శ్రీ యోగ వాసిష్ఠ సారము - 235 / YOGA-VASISHTA - 235
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 32 🌴
🌻. అహంకారము - 3 🌻
ఒకచోట భవిష్యత్ కాలరూపమునగు, ఒకచోట వర్తమాన కాలరూపమునగు, ఒకచోట భూతకాలరూపమునగు, ఒకచోట సృష్టి, ఒకచోట ప్రళయము ఇట్లు వివిధ కల్పనారూపములచే ఆత్మయగు బ్రహ్మమే నిశ్చలముగ స్థితిపొందుచున్నది.
ఈ సమస్త జగత్ భ్రమలకు ఆత్మజ్ఞానము లేకపోవుటయే కారణమైనది. దృశ్యమునుండి మరలించి, ఆత్మవైపు దృష్టి నిలిపిన ఈ జగత్‌భ్రమ నశించిపోవుచున్నది.
ఈ ప్రకారముగ వివేకదృష్టిచే నిశ్చయించి, అధికారియగు జీవుడు, అణిమాధ్యష్ట సిద్ధులను, ఈశ్వరత్వమును కూడ మాయామాత్రమని ఎఱిగి,యద్దానిని తృణమువలె జూచుచు నిరతిశయానంమయుడై, స్వాత్మయందే సుస్థిరుడైయుండును.
చిదాకాశరూపుడగు వసిష్ఠుడు బ్రహ్మాండములన్నింటిని తన దేహమువలె గాంచుట, తమ స్వప్న సదృశ్యమైన ఆకాశరూపిణియగు స్త్రీతో సంభాషించుట.
నేనెపుడైతే చిదాకాశరూపుడనైతినో,నేను గమనశీలుగనైయుండలేదు. నేనచట స్థితినొందియుండలేదు. నా ఆత్మయందే ఈ జగత్తుల గాంచితిని. నాకు చర్మనేత్రము లేకున్నను, చిద్రూపనేత్రముచే, నేనపుడు అనేక జగంబులను నాయందు చూచితిని.
(ఆత్మ) ఆ స్థితిలోననున్నపుడు స్వకీయ జ్ఞాననేత్రముచే నేనాజగంబులనన్నింటిని, నా అవయవములుగ గాంచితిని. జగంబులను నాయందు గాంచితిని. నేనేకాదు,బోధ స్వరూపమగు ఆత్మతోటి ఏకత్వమొందిన వివేకులందరును, నాతోటి సమములుగ ఏకరూపులైయుందురు.
ఇట్లు సర్వాత్మ స్వరూపదృష్టి పరిపక్వముకాగ నపుడు విజ్ఞాన స్వరూపమగు ఆత్మలో, సమస్తము యొక్క ఏకత్వమనుభవించును.
యోగాదులచే సిద్ధులబడసిన మనుజుడు,పర్వతము పైనుండి తన దివ్య దృష్టిచే,కోట్లకొలది యోజనముల దూరమున ఉన్న, బాహ్యాభ్యంతర సదార్ధములనెరుగునట్లు, నేనున్ను సమస్త లోకముల నెరిగితిని. అపుడు మున్ను ఆకాశములో నన్ను ప్రసంసించిన యాస్త్రీ, ఆకసమున దేవివలె నాసమీపముననుండెను.
నావలె ఆమెయు చిదాకాశమే. స్వప్నమందు చిదాకాశమే బాహ్యాభ్యంతర రూపములుగ ఉదయించినట్లు, ఆ సమాధియందాదృశ్యము చిదాకాశరూపముగనే యుండియుండెను.
స్వప్నమందు యుద్ధ కోలాహలములు, వాస్తవముగ లేకున్నను మనుజులు అనుభవించుచున్నట్లు, ఈ జగత్‌స్వరూపము లన్నియు అనుభవింబడుచున్నవి.
బోధ కొరకు స్వప్నమని చెప్పినప్పటికి వాస్తవముగ ఈ దృశ్యము సత్తు,స్వప్నము కాదు. కేవలము బ్రహ్మమేయగును. అటు పిమ్మట అనురాగవతియు, దృశ్యరూపిణియునగు ఆ స్త్రీయొక్క అభిప్రాయము నెఱుగగోరి, నేనామెను తన అభిప్రాయమడిగితిని.
ఈ జగత్తు ఆత్మతో స్వప్నమే అగును. స్వప్నమందలి ఏ ద్రష్ట,దర్శన,దృశ్యములు నిర్మల చిదాకాశములే అయినట్లు, జగత్‌రూపమును నిర్మల చిదాకాశమే.
సాకారులైన జీవుల స్వప్నము చిదాకాశమైన నిరాకార బ్రహ్మము యొక్క ఈ జగత్తు, చిదాకాశమనుట సత్యము. ఓ రామా| వాస్తవముగ కర్తృత్వముగాని, భోక్తృత్వముగాని, జగత్తుగాని లేవు. బ్రహ్మమే కలదు. ఈ శరీరము ప్రారబ్ధ శేష పర్యంతముండినను లేకున్నను సరియే.
అజ్ఞాని దృష్టియందు, అనంతములైన దృష్టులు గలవు. జ్ఞాని దృష్టిలో చిద్ఘన మాత్రమే యైన ఏకమగు బ్రహ్మము కలదు. అంత శ్రీరాముడిట్లు ప్రశ్నించెను.
నిరాకారమగు దేహముచే, ఆ స్త్రీతో తమ వ్యవహారమెట్లు సంభవించినది? తామెట్లు మాట్లాడగల్గిరి? అని అడగగా వసిష్ఠుడిట్లు పలికెను. చిదాకాశమే శరీరము కాగ, శబ్ధములనుచ్ఛరించు అవసరములేదు.
అవి కల్పనలే. స్వప్నమున శరీరాదులు లేకనే వచనాది వ్యవహారము సంభవించుచున్నది. మరియు మృతునకు శరీరమున్నప్పటికి వచనములేదు. స్వప్నమందు వచనమున్నచో,అతని సమీపమునందున్నవానికి, అవివినబడునుగదా.
కాన స్వప్నమందలి విచారణ నిజము కాదు. భ్రాంతియే స్వప్నదేహములందు చిదాకాశమే, శబ్ధరూపము పొందుచున్నది. ఈ జగత్తులన్నియు నిక్కముగ స్వప్నరూపములే. స్వప్నమువలె అవి ఆత్మకంటే భిన్నము కావు. స్వప్నమందు మరల స్వప్నము తోచినట్టు, ప్రతి జగంబులోను మరల పరస్పరము ఒకదానికొకటి గాంచకున్నవి.
అటనిద్రించు జీవులు, స్వప్న జగత్జాలముపొంది అచట కల్పింపబడిన పగటియందు, సర్వ వ్యవహారములు నాచరించుచున్నారు. అట్లు నిద్రించుచున్న మనుష్యులు, వారి వారి స్వప్నములందు వ్యవహారములు గావించుచున్నారు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 YOGA-VASISHTA - 235 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj
🌴 NIRVANA PRAKARANA - 65 🌴
🌻 10. THE STORY OF KACHA - 2 🌻
Brihaspati said:
The wise who have understood what mind is, say that it is no other than Ahankara (the idea of „I‟). The idea of I existing within all creatures is the impure mind.‟
Kacha asked: „It is indeed difficult to avoid this idea of „I‟. How is this adamant to be splintered to pieces?‟
Brihaspati replied: Pains does not really exist. It is very easy to remove this Ahankara. Within the time taken in the squeezing of a flower or the twinkling of an eye, this Ahankara can be easily eradicated. No long dissertation is necessary in this topic.
One only Principle alone is, which is the nondual, the endless, the supreme Jnana, the immaculate, and the Plenum purer than Aka.sa.
Meditate upon It without fluctuation of mind and free yourself from all pain with true calmness of mind. Being quite unreal, Ahankara will perish (through efforts).
How ran Ahankara grow in the atmosphere of the meditation of the eternal? Can dust arise out of the waters, or waters, out of the fire? Contemplating upon the Eternal, may you be free from the differentiated conceptions of * I, he, etc.
Tatwa Jnana is that non-dual one which is subtle, immaculate, the supreme self-light, and the all which is not subject to the forms generated by the quarters, time, etc., and is not obscured or sullied by pains, etc. May you be in this certitude of Atmic Reality.‟ So Brihaspati revealed the highest of mysteries.
May you be, Oh Rama, in that self-same desireless state in which Muni Kacha was, who having abandoned the idea of „I,‟ „you,‟ etc., and destroyed all internal attractions, was full of Atmic meditation as a Jivanmukta without any Vikalpas in his mind. In Kaivalya (or emancipation), this Ahankara is nothing but unreal.
Therefore do not set your heart upon giving or taking it up. Who will dream of taking hold of or letting go the horns of a hare which are unreal.
Here Rama asked: How in the Plenum of BrahmaJnana did there arise an element foreign to it?
Vasistha replied: The laying hold of heterogeneous ideas which are unreal tends to the paltry re-births; but the merging of the ideation into the one Reality without any doubts is the emancipation from rebirths‟.
Continues.....
🌹 🌹 🌹 🌹 🌹
Comments
Post a Comment