శ్రీ యోగ వాసిష్ఠ సారము - 76 / YOGA-VASISHTA - 76
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 76 / YOGA-VASISHTA - 76 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
🌴2. స్థితి ప్రకరణము 🌴
🌻. శుక్రాచార్యుడు భృగు, యముల వృత్తాంతము - 3 🌻
ఈ విషయమంతయు, భృగువు జ్ఞాననేత్రముచే చింతన జేసెను. తదుపరి విస్మయముతో, చిరునవ్వుతో, కాలునితోనిట్లనియె. భూత భవిష్యత్ వర్తమానములను, ప్రభువగు ఓమహాత్మా, మేము మాలిన్య చిత్తులము, అజ్ఞానులము. ఈ మనస్సు యొక్క వృత్తి రూపము, ఇంద్రజాలమువలె మాయా విమోహంబును కలుగ జేయుచున్నది. నా పుత్రుని మరణమును గాంచి భ్రాంతుడవైతిని. ప్రపంచస్ధితి గతుల నెఱిగిన వారమైనను హర్ష శోకములకు, వశీభూతుల మగుచున్నాము. హేయమగు నా భ్రమలు తొలగించుట ఉచితము. కేవలము నియమపాలకులైన మీ ఎడల నేను కృద్ధుడనైతిని, మీ దండనకు పాత్రుడను. ఈ లోకమున సమస్త ప్రాణులకు, మనస్సే అంతటను చరించుచు, ఈ జగత్తును యుత్పన్నము చేయుచున్నది.
అనగా కాలుడు తమ వచనము సత్యము. కుమ్మరివాడు, కుండలు చేయునట్లు, మనస్సే ఈ భౌతిక శరీరమునకు కారణము.
ఈ మనస్సు సంకల్పముద్వారా, సృష్టించుచు, మరల నద్దానిని, నిర్మూలించుచున్నది. స్ధూల, సూక్ష్మ శరీరములలో, సూక్ష్మ శరీరముతో కూడిన మనస్సే ప్రధానమైనది. అట్టి మనస్సును త్యాగం చేసిన; సనాతనము, శాంతమునగు బ్రహ్మమే మిగులును. జలమందు తరంగములవలె, బ్రహ్మమందు, బ్రహ్మమే వృద్ధి పొందుచున్నది మరియు ఆ బ్రహ్మమె, స్త్రీ, పురుష నపుంసక భావములు పొందుచున్నది. ఈ బ్రహ్మము నిశ్చయముగ పూర్ణమైనది. ఈ జగత్తంతయు కేవలము బ్రహ్మము మాత్రమే, యను భావమును కల్గి, ఆడంబర మంతయు త్యజించివేయుమని తెల్పెను. అనేక రూపములుగ నున్నను. ఏకముగను వున్న ఆత్మ సత్త సమస్త పదార్ధముల యొక్క, అధిష్టానమై వెలయుచున్నది. పట్టు పురుగు స్వీయబంధనము కొరకే తన కోశజాలమును, విస్తరించునట్లు, స్వీయ బంధము కొరకే, చిత్త శక్తిని విస్తరించుచున్నది. అట్లే ఈ ఆత్మ తన ఇచ్చ చేతనే, తన స్వరూప విస్తృతిని పొంది, పట్టుపురుగు వలె తన కొరకై, కఠిన బంధమును, నిర్మించుకొనుచున్నది.
అట్టి ఈ ఆత్మ తన ఇచ్చచేతనే, ఆత్మసాక్షాతారమొంది. గజ స్వీయబంధము నుండి విముక్తిపొందునట్లు, సంసార బంధము నుండి, తొలగి మోక్షమును పొందుచున్నది. ఈఆత్మ ఎటుల భావించునో, నిరంతరముగ అటులనే అగుచున్నది. యదార్ధముగ బంధ మోక్షములు లేవు; అట్టి వికారమున ఆత్మ భాసించుచున్నది. ఇదియె మాయ. పరస్పర మిళితములును, అత్యంత వికల్పయుక్తములగు కోట్ల కొలది మనశ్చక్తులీ, పరమాత్మ నుండి ఆవిర్భవించు చున్నవి. ఆత్మ యను ఈ మహాసముద్రమున, బ్రహ్మ విష్ణు రూపములగు కొన్ని తరంగములు కలవు. మరికొన్ని రుద్ర రూపమును పొందినవి. కొన్ని మనుజ రూపమును, మరికొన్ని దేవరూపమును పొందినవి. వానిలో బ్రహ్మాదులు, కొంత కాలము స్ధిరముగను, దేవ మనుష్యులు తరంగమువలె, అస్ధిరములై, వెంటనే నశించుచున్నవి. ఒకని జీవితము దీర్ఘముగను, మరియొకని జీవితము అల్పముగను; ఒకరు అందముగను, మరొకరు తుచ్చముగను వుందురు.
బ్రహ్మము సత్యము; నేను బ్రహ్మము కాదు అను నిశ్చయము గల జీవులు, అధోగతి పొందుచున్నారు.
దేహమందాత్మాభిమానము గల జీవులు, పుణ్యపాపములు పొందుచున్నారు. బ్రహ్మ విష్ణు రుద్రాదులు, జ్ఞానమున ఉన్నతులగుటచే స్వచ్చులుగను, నాగ దేవతాదులు, కేవలము జ్ఞానులే అగుటచే, అల్ప మోహమును పొందుదురు. కొందరు ఉత్తమ జన్మ నుండి నీచ జన్మకు మరికొందరు, ఇంకను ఉత్తమ జన్మలు పొందుటకు, వారి సంకల్ప భావనలె కారణము. అనేక జన్మలకు నిలయమగు, ఈ జీవత్వము తన ఆత్మ స్వరూపమును, మరచుటచే గల్గుచున్నది. ఆత్మ భోదచే, జీవత్వము నశించును. పాపము నశించుటచే యంత: కరణము శుద్ధమైనట్టి, సజ్జనుల నిర్మల బుద్దియె, శాస్త్ర విచారము సల్పుచున్నది. సూర్యభగవానుని సంచారము, చీకటిని పార ద్రోలినట్లు. సశ్చాత్ర విచారముచే, మనస్సునందలి మోహము నశించును. ఓ మునీంద్రా మనస్సును శరీరముచే నీ పుత్రుడేది మొనర్చునో, దానినే అతడు తీవ్రముగ పొందును. ఇందు మాఅపరాధ మేమియును లేదు. భగవంతుడు అగు కాలుడు ఇట్లు పలికి భృగు మనీంద్రుని కరమును తన కరముతో బట్టుకొనెను. అంతట వారిరువురు మంధర పర్వతము నుండి లేచి, మేఘ సహితమగు, ఆకసమున, విహరింప నుద్యుక్తులై, పిమ్మట భూమిపైకి దిగి వచ్చి, సమంగా నదీ తటమునకు చనిరి.
అచ్చట వారు దేవతలు లతలతో నిర్మితములగు ఊయల లందు క్రీడలు సల్పుట చూచిరి; సిద్ధులు, యేనుగుల గుంపులు చమర మృగములు, కిన్కెరలు, ఖర్జూర, వృక్షములు, గ్రామములు నగరములతో అలరారు చున్న పృధ్వీతలమున జేరిరి. తదుపరి పుష్పయుక్తమగు, సమంగా నదిని సమీపించిరి. అచట ఒకానొక వృక్షము క్రింద, భృగువు తన పుత్రుని గాంచెను. శరీరము మారుటచే వేరుగ నున్నట్లు తోచుచుండెను.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 YOGA-VASISHTA - 76 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj
🌴 UTPATTI PRAKARANA - 46 🌴
🌻 9. THE CONCLUSION OF UTPATHTHI PRAKARANA - 7 🌻
🌷 The seven Ajnana States:
Now listen to a detailed explanation of the 7 states of Ajnana, I gave out before. They are called Bindu-Jagrat, Jagrat, MahaJagrat, Jagrat-Swapna, Swapna, Swapna-Jagrat and Sushupti. These 7 different states do interpenetrate one another and receive different appellations.
As the one Jnana, which is nameless and stainless, is the substratum and the generating Bindu (or the seed) of all those which pass under the names and actions of Manas, Jiva and others evolving and flourishing, hence the first state is called BinduJagrat. This is the first or primary state. After the incipient manifestation of Jiva, the feeble conception of the differences of „I and He‟ and „Mine and Thine‟ which arise then, they not having existed in it before, is the second or upper Jagrat state. Then the third state is induced, when, after repeated births, the conceptions of the heterogeneity of man and the universe do concrete in the individual.
Jagrat-Swapna is that state in which the mind holds undisputed sovereignty over the things of the world in the Jagrat state through previous effects, and overpowered by such objects, whether seen or unseen before, revels in delight in them. This Swapna state is enjoyed in the Jagrat or waking state and is of various kinds, through the experience of various delusions, such as the misconceptions of water in a mirage, silver in mother-o -pearl, two moons and others.
Then in the fifth state of pure Swapna, a review is made of the innumerable events which one passes through in a moment as if in a dream or reverie, and the individual remembers them in his normal Jagrat state.
The sixth state is Swapna- Jagrat in which one in the waking state, in trying to recollect things long past has that Swapna consciousness, which makes the past things to be clearly in recollection now, not as in Swapna but as in the Jagrat state.
A Jiva after crossing these six states, reaches the Sushupti state in which its intelligence, finds all these Avasthas (states) to be but inert and beset with sore pains. All the worlds will seem to be (or are) generated out of and perish in the mist of Maya in these Avasthas or states. These 7 states of Ajnana have countless ramifications, each being divided a hundred-fold. Thus are the seven Ajnana-Bhumikas (or states).
Continues..
🌹 🌹 🌹 🌹 🌹
Comments
Post a Comment