శ్రీ యోగ వాసిష్ఠ సారము - 75 / YOGA-VASISHTA - 75

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 75  / YOGA-VASISHTA - 75 🌹 
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ

🌴2. స్థితి ప్రకరణము   🌴
🌻. శుక్రాచార్యుడు భృగు, యముల వృత్తాంతము - 2 🌻

ఓరామా! తండ్రి యగు భృగువు ఎదుట నున్న శుక్రచార్యులు, ఇట్లు చింతన జేయుచు, అనేక సంవత్సరములు గడిపెను. చాలాకాలము తరువాత, శుక్రాచార్యుని శరీరము భూమి పై పడెను. వాని చంచల మానసము, అనేక విచిత్ర దశ లందు పరిభ్రమించుచుండెను. వివిధ ఊర్ధ్యలోకములు సంచరించి, అతని మానసము తుదుకు , సమంగా నదీ తీరమున విశ్రాంతి నొందెను. అచట అతని దేహము, వన భూము లందు, శీతల వాయువులచే కప్ప బడుచు, వర్షధారలచే తడుప బడుచుండెను. 

భృగు మహర్షి యొక్క ఆ పుణ్యాశ్రమము, రాగ, ద్వేషరహితమై యుండుట చేతను, అతని తప: ప్రభాము వలనను, శుక్రుని యాదేహము, మృగములచేగాని, పక్షులచే గాని భక్షింపబడక యుండెను. తన కల్పిత శరీరమును, యమ నియమాదులచే శోషింప జేయుచు శుక్రాచార్యుని మనంబు నదీతటమున తపంచొపర్చుచుండెను. శుష్కింపబడిన అతని పూర్వ దేహము, పాషాణ శిలలపై చిరకాలము పొర్లు చుండెను. 

తదుపరి వేయి దేవ సంవత్సరములు గడిచిన అనంతరము, మహాత్ముడగు నాభృగువు నిర్వికల్ప సమాధి నుండి లేచెను. అపుడు వినమ్రుడైన తన కుమారుని మృత దేహమును గాంచెను. అతని శరీరము పక్షులకు, కప్పలకు నిలయమాయెను. నేత్రములలో క్రిమి కీటకములు, ఎముకలలో పట్టు పురుగులు విస్తరించియుండెను. 

అట్లు మృత శరీరము వలె శిధిలమైన తన కుమారుని శరీరము గాంచిన భృగువు, లేచి నిలబడి, తన పుత్రుడు మృతి చెందినాడని సందేహించెను. తన కుమారుని అవస్త గాంచిన భృగువు శీఘ్రముగ యముని యెడ. క్రోధముతో యముని శపించుటకు ఉధ్యుక్తుడాయెను. అంతట యముడు భౌతిక శరీరముతో భృగుని చెంతకు ఏతెంచెను. అతని శరీరము ప్రకాశవంతమై శోభిల్లెను. 

అతడు శాంత పూర్వకముగా భృగిని చెంతకు ఏతెంచి ఇట్లుపల్కెను. ఓ మునీంద్రా తమరు మహత్తరమగు తపమొనర్చిన బ్రాహ్మణుడవు. మేము నియతి పాలించు భోక్తలము ఇయ్యది స్వభావ సిద్ధియగు నియతి పాలించు మేము భోక్తలము, ఇయ్యది స్వభావ సిద్ధియగు నియతి యగునే గాని ఇచ్చాద్వేషాది నిమిత్తములచే, ప్రేరితులమై ఒనర్చు క్రియకాదు.

ఓ మునీంద్రా! ఈ పరమాత్మ స్వరూపమగు సాకార, నిరాకార జగంబు నాకు భోజ్య పదార్ధముగ గల్పింపబడింది. మాయా కళంక రహితమగు దృష్టి యందు కర్తయును లేక భోక్తయును లేదు. ఆ దోషము నశింపని వానికే కర్తలును, భోక్తలునుకలరు. వృక్షము అందలి పుష్పములెట్లు నశించుచుండునో, అట్లే లోకము నందలి ప్రాణి కోట్లన్నియు, యుత్పత్తి వినాశముల నొందుచున్నవి. జీవుల కర్మయె స్వయముగ తన వైచిత్య్రము ననుసరించి కార్యమొనర్చు చుండెను.

 ఓమునీంద్రా? ఈ మనస్సే, మిధ్యాభ్రమ యందు దగుల్కొని, భ్రాంతిచే కర్తృత్వ అకర్తృత్వమయమగు, యనర్ధ కల్పన గావించుచున్నది. కావున వ్యాకుల చిత్తముతో, అపరాధము లేకయు మమ్ము కోపించకుము. విషయమును సత్య దృష్టితో అవలోకింపుము. 

వ్యవహారచతురులు, నియతి ననుసరించి, కర్తవ్యమును తప్పక యొనర్తురు. తమరు, అజ్ఞుల వలె, అధైర్యముతో, ఇట్లేల మోహితులగు చున్నారు. నన్నేల వ్యర్ధముగ శపింప దలచినారు. సమస్త ప్రాణుల దేహములు స్ధూల షూక్ష్మ శరీరములతో, ద్వివిధముగ నున్నది. స్ధూల దేహము జడమె. స్వల్పకాలముననే నశించు స్వభావము కలది. మనస్సు మోక్షపర్యంతము నశింపకుండును. 

మనస్సు ఈశరీరమును, తన ఇచ్చి వచ్చినట్లు ప్రవర్తింప జేయుచున్నది. చిత్తమే పురుషుడు. చిత్త కృతమగు కార్యమే కర్మ. అసద్వస్తు, సంకల్పము, అది బంధింపబడుచున్నది. నిస్సంకల్పమైన మనస్సు, ముక్తిని పొందుచున్నది. మనస్సే ఒక శరరీము నుండి మరొక శరీరమును పొందుచున్నది. మనస్సుకు అనుకూలముగ బుధ్ది యుదయించుచున్నది. అహంకారమును పొందుచున్నది. ఈ మనస్సు సత్యవస్తువు సాక్షాత్కారముచే, అసత్యమగు దేహ భావమును త్యజించి, పరమ శాంతిని పొందును. 

ఓ ఋషిపుంగవా! నీవుసమాధి యందున్నపుడు నీ పుత్రుని స్వ మనోరధ మార్గమున, స్ధూల శరీరమును వదలి, స్వర్గమున కరుదెంచి. అచట అప్సరసతో నందనోధ్యానము లందు విహరించి, పుణ్యము క్షయించి, తిరిగి యప్సరసతో, శుక్రాచార్యులు భూమిపై అనేక జన్మలెత్తి, వాసనా వశమున పరిభ్రమించియుండెను. అతడు వింధ్యాశల, కైకట దేశములందు కిరాతుడుగను, త్రిగత్త దేశమందు గర్దభమై, జన్మించెను. 

ఇంకను మృగముగను, సర్పముగను, కుక్కుటముగను జన్మించెను. తదుపరి విద్యాధరపురంబున ఉత్తమ విద్యాధరుడై, సౌందర్యవంతుడై, మన్మధునివలె, స్త్రీలకు ప్రియతముడై ఆ విద్యాధరపురములో, ఒక కల్పముగడచెను. కల్పాంత మందు ప్రళయాగ్ని యందు, భస్త్మ్రీభూతుడయ్యెను. అట్టితరి ఇపుడు కృతయుగమున బ్రాహ్మణ రూపము ధరించి, భూమిపై జనించెను. 

నీ తనయుడు బుద్ధిమంతులలో, నుత్తముడై, వేదముల నధ్యయనము చేయుచూ బ్రాహ్మణ పుత్రుడై జన్మించి, వాసుదేవుడను నామంబున ప్రసిద్ధికెక్కెను. తదుపరి కల్ప పర్యంతము విద్యాధరుడై యిపుడు సమంగా నదీ తీరమున తపంబొనర్చుచున్నాడు. జఠాధారియై రుద్రాక్షమాల ధరించి, సర్వేంద్రియ భ్రమ జయించి,స్ధిరముగనున్న వాడై తపమొనర్చు చుండ, యెనిమిది వందల సంవత్సరములు గడచెను.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 75 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 UTPATTI PRAKARANA - 45  🌴

🌻 9.  THE CONCLUSION OF UTPATHTHI PRAKARANA - 6  🌻

Oh Rama,  as  it  is  a  rule  that  all  persons  who  perform Raja  Suya  Yajna  have  to  undergo  dire  sufferings for  a  period  of  twelve  years,  Lavana  had  to  suffer from  his  merited  suffering  after  the  completion  of his  mental  Yajna.  So  it  was  that  Indra  sent  a messenger  of  his  to  afflict  the  King  with  pains.  This celestial  messenger  assumed  the  guise  of  a  Siddha, meted  out  rare  pains  to  the  King  and  departed back to his realm.  

🌻. Jnana  and  Ajnana:  
Well,  Oh  Ramachandra,  there  are two  states,  Jnana  and  Ajnana.  Each  of  them  is septenary  in  its  nature.  

They  are  mutually interdependent.  Infinite  are  the  sub-divisions  of paths,  which  overlap  one  another  in  the septenary (50)  divisions  of  both  these  states.  The Jnana  path  which  enables  one  to  cognize perceptively  the  one  Reality  is  Moksha,  whereas the  other,  which  makes  men  detract  from  the  one Reality  and  identify  „I  „with  their  bodies,  etc.,  is bondage.   

 Note  50 :  This corroborates the  Theosophical doctrine  of  the  septenary  division.  

The  following  are  the  leading  characteristics  that differentiate  a  person  who  has  cognized  the  one Reality  from  another  who  has  not.  Those  are immovably  fixed  in  the  Jnana  Reality,  the  eternal Absolute  Sat,  who  have  conquered  all  passions, anger  and  delusions,  but  in  the  case  of  those  who are  not  truly  illuminated,  they  will  be  but  the slaves  of  their  passions,  etc.  The  intelligence  of  one who  dotes  on  the  body  and  its  organs,  leads  him away  from  the  one  Reality.  The  mindwhich  makes one  swerve  from  the  path  of  Atmic  Reality,  is  itself Moha  or  delusion.  

There  is  really  no  other  than this,  which  deserves  the  name  of  Moha,  in  all  the three  periods.  (The  one)  Reality  can  be  defined  to be  that  Jnana  which  exists  without  Sankalpa,  in  a state  intermediate  between  the  conception  of  an object  and  that  of  another.  This  Jnana  is  devoid  of fancies  and  fluctuation  and  of  the  Vritti-Jnana  of (Swapna)  the  dreaming  state  or  the  Ajnana  of (Sushupti)  the  dreamless  sleeping  state.  

That  non- fluctuating  certainty  of  mind,  wherein  it  is  of  the nature  of  bliss  and  when  all  the  conceptions  of  the identification  of  „I  „with  the  body,  as  well  as  all differences  between  Jivatman  and  Paramatman (the two self's) are annihilated, is the true nature of Atma Jnana.

Continues.. 
🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 31 / YOGA VASISHTA - 31