుండదు. నిత్యమై అశరీరమైన ఆత్మస్వభావము పొందియుండుటచే జీవన్ముక్తులకు దేహాదిభావన నెపుడును నుండనేరదు. దేహము మరణించినను, జీవన్ముక్తుడు మర