శ్రీ యోగ వాసిష్ఠ సారము - 236 / Yoga Vasishta - 236

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 236 / Yoga Vasishta - 236 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 33 🌴
🌻. అహంకారము - 4 🌻

మోక్షరహితులు,శరీరశూన్యులు, వాసనాసహితులు,జాగ్రత్తును పొందనివారు, స్వప్న జగత్తునందు మాత్రమే నివసింపగలదు.

మనము జాగ్రత్తు ననుభవించుచున్నట్లు, వారు తమ స్వప్పమందలి పర్వత, సముద్ర, పృధివి,జన సముదాయ సహితమైనట్టి సమస్త దృశ్యములను చిరకాలము సత్యముగ నమ్మియనుభవించుచున్నారు. కావున వారి స్వప్నము,మన ఈ జగత్‌ రూపమేయగుచున్నది. నీ స్వప్నమందు ఏ నగరములను నివాసములను గాంచితివో, వారావిధమున నిపుడును అచ్చటనే ఉన్నారు.

ఏలన బ్రహ్మము సర్వరూపమైనది. ఎట్లు స్వపదార్ధములు జాగ్రత్తునందు నశించునట్లు అనుభూతమగుచున్నవో, అట్లే అవి స్వప్నమందు స్థితిగల్గియున్నట్లు అనుభూతమగుచున్నవి.

మరణించినను జీవించినను మోక్షము పొందువరకు, జీవులకు అనంతములైన జగంబులు అక్షయముగను, వేరువేరుగను నుండుచున్నవి. జీవుల వాసనలయందు అసంఖ్యాక జీవులు కలవు. యొక్కక్క జీవుని మనంబునందు, అసంఖ్యాకములైన జగత్తులు కలవు.

ఈ యొక్క జగత్తునందలి ప్రతి జీవి మనస్సునందు, మరల అనేక బ్రహ్మాండములు కలవు. ఇట్లు దృశ్య భ్రమ కొనసాగుచునేయున్నది. దీనికి హద్దులు లేవు. బ్రహ్మజ్ఞానిదృష్టిలో ఇదంతయు బ్రహ్మరూపమే యైయున్నది.

తదుపరి ఆ కమలనయన అగు స్త్రీని, నీవెవరు? ఇటకేల చనుదెంచితివి? ఎవరి కొమరితవు, భార్యవు, ఏమి ప్రార్థించుచున్నావు, నీ నివాసమేది అని అడుగగా; ఆ స్త్రీ తన వృత్తాంతమును యధాతదముగ ఇట్లు పలికెను. సంసారదుఃఖముచే పీడితనై, తత్‌దుఃఖముచేత, ఆ దుఃఖనివృత్తికై తమవద్దకేతెంచితిని.

ఓ మునీంద్రా| చిదాకాశమున ఒకానొకచోట తమ జగద్రూప గృహమున, పాతాళ, భూలోక, స్వర్గములను మూడు లోపలి గదులు కలవు.

అట్టి గృహమున మాయ ఒక కన్యను సృజించెను. ఆ గృహమున సప్తద్వీపములు, సముద్రములు కలిగి, సర్వదిశలందు వ్యాపించి, పదివేలయోజనముల విస్తీర్ణము గల్గిన సువర్ణమయమగు భూప్రదేశము గలదు. అందు రాత్రియందు స్వప్రకాశముగల, కోర్కెలన్నిటిని తీర్చగల చింతామణిగలదు. మరియు ఆ భూమి సంకల్ప మాత్రముచే సమస్త భోగములు కలుగజేయునదైయున్నది.

అప్సరపలు, దేవతలు,సిద్ధులకు స్ధానమైయున్నది. అచట లోకాలోకమను ప్రసిద్ధ పర్వతమొకటిగలదు. ఆ పర్వతమందొకచోట, అంధకారము వ్యాపించియున్నది. ఇంకొకచోట ప్రకాశము విస్తరించియున్నది.

ఒక్కొక్కచోట సాధు జనులు, మూర్ఖులు, బుద్ధిమంతులు, జనశూన్యము, జనసమృద్ధము, దేవతలు. అసురులు ఇత్యాది వివిధ పరిస్థితులు కలవు. అట్టి లోకాలోక పర్వత శిఖరముపై, అనేక రత్నమయములైన శిలలు గలవు. ఆ శిలలపై సింహములు, వానరములు సదా విశ్రమించుచుండును. అందొక దృఢమైన శిలయొక్క యుదరభాగమున నేను నివసించుచుంటిని.

బ్రహ్మదేవుని ఆజ్ఞచే, నేనచట బంధింపబడి, అనేక యుగములు అచట గడిపితిని. నాతోపాటు నాపతియు నచట బద్ధుడైయున్నాడు. మేమిరువురము అచట చిరకాలము గడిపితిమి.

కామదోషములచే మేమిరువురము, మోక్షము పొందకయుంటిమి. మాతో పాటు మాపరివారమంతయు నచట గలదు. బ్రాహ్మణుడైన నాపతి, బాల్యమునుండి బ్రహ్మచర్యముతో, కపటము లేని ఇంద్రియ చాపల్య రహితుడై పడియున్నాడు.

అతని వ్యసన పరురాలనగు, భార్యనగు నేను అతను లేకుండ ఒక నిమిషమైనను దేహమును ధరింపజాలకున్నాను. అతడు నన్నెట్లు తన భార్యగా గ్రహించెనో ఇరువురికి ఇట్టి స్నేహమెట్లు వృద్ధిపొందినదో వచించెదవినుడు.

ఓ రామచంద్రా| ఉత్తమ కులస్ధుడు, సజ్జనుడు, జ్ఞానసంపన్నుడగు నా భర్త పూర్వకాలమున, తన నివాసమందు తనకు తగిన యుత్తమ కులవతియు సౌందర్యాది గుణవతియునగు స్త్రీని, తన మనస్సునందు చిరకాలము భావించగ నేను జనించితిని. మనస్సుచే జనింపబడిన నేను అతని మానసికభార్యనై వృద్ధిపొందితిని.

క్రమముగ నేను పూమొగ్గవంటి ఎతైన స్థనములతో శోభించుచు,పల్లవములను హస్తములతో, సమస్త గుణములతో, హరిణివంటి దీర్ఘ నేత్రములతో, మన్నధునికి కూడ ఉన్మాదము కలుగజేయ గలదానను, సర్వజీవులను నిరంతరము హరించుదాననైయున్నాను.

ఇంకను నేను లీలావిలాసములందు ప్రీతిగల్గి, గాన వాయిద్యములందు భోగములందు అనురాగముగల్గి, తృప్తిపొందకమున్నాను.

మనోమయరూపిణి నగుటచే, నాతని ప్రియసఖివలె సంపదను, దారిద్య్రమును సమముగ చూచుదానను. నేను కేవలము నా పతి గ్రహమునందే గాక, నాతనిచే కల్పితమగు ముల్లోకములందు చరించుచున్నాను.

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 236 🌹
✍ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 NIRVANA PRAKARANA - 66 🌴
🌻 11. THE STORY OF MITHYA PURUSHA, THE ILLUSORY PERSONAGE - 1 🌻

Summary: This Ahankara is concreted in the shape of a Mithya-Purusha and illustrated.

May you attain Atma-Jnana and enjoy supreme bliss after giving up all conceptions of diversities. Do not afflict yourself, oh Rama, like the MithyaPurusha.

So said Vasishta, when Raghava asked him thus:

How did Mithya-Purusha rove about with an afflicted heart and without the least benefit to himself? Please explain it to me lucidly; however surfeited it may be, with the ambrosial Jnana.

Vasishta continued: This story will be provocative of great laughter and marvellous in its incidents. In a certain retired nook of Chidakas where there is not the universe, a certain male personage arose.

He was accoutred in full with the panoply of Maya and replete with Ajnana. He was base in his tendencies, puerile and of dull head with the lowest intelligence.

He arose like rolls of hair appearing in the Akasa or water in a mirage. He was nothing I but a void out of a void. He went by the name of Mithya-Purusha.

Unobservant of his own growth and the Chit (Consciousness) that manifests itself as if distinct from the universe, he contracted the Sankalpa (or thought) of creating the highest Akasa without any impediments and did create one.

Then in order to set a limit to it, he constructed (an enclosed) abode. With the idea that the Akasa was pent up and protected by him in that habitation, his desires were bound by that Akasa as identical with it.

In course of time, it began to grow dilapidated and at last gave way, like a hill worn away by (Manvantaric) gusts of wind or like rain ceasing with the close of the rainy season.

Then this Mithya-Purusha bewailed the disappearance of the Akasa in the following manner, „Oh Akasa, in an instant have you vanished with the disappearance of my house.

Where have you gone?‟ Having finished his lamentations over this house Akasa, he created a fresh well and entering into it without any disturbance from without, became fondly attached to the Akasa therein.

Being disappointed as ever in this second effort of his, when the well became quite useless with time and was gradually filled up, he again was afflicted in mind and cried aloud.

Then again to preserve the Akasa, he created a fresh pot; and enamoured with its beautiful structure, he gladly entered it and was chained in it with affection. Time, oh Rama, set again its hands on this vessel and disposed of it.

Finding that all the things, he created with great belief in their permanency, became the victims of time, he dug a pit in the ground and becoming greatly attached to the Akasa therein, lived in it, as if permanent.

Even this was done away by the elephant of time, like light dispelling darkness. Crying over its loss as usual, he built again a circular abode with the four quarters in it and dwelt in it with great joy.

When the time of destruction arrived for doing away with this house and all the other mundane eggs, he drooped like a dry leaf in a whirlpool of wind.

The usual cries being over, he created a grange for the Akasa, which having served him for a time succumbed to time. Thus did he grieve for a long period over the loss of these many creations of his, namely house-Akasa, well- Akasa, etc.

Continues.....
🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 31 / YOGA VASISHTA - 31