శ్రీ యోగ వాసిష్ఠ సారము - 83 / YOGA-VASISHTA - 83

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 83 / YOGA-VASISHTA - 83 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ

🌴 2. స్థితి ప్రకరణము 🌴
🌻. చిత్త జయము - 2 🌻

తృష్ణయను బాణములతో కూడిన యింద్రియములను శత్రువులను, జయించుట మిక్కిలి దుర్లభము. ఈ ఇంద్రియములు మొదట తన దేహమునే నాశనము చేయును. మాంసమును కోరు గ్రద్ధలు, దేహమను తన గూటిలో ప్రవేశించి, విజృంభించును. వివేకముతో వాటిని వశపర్చుకున్న, శాంతిని పొందును. వివేకముతో విషయములను శత్రువులను జయించిన, ఇంద్రియములను జయింపబడినపుడు, అజ్ఞానమను పిచాచములు విజృభించుచునే యుండును. ఈ మనస్సే జన్మ వృక్షములను ఛేదించునది. ఇదే సాధన చతుష్టయ సంపత్తి మొదలు, తత్వ సాక్షాత్కారము వరకు గల కర్మలను, చేయించుచుండును. 

అట్టి ఈ మనస్సును వివేకముతో, శుద్ధమొనర్చిన, మోక్షసిద్ధికి తోడ్పడును. ఉత్తమ వివేకము నాశ్రయించి, బుద్దిచే సత్యము నవలోకించి, యింద్రియములను శత్రువులను జయించి, సంసార సాగరమును దాటవేయుము. ఈ మిధ్యాభూతమగు దేహము నేనను మిధ్యాభావమును త్యజించి, సత్యమైన ఆత్మతత్వమును ఆశ్రయించి, అమనస్సుడవై, భోజనాది వ్యాపారముల నొనర్చిన, నీవు బంధము లందు దగుల్కొనక ముక్తుడవగుదువు. 

🌻. రామ, వ్యాళకట న్యాయము భీమభాస దృడ స్థితి 🌻

పాతాళ దేశంబున శంబరుడను దైత్యరాజు నివసించుచుండెను. తన మధుర గానముచే, అప్సరసల వంటి స్త్రీలను, తన అధీనమొనర్చువాడై, విససించిన కమలములు గల వాని క్రీడా గృహము కాముకులకు, భయంకరముగనుండెను. అతని అంత:పుర స్త్రీలు తమ లావణ్యముచే సువర్ణ శోభను, ప్రపంచ మందలి సౌందర్య మంతను జయించిన వాని గృహంగణ మనేక, పుష్ప సమూహములచే పరిపూర్ణమై యుండెను. అర్ధరాత్రి యందును వాని ఆకాశము నూర్ల కొలది చంద్రులచే కూడి యుండును. 

మాయా నిర్మతమగు, ఐరావత, గజేంద్రులచే నాతడింద్రుని గజమును బారద్రోలు చుండెను. అతడు సమస్త సంపదలచే, సుభోదితుడును, సర్వ ఐశ్వర్యయుక్తుడును అయి, అతని కఠిన శాసనము అందరిచే స్ధాపింపబడు చుండెను. అతడు దీర్ఘ భుజములు కల్గి, దేవతల వినాశన మొనర్చువాడును, భయంకరాకృతి గల వాడును అగు, అతని వద్ద దేవతలను సంహరించునట్టి గొప్ప సేన గలదు. 

అతడు దేశాంతర మేగి నపుడు, దేవతలు అతని సైన్యమును దునుమాడు చుండగా, శంబరుడు తన సైన్యరక్షణకు ముండి, క్రోధ, ద్రుమాదులను సేనాపతులను నియమించెను. ఐనను దేవతలు విజృంభించుచుండిరి. అపుడు శంబరుడు, దేవతలను నాశన మొనర్ప సమకట్టిగా, దేవతలు భీతిల్లి, స్వర్గము నుండి పాలిపోయిరి. అది మొదలుగా శంబరుడు స్వర్గమును దోచుకొని, దానిని తగుల బెట్టి, స్వస్తానమునకు వెళ్ళెను. 

దేవతలు కృద్ధులై, శంబర సేనాపతులను నాశన మొనర్చెను. అపుడు శంబరుడు, దేవతల కొరకు వెతకగా, వారు స్వర్గమును వదలి వెళ్ళిరి. శంబరుడు మరల; దాముడు, వ్యాలుడు; కటుడు అను ముగ్గురు బలిశాలురగు భయంకర అసురులను సృజించెను. వారు మువ్వురు తన సైన్యమునకు, నాయకత్వము వహించి, యుద్ధమునకు సిద్ధమైరి. అపుడు దేవతలు, వివిధ ప్రదేశముల నుండి, శంబర సైన్యముతో యుద్ధము సల్ప బయలుదేరిరి. 

సురాసుర సంగ్రామము భయంకరముగ సాగుచుండెను. ప్రవహించుచున్న రక్తధారలతో నిండిన యుద్ధ భూమి, ఉభయసైన్యములతో నిండియుండి, భయంకర శబ్ధములతో గజ సమూహముల గర్జనలతో, సమర నాదములతోను, పరస్పర ప్రహారములచే, శస్త్రాదుల వలన నుత్పన్నమైన, ధూళిచే, ఆకసము నిండియుండెను. వాయువేగము గల్గిన బాణములచే, దేవదానవుల ముఖకమలములు త్రెంపబడుచుండెను. 

వజ్ర ప్రహారములచే నిరంతరము మహాయోధులగు, యసురు లనేకులు, మృతి నొందుచుండగా, శుక్రాచార్యులు సంజీవిని విద్యచే మరల జీవితులగు చుండిరి. ఒక చోట జయజయ ద్వానములు, మరొక చోట, వృక్షాగ్ర భాగమున, శవములు వ్రేలాడు చుండెను. ఇట్లా యుద్ధము మిగుల భయంకరముగ నుండెను. సింహ నాద మొనర్చుచు, దామ, వ్యాళ, కటులు, దేవతలను తరుమగా దేవతలు పరువెత్తి, కనుమరుగైరి. అంతట దామ, వ్యాళ, కటులు పాతాళముననున్న తమ ప్రభువగు శంబరుని వద్దకేగిరి. 
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 83 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 STHITHI-PRAKARANA - 3 🌴

🌻 THE STORY  OF SUKRA VENUS - 3 🌻

Let  me  turn  to  the  former  body  of  Sukra  which  was lying  entranced  by  the  side  of  his  father  and  from which  life  had  de  parted.  The  rays  of  the  sun  aided by  the  wind  had  reduced  it  to  a  mere  skeleton.  But it  remained  intact  on  earth  without  being  assailed and  destroyed  by  birds  or  beasts,  as  they  were instinctively  afraid  of  doing  away  with  it  through the  glory  of  Bhrigu  sitting  hard  by.  Having  passed many  divine  years  in  Nirvikalpa  Samadhi,  Bhrigu opened  his  eyes  only  to  find  the  shrivelled  carcase of  his  son  with  mere  bones  which  looked  the  very incarnation  of  poverty  and  misfortune.  

Then  this Muni  of  rare  Tapas  and  renunciation  became  quite disconsolate  in  mind  at  finding  sparrows  chirping in  the  nine  avenues  of  his  son  s  body  and  frogs squatting  and  playing  within  his  stomach.  Without trying  to  dive  into  the  cause  of  all  these occurrences,  he  concluded  that  his beloved  son was dead.  With  the  flaming  anger  of  Rudra  riding  on his  bull,  he  began  to  vent  his  whole  anger  against Yama  and  began  to  curse  him,  in  order  to  destroy him,  on  account  of  the  premature  death  of  his  son caused  by  the  latter.  At  which,  Yama  quailed  with fear  and  having  assumed  a  body  composed  of  the five  elements,  appeared  before  the  disconsolate Bhrigu  with  six  faces,  six  hands,  blade,  noose, pendants  and  the  diamond-  hiked  armour  of protection  and  surrounded  by his  enormous  hosts.   

Then  this  All-devourer,  in  order  to  explain  the  real situation  to  the  Muni,  softly  addressed  him  thus „We  who  are  only  administering  the  laws  of  Iswara will  not  but  extol  you  who  have  immeasurable  and noble  Tapas.  Therefore  it  is  not  meet  that  you should  spoil  your  all-full  Tapas  through  your  dire anger.  Even  the  fire  at  the  period  of  Pralaya,  will not  consume  me,  much  less  your  words.  Indeed many  are  the  Rudras  and  the  large  lotus-eyed Vishnus  that  fell  a  prey  to  me,  having  been enmeshed  in  the  snares  of  Samsara.  

There  is  none in  this  world  of  pains,  who  ever  vanquished  me. All  came  under  my  jaws.  It  is  the  unalterable  and eternal  decree  of  Parameswara  and  not  myself,  that I  should  be  the  cause  of  the  destruction  of  all created  lives.  This  law  ever  endures.  In  the immaculate  Jnana  introvision,  all  the  differences  of actor  and  enjoyer  are  lost,  but  in  the  Ajnana  vision of  people,  these  exist  in  concrete  shapes.  All creatures  arising  through  the  force  of  their  Karma are  born  through  Sankalpa  and  perish  at  the  end  of a  Kalpa.  

Then  at  the  time  of  Pralaya,  where  shall we  find  the  Jnana-  Vision  developed  through  a recitation  of  the  Vedas?  Where  will  all  your firmness  of  will  then  be?  Where  will  your  glory then  be?  Where  will  be  then  all  your  present despondency  which  trembles  like  a  person  full  of mental  darkness,  ignorant  of  the  path  laid  down  by the  Great?  Are  you  justified  in  cursing  me  through your  anger,  without  trying  to  understand  the present  situation  of  your  son  brought  on  by  his own  Sankalpa?  Attend  what  I  say.  It  is  the  mind alone  that  is  Atman  and  none  else.  

The  mind‟s  acts (and  not  the  bodily  acts)  are  alone  true  acts. Through  its  life  in  this  world,  it  is  called  Jiva.  It  is called  Buddhi,  through  its  certainty  of  knowledge. It  is  called  the  Ahankara  when  the  conceptions  of „I‟  and  „mine‟  assert  themselves  with  the  signs  of anger,  etc.  

Continues..
🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 31 / YOGA VASISHTA - 31