శ్రీ యోగ వాసిష్ఠ సారము - 77 / YOGA-VASISHTA - 77

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 77 / YOGA-VASISHTA - 77 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ

🌴. 2. స్థితి ప్రకరణము  🌴
🌻. శుక్రాచార్యుడు: భృగు, యముల వృత్తాంతము - 4 🌻

అతడు ప్రశాంత చిత్తుడై సమాధి యందుండుటచే చంచలత్వము వీడి, విశ్రాంతి గొనుచున్నట్లుండెను. అతడు చిరకాల మనుభవించి, త్యజించి వైచినదియు, నిరంతర హర్షశోకములతో కూడి యుండినదియునగు సంసార సాగరమును గూర్చి విచారించు చున్నట్లుండెను. నిశ్చలత్వముతో భ్రమరహితుడై, ప్రశాంతముగ నుండెను. నిర్వి కల్ప సమాధి స్ధితిలో కర్తృత్వ, బోక్కృత్వముల విడనాడి, బ్రహ్మపధమును ఆశ్రయించి యుండెను. అట్టి పుత్రుని జూచిన భృగువును గాంచి కాలుడు ఇట్లనియె.

ఈతడే నీ కుమారుడు అనుచు ''లెమ్ము'' అని పల్కినంతనే, నిద్రించుచున్న మయూరము, మేఘ గంభీర నాదమునకు లేచినట్లు, శుక్రాచార్యుడు, సమాధి నుండి మేల్కొనెను. అంతట శుక్రుడు, బ్రాహ్మణ వేషము ధరించిన, భృగుని, కాలుని గాంచి వారికి ప్రణమిల్లెను. వారు మువ్వురు, ఒక శిలపై ఉపవిష్ణులై, తదుపరి, శుక్రాచార్యులు వారి దర్శనముచే పరమశాంతిని పొందితినని, నాలోని మోహము నశించినదని, అట్టి తేజ సంపన్నులగు మీరెవరని ప్రశ్నించెను. అంతట భృగువు నీవు ఇప్పుడు జ్ఞానివి. నిన్ను నీవు స్ఫురణకు తెచ్చుకొనమని పల్కెను.

అంతట శుక్రుడు ధ్యాననిష్ణుడై తన గత జన్మలను గ్రహించెను. ఆశ్చర్యముతో, ప్రసన్న చిత్తుడై అనేక జన్మలు నాకు గతించినవి. రాజుగను, దేవతగను, వివిధ జీవులలోను, మానవునిగను జన్మించి, నేను చూడ నివస్తువు లేదు. చేయనిక్రియ లేదు. ఇష్టాయిష్టాములను, అనుభవించితిని. ఇపుడు పరమాత్మ జ్ఞానమున, తెలియవలసిన దంతయు గ్రహించితిని, చూడవదలసిన దంతయు చూచితిని. చిరకాల సంసార భ్రమను వీడి విశ్రాంతి నొందితిని. కాన నికనాశుష్కించిన శరీరము మందర పర్వతముపై పడియున్నది. దానిని చేరినా పూర్వదేహముచే నా జీవిత వృత్తిని సాగించెదను. కేవలము ప్రారబ్ద కర్మము ననుసరించి, శేషించిన, వ్యవహారమును మాత్రము కొనసాగించెదను. ధృడమగు తత్వ జ్ఞానముచే, వాసన లన్నియు నశించినవి.

భృగువు, కాలుడు, శుక్రులు మువ్వురు తత్వజ్ఞులు, జగత్తు విచిత్రగతిని గూర్చి విచారించుచు క్రమముగ ఆకాశమును, మేఘమండలమును జొచ్చి, సిద్దమార్గము గుండా క్షణములో మంధర పర్వత గుహను చేరిరి. అచట శుక్రులు, తన శిధిల శరీరమును గాంచి, యిదియె గదా! దేవాంగనలచే ప్రేమింపబడి, చందన వాటికల క్రీడించబడి, ఆయా విచిత్ర విలాసము లందు, బాల్య, యవ్వనాది దశలందు శిధిలమై శుష్టించి యున్నది. చీమలు ప్రాకుచు, శవరూపమున తుచ్చ స్ధితిలో నున్న ఈ శరీరము, ఈ వన మందు సుఖముగ నిద్రించుచున్నది కదా! యేవిధమైన దు:ఖము లేక, సంతాప రహితమై, మనోవర్జితమైయున్న యీ శరీరమును గాంచుచున్నాను.

అంతట శ్రీరాముదు వసిష్టు నిట్లు ప్రశ్నించెను. శుక్రాచార్యుడు, అనేక శరీరములను అనుభవించి నప్పటికి, భృగూత్పన్నమగు దేహము నందే, వానికత్యంత స్నేహమేల, దాని కొరకు విలపించుటేల యని ప్రశ్నించెను. అంతట వసిష్టుడు శుక్రాచార్యుడు దేహ వియోగ సమయమున, భృగుని గృహాదుల యందు, దేహాకారముతో, పూర్వ కల్పమున నుండెను. మరియు భృగువు వీర్యము ద్వారా, తల్లి గర్భమున శుక్రాచార్యుని దేహ రూపముండెను. పితృ సముఖమున ఈ శరీరమునకు, బ్రాహ్మణో చితమగు సంస్కారములు జరుపబడెను.

ప్రధమ కల్పముననే, ఈ శరీరము భృగు మహర్షి వలన కలిగెను, కనుక శుక్రాచార్యుని కద్దాని యందే అధిక స్నేహము కల్గుటయు, దాని కొఱకు విలపించుటయు సంభవించినది. అట్లు జరుగుట దేహ స్వభావము. జ్ఞానికైనను, అజ్ఞానికైనను, దేహ క్రమమున్నంత వరకు సదా లోక వ్యవహార మివ్విధముగనే జరుగుచుండును. వ్యవహారమున అజ్ఞానివలెనే, జ్ఞానిప్రవృత్తి గల్గి యుండును. మరియు నదియె బంధ మోక్షములకు కారణమగును. 

సుఖ వృత్తు లందు, మిక్కిలి సుఖముగను, దు:ఖ వృత్తులందు, మిగులు ద:ఖములను బొందుచు, ప్రపంచమున జ్ఞానులగు మహాత్ములు కూడ అజ్ఞునుల వలె వర్తించునట్లు గన్పట్టుదురు. కాన జ్ఞానేంద్రియములచే నాసక్తి లేక లోకమున కార్య మొనర్చు వానికి, కర్మేంద్రియములు బద్ధమైనను ముక్తుడే అగును. లేనిచో జ్ఞానేంద్రియముల ఆసక్తులైన వారి కర్మేంద్రియములు, ముక్తమైనను వాడు బద్ధుడే అగును. ప్రపంచమున, సుఖ, దుంఖ, బంధ, మోక్షములకు, జ్ఞానేంద్రియములే హేతువగును. 
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 77 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 UTPATTI PRAKARANA - 47  🌴

🌻 9.  THE CONCLUSION OF UTPATHTHI PRAKARANA - 8  🌻

🌷 The  seven  Jnana  states:   

Now  to  the  seven  Jnana Bhumikas.  Disputants  hold  to  infinite  divisions  of these  Jnana  states.  In  my  opinion  I  prefer  to  classify them  thus  under  a  septenary  head.  The  cognition of  the  real  nature  of  these  Jnana  states  is  AtmaJnana.  The  goal  of  all  these  is  the  imperishable Nirvana.  

The  seven  stages are  Subechcha,  (spiritual longing  after  the  bliss  given  out  in  the  Vedas), Vicharana  (enquiry  therein),  Tanumanasi,  (the melting  of  the  mind  in  enquiry),  Satvapatti,  (the passage  of  the  mind  in  Truth)  Asamsakti,  (being without  Sankalpa),  Padartha  Bhavana  (knowledge of  Truth),  and  Turya.  Persons  who  have  known these  states  will  never  welter  in  the  mind  of delusions.  

As  Moksha  arises  therefrom,  there  will be  an  end  of  all  pains.  Of  what  avail  to  us  is  the wretched  Moha?  That  desire  which  ever  arises  in one to enjoy directly the  Jnana-  essence through the path  of  indifference  to  objects  after  a  study  of Atma-Jnana  Sastras  and  association  with  the knowers  of  Brahman  is  Subechcha.  

The  second  or Vicharana  is  the  mastery  of  the  good  qualities  of the  wise  and  of  Atmic  contemplation  with  the  rise of  spiritual  desires  in  one.  When  after  these  two states  are  fully  developed  in  him,  he  abandons  the natural  desires  and  his  mind  is  concentred  on  one object  at  its  will,  then  it  (the  mind)  is  rendered  lean like  Tanu  (fine  thread)  and  the  third  stage  is reached.  All  desires  being  eliminated  from  the mind  through  the  above  three  processes,  Tatwa Jnana  is  developed  and  this  is  the  fourth  state  of Truth.  

Beyond  these  is  the  fifth  state  when  he disconnects  himself  from  all  Sankalpas  by  merging into  the  blissful  enjoyment  of  true  Jnana  without association  with  objects.  When  these  five  states  are fully  developed  in  an  individual,  he  is  drowned  in the  Elysian  bliss  of  Atma-Jnana  and  then  he  loses all  affinities  for  objects.  

After  the  ripening  of  these five  states  and  the  development  of  quiescence through  merging  into  one  s  own  Self  of  AtmaJnana,  all  perception  of  objects,  external  and internal,  is  lost  and  the  person,  if  at  all  he  has  any perception  of  objects,  has  it  only  through  sheer external  compulsion.  This  is  the  state  called Padartha-Bhavana.  

Then  the  Turya,  the  seventh state  is  reached,  when,  having  rendered  objective the  hitherto  latent  Atma-Jnana,  he  firmly  stays  in his  own  Self,  having  completely  divested  himself of  all  conceptions  of  heterogeneity  which  arise through  his  experiences  on  earth.  This  is  the spiritual  path  of  the  stainless  Jivanmuktas.  

Above this  Turya  state  of  Jivanmuktas,  is  the  Turyatita 51 state  of  Videha  Muktas.  This  state  is  one  that  can be  attained  only  by  those  Mahatmas  (great  souls) who  have  known  their  own  Self  through  AtmaJnana.   

Jivanmuktas,  who  have  reached  this  imperishable Turya  state,  will  never  be  affected  by  the  pairs. They  will  automatically  perform  karmas  at  the instance  of  their  disciples  or  others,  simply  to maintain  their  body;  and  like  a  person  in  brown study  or  just  awake  from  sleep,  they  will  not  be  the actors  of  their  present  karmas,  though  performing them  and  will  enjoy  Nirvanic  bliss.  These  Jnana Bhumikas  can  be  cognized  only  by  those  who  have fully  developed  Jnana.  

Continues.. 
🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 31 / YOGA VASISHTA - 31