శ్రీ యోగ వాసిష్ఠ సారము - 247 / YOGA-VASISHTA - 247

Image may contain: 2 people
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము -  247 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ

🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 44 🌴
🌻.  పిశాచములు - 1 🌻
 
వసిష్ఠుడు తన శరీరము శిధిలమైయుండగా, సిద్ధునితో ఎట్లు సంభాషణవ్యవహారములు గావించెనో శ్రీరామునకు తెల్పుట. 

నేను మొదట జగత్తున సంచరించుచు, సిద్ధుల సేవలందును, నగరములందును తిరిగి తుదకు ఇంద్రుని పట్టణము చేరితిని. అచట నాకు స్థూలశరీరము లేకపోవుటచే, సూక్ష్మశరీరమున నున్న నన్నెవరు గాంచలేదు. మనోమాత్రుడనగు నేను, మనోమయ ప్రాణులతో మాత్రమే వ్యవహరించుచుంటిని. 

ఇచట స్వప్నానుభవమే అఖండ దృష్టాంతము. స్వప్నమున నున్నవారిని అతని గృహమందలి ఇతరులెవరు జూడజాలనట్లు, ఎదుటనున్నప్పటికిని నేను దేవతలచే జూడబడలేదు. 

నేను సర్వులను చూడగలను గాని, నన్నెవరు గాంచలేరు. గాని యోగసిద్ధులు గాంచగలరు. దేవతల స్థానములందు నేను అనిర్వచనీయమైన పిచాచత్వమును గాంచితిని. ఈ ప్రపంచమున పిచాచములెట్లుండునో వినుము. 

మంచి నడవడిలేనివాడు, ప్రపంచానుసారము మాట్లాడనివాడు, సూక్ష్మదేహమును ధరించి స్వప్నమువలె మనఃకల్పితములగు హస్తపాదాదులు కల్గియుందురు. వారు తక్కిన ఆకారములను గాంచుదురు. 

ఆ పిచాచము ఇతరుల చిత్తములందు ప్రవేశించి, భ్రమ రూపమును భయధాయకమగు తమ ఛాయచే వారలనాక్రమించి, వివిధ దుఃఖాదుల నొసగు చేష్టలచే, వారి ఆశయములు నెరవేర్చుకొందురు. 

మరికొందరు జీవులందు ప్రవేశించి, శీఘ్రముగ వారిని జంపుదురు. ఋణానుబంధముననుసరించి, వారి దేహదాతువులను భుజింతురు. రక్తాదులను పానము చేయుదురు. వారా చిత్తమునాక్రమించి తేజమును నశింపజేయుదురు. 

పిచాచములలో కొన్ని అతి సూక్ష్మములు, కొన్ని హిమము వంటి ఆకృతి కల్గి స్వప్న మనుజులవలె నుందురు. పిచాచములు బుద్ధిమయ, మనోమయ శరీర ధారులైయుందురు. వారు పరస్పరము గాంచుకొందురు. 

శీతోష్ణాది జనితములగు సుఖదుఃఖములు వారనుభవించుదురు. బాహ్యమున జలాదులను ద్రావుటగాని, భుజించుటగాని, ఏ పదార్ధమునైన ఆధారముగ గైకొనుటగాని, ఇచ్ఛ వచ్చినట్లు దానగ్రహణాదులను వ్యవహరించుటగాని చేయలేరు. 

మరియు వారు ఇచ్ఛ, ద్వేష, భయక్రోధ, లోభ, మోహయుతులై యుందురు. మంత్ర, ఔషద, తపోదానధర్మములచే వారు వశీకృతులగుదురు. 

భూతవిద్యనెఱిగినవారికి వశులై వారికి కనిపించి సేవచేయుదురు. కొందరు దేవతలవలె, మనుజులవలె, శునకములు, నక్కలవలె, కొందరు అపవిత్ర స్థానములందు వశింతురు. వారు సంకల్పము కల్గి, మనస్సుగను పురుషునిగను నెఱిగి జీవుడగను. 

అహంకార యుతులుగ నుందురు. 
బ్రహ్మదేవుడు, చిదాకాశరూపుడై నామరూపాత్మకమగు ఈ జగత్తంతయు స్వప్నతుల్యమై,బ్రహ్మదేవుని సంకల్పమేయైయున్నది. 

ఈ సమస్త జగత్‌ స్వరూపము మనోరాజ్యమనియే చెప్పబడుచున్నది. యధార్ధముగ ఈ చిదాకాశమందు క్షేత్రముగాని, బీజముగాని లేవు. ఏదీ నాటబడలేదు, ఉత్పన్నము గాలేదు. మాయచేతనే ఇట్లున్నది. 

దీర్ఘకాలాభ్యాసమున స్వప్నము, జాగ్రత్‌ దశనొందునట్లు; చిరకాలాభ్యాసముచే ఆ ప్రాణి భూతములన్నియు ఆదిభౌతిక రూపత్వము పొందినవారై, సంసారమున విహరించుచు స్వజాతియోగ్యములగు భోగములచే సంతుష్టులగుదురు. సృష్టిలోక వాసులు పరస్పరము గాంచునట్లు, కొన్ని పిచాచములు పరస్పరము వ్యవహరించుకొనును. 

ఓ రామచంద్రా| ఈ ప్రపంచమున, పిచాచాది దుష్టజాతులవలె, యక్షప్రేతాది జాతులు గలవు. మధ్యాహ్నసమయమున పిచాచముయొక్క నీడ పడును. ఆ నీడను, సూర్యుడు నశింపచేయడు. ఆ నీడ ఇతరులకు కనిపించదు. ఆ పిచాచమునకే కనిపించును. 

పిచాచాదులకు అంధకార మండలము కలదు. గుడ్లగూబవలె పగలు నిర్భలులై అంధకారమున ప్రభలురై యుందురు. 
సత్యసంకల్పముచే, మరల జనులతో తన వ్యవహారము, వసిష్టనామప్రాప్తి, ఇచట వర్ణింపబడినది. 

ఓ రామా| పంచభూత వర్జితుడనై,పిచాచమువలె తిరుగుచున్న నేను ఎవరికి కన్పించకుండుటవలన విచారించి, తదుపరి తాము సత్యకాములమగుటచే, ఆ విషయము స్మరించి ఇక తాము ఇంద్రాదులందరకు కన్పించునుగాక అని సంకల్పముచేయగ అట్లు భావించిన తదుపరి, అందరు నన్ను గాంచగల్గిరి. 

అపుడు యధాతధముగ సంభాషణ వ్యవహారము సల్పగల్గితిని. క్రమముగ నా యొక్క సూక్ష్మశరీరము స్థూలాకారము పొందినది. నా దృష్టియందు; స్థూల సూక్ష్మశరీరములు రెండును చిదాకావరూపముగనే యున్నవి. 

అదియే ఆత్మభావన. విదేహముక్తుడు, చిదాకాశబ్రహ్మ మాత్రుడై స్థితికల్గియుండునట్లు, జీవన్ముక్తుడును వ్వయహారమందున్నను చిదాకాశరూపుడై వెలయుచుండును. కాని బ్రహ్మరూపత్వము అలానే ఉన్నది. కేవలము జగత్తు కొఱకే నేను వసిష్ఠుడను. 

ఎఱుకవలన, స్వప్నమందలి ధనము పొందుబుద్ధి తొలగునట్లు, ఎఱుగబడిన పిదప, అహంకారరూప స్థూలత్వము తొలగి శమించుచున్నది. వాసిష్ట రామాయణమువంటి శాస్త్రము దర్శనముచేతనే, ఇట్టి జీవన్ముక్తత్వము సంప్రాప్తించుచున్నది. 

కావున ఇది ఏ మాత్రము కష్టతరము కాదుకదా| ఎవరిబుద్ధి సంసారవాసనలచే, దేహేంద్రియ పదార్థములందు ఆసక్తి కలిగియుండునో, అట్టి మూర్ఖులు శునకము లేక కీటకములతో సమానులు.

సశేషం..... 
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 247 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 NIRVANA PRAKARANA - 77 🌴
🌻 14. THE STORY OF A MUNI AND A HUNTER - 1 🌻

Summary: This story is meant to illustrate the Turya enjoyment. 

On being questioned by Rama as to what the wondrous traits are in those Jivanmuktas who have worshipped the eternal Brahman through their great wisdom (but without the psychical powers of Anima, etc.) 

Vasistha said thus The in comparable intelligence of a Jnani will ever find wonders (or delight) in the non-dual Atman. 

With stainlessr.ess, fullness and quiescence, the Jivanmukta will be in Atman only. What wonder is there in walking in the skies and other psychical powers developed out of Mantras, Tapas and other means? 

Anima and other powers accrue only to those persons who expand their minds gradually in this world with intense efforts. But Atma-Jnanis long not for these Siddhis. 

There is one thing peculiar to them. They have not the minds of the base. Their minds are immaculate, being free from desires. 

Without the characteristics of caste and orders of life and through the freedom from the trammels of the delusion of the longstanding births and deaths, they will be the enjoyers of partless bliss. Besides, desires, anger, pains, greed, accidents, etc., full of Vasanas, will daily dwindle into nothing.  

Vasistha continued: Like a Brahmin who after giving up his noble status, degrades himself into a Sudra, Isa (the Lord) degrades himself into a Jiva. The myriads of Jivas will, at every creation, shine beyond number. 

Through the flutter of that causal ideation, the Jivic Iswaras will be generated in every stage (of evolution). But the cause is not here (in this world). 

The Jivas that arise from Eswara and flourish thereby, subject themselves to repeated rebirths through the Karmas performed by them. 

This, Rama, is the relationship of cause and effect, (though there is no cause for the rise of Jivas), yet existence and Karmas, are reciprocally the cause of one another. 

All the Jivas arise, without cause, out of the Brahmic State; yet, after their rise, their Karmas are the cause of their pleasures and pains. 

And Sankalpa arising from the delusion of the ignorance of Atman is the cause of all Karmas.  As the cause of bondage is Sankalpa, you should root it away from you as completely as possible. 

The destruction of this primeval (cause) Sankalpa is itself Moksha. This destruction of Sankalpa should be intelligently practised. 

Where the conception of the objects and the enjoyer of the objects exist you should, my son, gradually and at all times destroy this Sankalpa without losing* sight of the same. 

Do not become of the form of objects or the knower, enjoying the same. Having destroyed all the slighted Sankalpas, may you become „That‟ which remains. 

When the five organs get into objects (along with the mind), the desires engendered therein do constitute bondage; but the non-attraction towards them is Moksha. 

If you are even in the least tinged with the desires of objects, then it will involve you in the meshes of existence. Oh beautiful Rama, if you are not pleased with objects, then you were be free from existence. 

Do not in the least bestow any de sires upon the hosts of objects, movable and fixed, from straw up to gold.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 31 / YOGA VASISHTA - 31