Posts

Showing posts from 2019

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 90 / Yoga Vasishta - 90

Image
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 90  / Yoga Vasishta - 90 🌹 ✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు 📚.  ప్రసాద్ భరద్వాజ 🌴 2. స్థితి ప్రకరణము 🌴 🌻.  సృష్టి ఎలా యుత్పన్నమయినది  🌻 శ్రీరాముడు సత్యమైన పరబ్రహ్మము నుండి సృష్టి ఎలా వుత్పన్నమయినదో తెలుపు మనగా వసిష్టుడిట్లు చెప్పెను.  బ్రహ్మమే ఈ జగద్రూపమున, బ్రహ్మముననే యూహింపబడుచున్నది. బ్రహ్మమందే వివిధ కల్పనలు సంభవించును. కారణము అవి సర్వశక్తి వర్జితము. చిదాత్మ ప్రధమమున, చిత్త సహిత జీవరూపము చెందుచున్నది. చిత్తము చేతనే అది కర్మమయ, వాసనా మయ మనోమయ శక్తు లన్నింటిని సంచయ మొనర్చుచున్నది. పిదప అట్టి శక్తులను ఫలరూపమున దర్శింపజేయుచు, మరల తిరోభావముచే నశింపజేయుచున్నది. జీవు లందలి, వివిధ సృష్టులై, సమస్త పదార్ధముల యొక్క ఉత్పత్తి బ్రహ్మము నుండియె నిరంతరముగ గల్గుచున్నది. మరల అతని యందే లయమగుచున్నది.  అంతట శ్రీరాముడు, అగ్ని యందు, శీతలత్వము, జలమందు దహనశక్తియు, సంభవించిన విధమున, జడత్వమగు, అదృశ్యమగు బ్రహ్మము నుండి, యీ జగత్తు ఎట్లు ఉత్పన్నమగు చున్నది? బ్రహ్మము నుండి యుత్పత్తి అయిన, యీ బ్రహ్మము, బ్రహ్మము వలె గాక మనస్సు యింద్రియములుగా ఎట్...

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 85 / YOGA-VASISHTA - 85

Image
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 85  / YOGA-VASISHTA - 85 🌹 ✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు 📚.  ప్రసాద్ భరద్వాజ 🌴 2. స్థితి ప్రకరణము 🌴 🌻. దామవ్యాళ కటాదుల స్వప్న వృత్తాంతము  - 1 🌻 కాశ్రీర దేశమున, యొక తటాకములో, మత్స్య జన్మ నెత్తిన పిదప, గ్రీష్మ ఋతువు నందు, మహిషములు ఆ తటాకమును త్రోక్కివేయుటచే, ద్వంసమైన చెరువు నందు వారు మువ్వురును నశించి మరల సార పక్షులుగా జన్మింతురు. ఆసార పక్షులు, స్వేతకమలము లందు, ఉత్తమ లతలందు, తరంగ సమూహము లందును, ఉత్తమ భోగముల ననుభవిరచి, చిరకాలము, విహరించిన పిదప శుద్దత్వము నొందిరి.  వివేక దృష్టిచే విచారించి, సత్వ రజస్తమో గుణములు భిన్నములు కాగా, వివేకబుద్ధి జనించి, ముక్తి కొరకై వారు మువ్వురు, వేరగుదురు. తదుపరి వారు అనుష్టానమను నగరమున, ప్రద్యుమ్న శిఖర మందు గల గృహము లన్నింటిలో శ్రేష్టమగు ఒక గృహమందు గల గోడపై, రాతి యందొక గూడు వుండును. ఆ గూటి యందు వ్యాళుడను దానవుడు చటకపక్షి (పిచ్చుక) రూపమున వుండును.  ఆ నగర మందు, శ్రీ యశస్కరదేవుడను రాజు కలడు. రాజ గృహమున నున్న పెద్ద స్ధంభము యొక్క వెనుక భాగమున గల రంధ్రము నందు, ధాముడను పేరు గల, దైత్యుడు, అ...

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 84 / YOGA-VASISHTA - 84

Image
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 84 / YOGA-VASISHTA - 84 🌹 ✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు 📚.  ప్రసాద్ భరద్వాజ 🌴 2. స్థితి ప్రకరణము 🌴 🌻. రామ, వ్యాళకట న్యాయము భీమభాస దృడ స్థితి - 2 🌻 అంతట దేవతలు మరల ధైర్యము తెచ్చుకొని, శంబరుని వధించు యుపాయము అడుగుటకు, బ్రహ్మ వద్ద కరిగిలి. వారు బ్రహ్మకు సురాసురుల యుద్ధమును వర్ణించి చెప్పెరి. అపుడు బ్రహ్మ యోజించి, నూరువేల సంవత్సరముల తరువాత,శంబరుడు; విష్ణు దేవునిచే హతుడగును. అంత వరకు మీరు, కపట యుద్ధ మొనర్చుచు తప్పుకొని పారిపోవుడు. అపుడు వారు అహంకార బద్ధులగుదురు. ఇపుడు వారు వాసనా రహితులగుటచే, వారిని జయించుట కష్టము. ఆశాపాశము లందు వాసనాబద్ధులు అయిన వారు యుద్ధమున తప్పక నశింతురు.  ఈ దేహేంద్రియములు నేను ఈ పుత్రధనాదులునావి, అను అహంభావులు, సమస్త ఆపదల పాలగుదురు. సర్వజ్ఞుడగు ఆత్మను, దేహాదులుగ భావించువాడు, జనన మరణ రూపమగు దీనత్వమును పొందును.  ఈ లోక మందు, ఆత్మ కంటె అన్యముగ మరొకటి లేదు. అను బుద్ధి కల్గి విశ్వసించుటయె, నిజమైన జీవితము. దామవ్యాళ కటాదులు, దేహ భావము పొందు నంతవరకు వేచియుండుడు. తృష్ణ వలన సమస్త విపత్తులు సంభవించును. ధీరుడైనను క...

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 83 / YOGA-VASISHTA - 83

Image
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 83 / YOGA-VASISHTA - 83 🌹 ✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు 📚.  ప్రసాద్ భరద్వాజ 🌴 2. స్థితి ప్రకరణము 🌴 🌻. చిత్త జయము - 2 🌻 తృష్ణయను బాణములతో కూడిన యింద్రియములను శత్రువులను, జయించుట మిక్కిలి దుర్లభము. ఈ ఇంద్రియములు మొదట తన దేహమునే నాశనము చేయును. మాంసమును కోరు గ్రద్ధలు, దేహమను తన గూటిలో ప్రవేశించి, విజృంభించును. వివేకముతో వాటిని వశపర్చుకున్న, శాంతిని పొందును. వివేకముతో విషయములను శత్రువులను జయించిన, ఇంద్రియములను జయింపబడినపుడు, అజ్ఞానమను పిచాచములు విజృభించుచునే యుండును. ఈ మనస్సే జన్మ వృక్షములను ఛేదించునది. ఇదే సాధన చతుష్టయ సంపత్తి మొదలు, తత్వ సాక్షాత్కారము వరకు గల కర్మలను, చేయించుచుండును.  అట్టి ఈ మనస్సును వివేకముతో, శుద్ధమొనర్చిన, మోక్షసిద్ధికి తోడ్పడును. ఉత్తమ వివేకము నాశ్రయించి, బుద్దిచే సత్యము నవలోకించి, యింద్రియములను శత్రువులను జయించి, సంసార సాగరమును దాటవేయుము. ఈ మిధ్యాభూతమగు దేహము నేనను మిధ్యాభావమును త్యజించి, సత్యమైన ఆత్మతత్వమును ఆశ్రయించి, అమనస్సుడవై, భోజనాది వ్యాపారముల నొనర్చిన, నీవు బంధము లందు దగుల్కొనక ముక్తుడవగుదువు....

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 82 / YOGA-VASISHTA - 82

Image
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 82 / YOGA-VASISHTA - 82 🌹 ✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు 📚.  ప్రసాద్ భరద్వాజ 🌴 2. స్థితి ప్రకరణము 🌴 🌻. చిత్త జయము  🌻   ఓ రామా! సమాధి నభ్యసించుటచే బాహ్యభ్యంతర జగత్తుల గూర్చిన మననము మిధ్యయనియెఱుంగుము. కేవలమునే గాంచుటచే, స్వభావము నిర్మలమగును. కేవలము సాక్షిభూతుడుగ నుండుట చేతనే జీవుని ఆత్మ నిర్మలమగును. భోగములందు రమణీయముగ దోచుచు, రసహీనమగు భోగములందును, యిచ్చ లేకుండ వాని ఆత్మ నిర్మలమగును. చిల్లగింజచే జలము, నిర్మలమగునట్లు జ్ఞానము చేత మనస్సు నిర్మలమగును. ప్రాత:కాలమున సూర్యోదయముచే, ఆకాశము ప్రకాశించునట్లు; గురుసేవ, శ్రవణ, వానన, నిధి, ధ్యాసలచే, సమాధులచే, హృదయ సరోవరము వికసించును.  ఆత్మ సాక్షాత్కారము పొందిన వాని ద్రృష్టిలో, బ్రహ్మ విష్ణు హరాదులు, అధికారాదులందు క్షేశమును పొందగలరు. జనన మరణములు, అజ్ఞానినే వశపర్చుకొనునుగాని, జ్ఞానిని కాదు. పరమాత్మ సర్వవ్యాపకుడైనను తాను, రోమము యొక్క అగ్రభాగమందలి, కోటి భాగము యొక్క లక్షవభాగము కంటె, ఇంకను సూక్షమైనవాడని తెలిసిన వాడే సత్యమును జూచినవాడగును. జీవాత్మ, తద్భిన్నమగు, ఈ జగత్తంతయు చైతన్య జ్యొతి మ...

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 81 / YOGA-VASISHTA - 81

Image
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 81 / YOGA-VASISHTA - 81 🌹 🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 81 🌹 ✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు 📚.  ప్రసాద్ భరద్వాజ 🌴 2. స్థితి ప్రకరణము 🌴 🌻. జాగ్రత్‌, స్వప్న, సుషుప్తావస్థలు  🌻 అంతట శ్రీరాముడు, జాగ్రత్‌, స్వప్న, సుషుప్తావస్ధల భేదములను తెల్పుమని వసిష్టుని కోరెను.  స్ధిర ప్రత్యయము కల్గివున్నది. జాగ్రత్‌ వ్యవస్త అని, అస్ధిర ప్రత్యయ యుక్తమైనది, స్వప్పమనియు చెప్పబడినది. స్వప్నమున జాగ్రత్‌ లక్షణమున్న, అదియు జాగ్రత్తే యగును. జాగ్రత్‌ స్ధిరముగానిచో, స్వప్నము అని చెప్పబడును. స్ధిర అస్ధిరములే రెంటికి ముఖ్యభేదము. రెడింటి అనుభవము సర్వత్ర సమమైనదే. స్వప్పమును స్వప్నకాలమున స్ధిరత్వముచే జాగ్రత్‌ అగును. అలానే జాగ్రత్‌ అస్ధిరము అయిన అది స్వప్నమే అగును.  హరిచంద్రునకు ఒక రాత్రి ద్వాదశ సంవత్సర కాలముగ తోచినది. శరీర మెపుడు మనోవాక్కర్మలచే, వ్యవహారము సల్పునో, అపుడు, ప్రాణవాయువు ప్రేరిత మగు జీవ చైతన్యము, తేజము, వీర్యము, జీవము మొదలైన నామములచే, ప్రసిద్ది కెక్కినది. నేత్రాదుల ద్వారా, బాహ్య ప్రదేశమున, వ్యాప్తమగు జీవ చైతన్యము, పలువిధ వికారములచే తన...

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 79 / YOGA-VASISHTA - 79

Image
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 79 / YOGA-VASISHTA - 79 🌹 ✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు 📚.  ప్రసాద్ భరద్వాజ 🌴 2. స్థితి ప్రకరణము 🌴 🌻. శుక్రాచార్యుడు: భృగు, యముల వృత్తాంతము - 6 🌻 *ఒక్కొక్కసృష్టి యందు, విభిన్న రూపమున అనేక సృష్టులు గలవు. ఈ వివిధ సృష్టులందు బ్రహ్మత్వమున భేదము లేదు. బీజము, జలసంబంధముచే వృక్షమై మరల బీజముల నుత్పన్నము చేయునట్లు బ్రహ్మమున కామకర్మాదులను జలము యొక్క సంబంధము చేత, మనోరూపమొంది, జనన మరణాదుల కల్పన మొనర్చుచు, అధికారి దేహము లభింప, శ్రవణ, మననాదులచే, జ్ఞానప్రాప్తి నొంది, తద్వారా, పూర్వ శుద్ధమగు, తన బ్రహ్మస్వభావమును, మరల పొందును. అట్లు బ్రహ్మకారంబున, జీవుడే, జగద్రూపమున విజృంభించు చున్నారు.  మూలమునకు కారణమేమన, నయ్యది చెప్ప శక్యము కాదు. ఏలన, మూలమునకు మూలమే లేనందున, ఆ భావన వర్జిత మైనది. నిర్వకారము, అద్వితీయము, అసంగమమగుటచే, యదార్ధముగ బ్రహ్మ మకారణమైనది. ప్రపంచ మంతము వ్యాపించుట చేత బ్రహ్మమునకు కారణము నిమిత్తాదులు సంభవింపనేరవు. అందువలన సార భూతమగు బ్రహ్మమును గూర్చియె విచారింప దగియున్నది. బీజము ఆకారవంతము గాని, బ్రహ్మము ఆకార రహితము. అందువలన బ్రహ్మముతో ప...

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 78 / YOGA-VASISHTA - 78

Image
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 78 / YOGA-VASISHTA - 78 🌹 ✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు 📚.  ప్రసాద్ భరద్వాజ 🌴 2. స్థితి ప్రకరణము  🌴 🌻. శుక్రాచార్యుడు: భృగు, యముల వృత్తాంతము - 5 🌻 అందువలన, బాహ్యలోకోచిత వ్యవహరములు నడుపుచూ, అంతరంగమున, వ్యవహార రహితుడై ఆత్మ యందు, ధృడభావము కల్గి వైషమ్యము లేక కోర్కెలన్నింటిని త్యజించి యుండును. శారీరక, మానసిక దు:ఖములు జనన, మరణ రూపమగు, సంసార మార్గమున, మమత్వమను భయంకర యంధకూపమున నీవు పడకుమా అని వసిష్టుడు శ్రీరామునకు తెల్పెను. మరియు సమస్త కోర్కెలు విడనాడి ఆత్మలచే, ఆత్మ యందు, స్ధితి కల్గి యుండి, కర్తవ్య మగు కర్మలు, ఫలాసక్తి లేకయె యొనర్చుము. ఏలయనగా కర్తవ్య కర్మలననురించుట నిశ్చయముగ దేహ స్వభావమై యున్నది. ఓరామా, నీవు నిర్మలము శుద్దము, సర్వాత్మయు, సంకర్తయగు బ్రమ్మమే. అదే భావముతో నుండుము. తదుపరి కాలుడు, శుక్రాచార్యుని తన తాప శరీరము త్యజించి, యాభృగూత్పన్న తనువు నందు ప్రవేశింపుమని కోరెను. అనంతరము, తపమొనర్చి, పిమ్మట దైత్యుల గురుత్వము, నీచె యొనర్పదగి యున్నది అని చెప్పెను. శుక్రాచార్యులు తన పూర్వశరీరమున ప్రవేశించగా, భృగువు అ శరీరముపై తన కమండలముల...

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 77 / YOGA-VASISHTA - 77

Image
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 77 / YOGA-VASISHTA - 77 🌹 ✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు 📚.  ప్రసాద్ భరద్వాజ 🌴. 2. స్థితి ప్రకరణము  🌴 🌻. శుక్రాచార్యుడు: భృగు, యముల వృత్తాంతము - 4 🌻 అతడు ప్రశాంత చిత్తుడై సమాధి యందుండుటచే చంచలత్వము వీడి, విశ్రాంతి గొనుచున్నట్లుండెను. అతడు చిరకాల మనుభవించి, త్యజించి వైచినదియు, నిరంతర హర్షశోకములతో కూడి యుండినదియునగు సంసార సాగరమును గూర్చి విచారించు చున్నట్లుండెను. నిశ్చలత్వముతో భ్రమరహితుడై, ప్రశాంతముగ నుండెను. నిర్వి కల్ప సమాధి స్ధితిలో కర్తృత్వ, బోక్కృత్వముల విడనాడి, బ్రహ్మపధమును ఆశ్రయించి యుండెను. అట్టి పుత్రుని జూచిన భృగువును గాంచి కాలుడు ఇట్లనియె. ఈతడే నీ కుమారుడు అనుచు ''లెమ్ము'' అని పల్కినంతనే, నిద్రించుచున్న మయూరము, మేఘ గంభీర నాదమునకు లేచినట్లు, శుక్రాచార్యుడు, సమాధి నుండి మేల్కొనెను. అంతట శుక్రుడు, బ్రాహ్మణ వేషము ధరించిన, భృగుని, కాలుని గాంచి వారికి ప్రణమిల్లెను. వారు మువ్వురు, ఒక శిలపై ఉపవిష్ణులై, తదుపరి, శుక్రాచార్యులు వారి దర్శనముచే పరమశాంతిని పొందితినని, నాలోని మోహము నశించినదని, అట్టి తేజ సంపన్నులగు మీరెవరని...