శ్రీ యోగ వాసిష్ఠ సారము - 239 / YOGA-VASISHTA - 239

Image may contain: ‎2 people, ‎text that says "‎נסם 1000O !! भजन !! !! जय राम कृपा कर भव भय हर Helo‎"‎‎
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 239 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 36 🌴
🌻. అభ్యాసము, ప్రభావము - 2 🌻

సమాధిద్వారా బ్రహ్మమును దర్శించి అందు పర్వత, నది,లోక,లోకాంతర రూపభ్రమలను గాంచును. విద్యాధరియు,వసిష్ఠుడు సంకల్పముతో ఆ శిలయందు ప్రవేశించెను.

తదుపరి వారు శిలయందలి బ్రహ్మలోకమును చేరి అచట బ్రహ్మదేవునియెదుట కూర్చుండి, నాతో విద్యాధరి ఇట్లు చెప్పెను.

ఓ మునీంద్రా| యీతడే నాభర్త. వివాహనిమిత్తము నన్ను సృష్టించి, వృద్ధాప్యమును పొందెను. ఇంకను వివాహమాడలేదు. కావున నాకు వైరాగ్యము జనించినది. యీతడు కూడ విరాగియై ముక్తి కొరకు సాధనచేయుచుండెను.

కావున మునీంద్రా| నన్ను, నా పతిని తత్వోపదేశముచే ప్రబోధమొనర్చి, బ్రహ్మమార్గమున నియోగింపుము, అని పలికి తన పతిని సమాధినుండి లేపుటకై అతనితో నిట్లు చెప్పెను.

నాధా| మునిశ్రేష్టులగు వసిష్ఠుడు నేడు మనగృహమునకు విచ్చేసిరి.యీతడు మరొక బ్రహ్మాండమునకు ప్రభువైన బ్రహ్మదేవునికుమారుడు. వారిని పూజించవలసి యుండును. అని పల్కగ అతడు మెల్లగ కండ్లు తెరచి జాగ్ర్‌ స్థితికి వచ్చెను. అంతట నన్ను, ఆ విలాసినిని గాంచి మధురస్వరముతో నిట్లు పలికెను.

ఓ మునీంద్రా| తాము ప్రయాణ బడలికచే అలసియున్నారు, ఇచట విశ్రమింపుడు అని పలికి, మణిమయ ఆసనమున కూర్చుండేసి తదుపరి నన్ను పూజింపగ నేనిట్లంటిని.

ఓ మహాత్మ| ఈ విద్యాధరి తమ ఇరువురకు ప్రబోధమొనర్చుటకునన్నిచ్చటికి గొనితెచ్చినది. అది యుక్తమా| ఏలన తమరు సకల జ్ఞానపారంగతులు, సర్వభూతలములకు ప్రభువులు. ఈమె కామాంధయై యున్నది.

కాబట్టి ఈమె యొక్క ఉపదేశప్రార్ధన ఉచితముకాదు. కావున ఈమె ఇట్లెందుకు వచించుచున్నదో కారణము తెలియజేయకోరెదను. మహాత్మా| భార్యకొరకీమెను జనింపజేసితిరి.

అపుడు ఆ బ్రహ్మ ఇట్లనిరి.

సజ్జనులకు వృత్తాంతమంతయు యధార్ధముగనే వచింపవలయును. నేను కేవలము చిద్రూపాకాశమునుండి ప్రకటితమైన స్వయంభువమను పేరుగలవాడను. యధార్ధముగ నేనుత్పన్నము కాలేదు. ఆవరణరహితుడను, చిదాకాశరూపుడను.

నీవు నేను వారు, ఈ సంభాషణంతయు, సముద్రమందలి తరంగములవంటిది. నా అంతరంగమున నేను నాది యను వాసన, ఈ కుమారికి, మీకు,ఇతరులకు చైతన్యముకంటే భిన్నముగ భాసించుచున్నది.

కాని నాదృష్టియందుభిన్నముగనే యున్నది. నేను కేవలము ఆత్మరూపుడనై ఆత్మయందే నెలకొనిఉన్నాను. ఈమె నాసంకల్పముచే దేహరూపిణియై వెలయుచున్నది. ఈమె నాగృహిణికాదు.

కాని ఈమె బ్రహ్మదేవుని గృహిణియను భావము కల్గియున్నది. ఆమెయే అంతరంగమున సర్వజగత్తు వాసనయగుటచే వ్యర్ధముగ దుఃఖమును పొందుచున్నది.

వాసనాదేవియొక్క వైరాగ్యకారణమున, జగత్తు ప్రళయము, మిద్యా భ్రమత్వము ఏర్పడుచున్నది.

ఓ మునీంద్రా| నాయొక్క సంకల్పముచే నా ఆయువు పూర్తియగుచున్నది. నేను కైవల్యస్థితిని పొందదలచితిని. కాని నా వాసనాకల్పితమగు ఈ జగత్తునకు ప్రళయము సంభవించనున్నది. ఈ చిత్తకాశము వీడి బ్రహ్మకాశము పొందిన పిదప, మహా ప్రళయము, వాసనాక్షయము నగుచున్నది.

అందువలన ఈమె నన్ననుసరించుచు ఈ ప్రళయమున న శింపనున్నది. కమలమలు సరస్సునుండి విడిపోవ, వాటి వాసన లేనట్లే గదా| ఈమె ధారణాభ్యాసమోగముచే మా బ్రహ్మాండమును గాంచగల్గినది.

ఏ పర్వత గృహమందు జగత్తు గలదో ఈ పర్వతములందు, బెక్కు జగత్తులు గలవు. యోగదృష్టిచే వాటిని గాంచగలము. స్వప్న నగరమువలె ఈ జగత్తు, మిద్యయై, భ్రాంతిరూపమైయున్నది.

ఏవరీ జగత్తునెరుగుదురో వారికది చిదాకాశమే. తక్కినవారు భ్రమభాసులే. ఆధ్యంత రహితమైనను ఈ చైతన్యము శివాదుల రూపమున దోచుచున్నది. నిరాకారమైనను సాకారముగ కన్పట్టుచున్నది. స్వప్నమునందువలె, జాగ్రత్తునందు చిదాకాశమే తన స్వరూపమును పర్వతశిలలుగ గాంచుచున్నది.

కావున ఓ వసిష్ఠ మునీద్రా, మీరిపుడు మీబ్రహ్మాండమునకు బొండు. అచట సమాధిద్వారా ఆత్మ సుఖమును పొందుడు. నా చే కల్పించబడిన ఈ జగత్తు ఇపుడు ప్రళయముచే అవ్యక్తమగును. మేము కైవల్యము పొందబోవుచున్నాము.

ఓ రామచంద్రా| భగవంతుడగు బ్రహ్మదేవుడిట్లు వచించి సమాధియందు స్థితుడయ్యెను. విద్యాధరియు నట్లే ఆకాశరూపిణియైయుండెను. నేనును సమాధియందు స్థితుడనై, చిదాకాశరూపుడనై, యారహస్యమంతయు గాంచితిని.

ఆక్షణమున అతని సంకల్పము క్షీణింప, దాని ప్రభావమైన పర్వత,సముద్రాది సహిత పృధివి మెల్లగ క్షీణింపసాగెను. బ్రహ్మదేవుడు సమాధియందు నిశ్చలుడైయుండ, పృధివి నీరసమయ్యెను.

ఇట్లు బ్రహ్మదేవుని విరాట్‌రూపమందలి చైతన్య ముపసంహరింపబడుటచే, ప్రళయమేతెంచి, పృధివి రసహీనమయ్యెను.

సర్వజంతుజాలము, చైతన్యము కోల్పోయి క్షయమొందెను. సముద్రములు ఉప్పొంగెను. అందు జీవజాలము నశించినది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 239 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 NIRVANA PRAKARANA - 69 🌴
🌻 12. THE STORY OF BHRINGISASA - 2 🌻

He is the great actor who, being silent, is free from the ideations of „I‟ or self-identification with objects or from surprise, performs actions without any despondency or fear or without any desires in objects so as to be merely a witness to all, is never affected by fear or happiness and does not rejoice or repine, through an equal vision over all.

Know also that his mind will be undisturbed, whether in birth or death, appearance or disappearance (of objects).

He is the great true enjoyer who does not, through anger, long for or reject anything but enjoys fully only those things that befall him.

We shall say more about him. He will not lose his equilibrium of mind even in the enjoyment of the illusory pleasures and pains productive of excessive fear and no bliss; he will consider in the same light and enjoy things productive of dotage or death, regality or adversity; he will taste, with neither joy nor sorrow, dainties of all tastes whether bitter, sour, sharp, or saltish. Like salt, he will associate with both the virtuous and the vicious. Such is the true enjoyer.‟

„Now hearken to the description of the great or (true) renouncer. You should know that such an intelligent person age will abandon, in toto the stainless Dharma and Adharma, pleasures and pains, birth and death. He will not have even a scintilla of desires, doubts, actions, and certainties.

Oh Bhringisa, the Srutis also say that his heart will be free from Dharma and Adharma, mental thoughts and actions. He will also have rooted away from his mind all thoughts of the visible things.‟

So said Parameswara of the form of grace to Lord Bhringisa in days of yore. Having developed through practice this kind of vision over all, may you, oh lotus-eyed Rama protect your subjects.

Brahmic reality alone is that which is ever shining, has neither beginning nor end and is immaculate and non-dual. Nought else is.

Thus shall you contemplate and being filled with bliss, perform all actions, so that the stainless quiescence of mind may be in you and thereby in all.

The Jnanakasa alone is which is Brahman, devoid of the impure pains, the seed of all illusions, Paramatman the great, the grand One in which all thoughts merge.

Here there is none else but „That‟. Destroy all Ahankara with the firm conviction that there is nothing else foreign to „That‟ and that Sat and Asat will never affect It.

You will therefore relieve yourself of this formless Ahankara through developing Introvision, making the internals harmonize with the externals and being unaffected by the pains of past actions.

End of Chapter 12...

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 257 / YOGA-VASISHTA - 257

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹