శ్రీ యోగ వాసిష్ఠ సారము - 243 / Yoga Vasishta - 243

Image may contain: 2 people, people standing
🌹.శ్రీ యోగ వాసిష్ఠ సారము - 243 / Yoga Vasishta - 243 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 40 🌴
🌻. అభ్యాసము, ప్రభావము - 6 🌻

నిర్వికారచైతన్య శక్తియయిన క్రియారూపిణియైన ఆ దేవి స్వభావముగనే నృత్యము చేయుచుండును.

వాయువునందు, స్పందనవలె, శివునియందు ఇచ్ఛారూపిణియగు ఆ భైరవీదేవి కలదు.

నిరాకారమైనను వాయువు ఆకాశమందు శబ్ధసంచలనాది ఆడంబరము గావించునట్లు, నిరాకారమైనను శివేచ్ఛ జగత్తును విస్తరింపజేయుచున్నది.

ఇట్లు నృత్యమొనర్చుచు ఆ దేవి కాకతాళీయ యోగముచే ప్రేమవశమున సమీపమున నున్నట్టి శివుని సృశింప, తత్‌స్పర్శమాత్రము క్రమముగ తన రూపముకోల్పోయి శివునియందైక్యము కాజొచ్చెను.

తదుపరి భవాని సహితుడై, సర్వ సంహారకర్తయు, శాంతుడును, సర్వోపద్రవ వినాశకుడను, అద్వైతరూపుడునగు శివుడు మాత్రమే ఆకాశమంతయు యొప్పుచుండెను.

ఓ రామా| శివుని స్వాభావిక స్పందన శక్తియగు ఆ దేవి ప్రకృతియనియు, పరమేశ్వరియనియు, జగన్మాతయనియు వచింపబడుచు,వివిధ నామములచే ప్రసిద్ధికెక్కెను. పరమేశ్వరుడు ఆ ప్రకృతికంటే పరమైనవాడు.

ఈ ప్రకృతి పురుషుని స్పృజించి తన ప్రకృతి రూపమును త్యజించినదై; నది సముద్రమున లీనమైనట్లు అతనితో ఏకత్వరూపమొందుచున్నది. ఈ ప్రకృతి వాస్తవముగ చైతన్యరూపమై పరమపధమై, నిర్వాణరూపమైయున్నది.

కాబట్టి ఆ పరమ పురుషుని పొంది, ఎవడు అద్దానిని త్యజించును. దేనిచే జనన మరణ మోహమాయములగు, సమస్త దుఃఖములు శాశ్వతముగ శమించిపోవునో, అట్టి ఆత్మామృతము ననుభవించి ఎవడు అద్దానిని మరల వదలి వేయును?

ఓ రామచంద్రా| అచట మహాకాశమునందున్న, రుద్రభగవానుడు తన దేహమందలి భ్రాంతిని వీడి ఎట్లు శమించునో ఈ కథద్వారా వినుము.

నేను వీక్షించుచున్నపుడు, రుద్రభగవానుడు; ఊర్ధ్వ, అధో బ్రహ్మాండములును నిశ్చలముగనుండ, ఆ భగవానుడు ఆ రెండు బ్రహ్మాండ ఖండములను అవలోకించెను. ఆ తదుపరి వాటిని ఆకర్షించి తాను వాటిని భరించెను.

అంతట నాతడు లఘురూపమును ధరించెను. అంగుష్ట ప్రమాణముగను తదుపరి పరమాణువుగను అగుట నేను దివ్యదృష్టిచే గాంచితిని. అనంతరము అంతర్థానమయ్యెను.

మరియు ఆకలిగొనిన జింక, చిన్న ఆకులను మ్రింగినట్లు, ఆ రుద్రభగవానుడు బ్రహ్మాండముల రెండింటిని మ్రింగివైచెను. అట్లు జీవులు పుట్టుచు గిట్టుచు స్వర్గ నరకములందు, ఊర్ధ్వలోకములందు మరల మరల జనుచున్నాడు.

సూక్ష్మరూపమగు ఇంద్రియాదుల యుత్పత్తిచే వసిష్ఠుడు తనయందే హిరణ్యగర్భరూపత్వము పొందుట. తన శరీరమందే జగత్తును గూర్చి కల్పనగావించుట నిచటవర్ణింపబడినది.

అంతట వసిష్ఠుడు ఇట్లు పలికెను.

రామచంద్రా| చిదాకాశ రూపుడనైన నేను ఏకాగ్ర చిత్తుడనై నాదేహమును పరికింప ధాన్యపు గరిసెయందు వర్షముచే తడుపబడిన బీజమందంకురమువలె నందొకచోట సృష్టిని గాంచితిని. నా యొక్క హృదయమున సృష్ట్యాదియందు సృష్టి యుదయించినది.

శిలయందు అనేక సృష్టులను గాంచిన నేను, నాశరీరములో సృష్టి దర్శనమును గూర్చిన సంకల్పముతో మేల్కొలిపితిని. స్వప్నమునందు, జాగృతియందు ఎట్లు జగత్తును గాంచెదమో అట్లే నాయందు ఆకాశమును,దిక్కులను,చిత్తమును నేనుభావమొనర్చితిని.

అనగా బుద్ధి ఏర్పడినది. అదియే సంకల్ప వికల్పములచే మనస్సని చెప్పబడినది. తదుపరి శబ్ధమాత్రముగ స్థూల,సూక్ష్మ పంచేంద్రియములు, దుఃఖము ఉదయించినది. క్షణమందు కల్పమువలె, పరమాణువునందు దీర్ఘప్రదేశమువలెను కల్పనచే నేనచట బ్రహ్మాండరూపమగు, చైతన్యాత్మను అనుభవించితిని.

వాయు చలనము వలె మనస్సును,స్వభావముగ సర్వత్రా శరీరాదుల నేత్రములు, దృశ్యమును జూచుచుండును. చూచిన సమయము, కాలము, చూచు విధానము, శ్రమ, ప్రదేశము, ఆకాశము దేశము నిత్యాది కల్పన ఆత్మకు సిద్ధించెను.

అదంతయు చైతన్యము యొక్క స్ఫురణయే. చూచుట,వినుట, స్పర్శ; ఇట్లు సర్వేంద్రియములు, రస, జ్ఞానేంద్రియములు సంభవించెను. కాని వాస్తవముగ నేమియు జరుగలేదు.

ఆ ఇంద్రియముల భోగము అనుభవించితిని. అంతట బ్రహ్మదేవుని శరీరమున భావన చేయగ, చతుర్ముఖ వేషధారినైయున్నాను.

నేను మొట్టమొదట ఉద్భవించిన శబ్ధమే ప్రపంచమున ఓంకార రూపమైనది. తదుపరి గాయత్రీ మంత్రము,వేదములు ఉచ్ఛరింపబడినవి.

ఇట్లు నేను సృష్టికర్త, జగద్గురువు, బ్రహ్మదేవుడనైతిని. అపుడు నేను అనేక స్వప్నములు కంటిని. అట్టి బ్రహ్మరూపుడనైనను, బ్రహ్మాండమును, దాని స్వరూపమును గాంచితిని.

వాస్తవమునకు అది లేనిదైయున్నది. ఇట్లు నా సృష్టి వలననే సమస్త సృష్టులు శూన్యములైయున్నను, జగత్తుగ భావించబడుచున్నవి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 243 🌹

✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 NIRVANA PRAKARANA - 73 🌴
🌻 13. THE STORY OF IKSHWAKU - 4 🌻

The mere conception of differentiation that this is good or that is bad, will be the seed of a series of pains. Should this seed be burnt up by the fire of equal vision, then where will be the room for generation of pains? Gently wear, through diverse human efforts, the sword of Abhava (non-existence) in you.‟

Oh King Ikshwaku wearing a garland in this dire forest of Karmas performed through your mind, sever all (differentia ted thoughts) through Abhava, attain the supreme seat and being filled with discrimination through the abandoning of Karmas, be immovably seated in that state.

Only he who, having merged within himself all the variegated differences of the universe and having crossed all the variety of thoughts, is free from the desires of the ever-agitating women and wealth and from the gloom of Ajnana generating the idea of * I and thus has developed true discrimination, will illuminate Brahmic bliss in himself. He alone will be free from pains.

May you meditate ever upon that Jnana Reality which is quiescent, equal in all and immaculate.‟ Again Manu continued „First Jnana should be developed through a deep study of Jnana Sastras and association with the wise.

This Subechcha (or good desire) forms the first Bhumika (or stage) of Jnana. It does not apply to Karma Yogis (who indulge in rituals alone).

The ceaseless AtmaVichara (Atmic enquiry) constitutes the second stage. Asanga-Bhavana is the third. In the fourth stage, Satvapatti will destroy to the root all Vasanas.

Ananda-Swarupa (the blissful Reality) replete with the non-illusory and immaculate Jnana is the fifth stage (of Asamsakti). This stage in which there is not the Upadhi, (vehicle) of waking or sleeping is the Jivanmukti stage.

In the sixth stage, it is like the Sushupti state of replete bliss, wherein there is nothing but the nature of non intelligence (or ignorance).

The exalted stage of the seventh is the isolation of Moksha which is part- less, equal in all, immaculate, beneficent, quiescent and the pure Turya.

This seventh state free from all objects and replete with bliss is stated by some to be the Turyatita state of Moksha which is Chit itself.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 31 / YOGA VASISHTA - 31