శ్రీ యోగ వాసిష్ఠ సారము - 84 / YOGA-VASISHTA - 84
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 84 / YOGA-VASISHTA - 84 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
🌴 2. స్థితి ప్రకరణము 🌴
🌻. రామ, వ్యాళకట న్యాయము భీమభాస దృడ స్థితి - 2 🌻
అంతట దేవతలు మరల ధైర్యము తెచ్చుకొని, శంబరుని వధించు యుపాయము అడుగుటకు, బ్రహ్మ వద్ద కరిగిలి. వారు బ్రహ్మకు సురాసురుల యుద్ధమును వర్ణించి చెప్పెరి. అపుడు బ్రహ్మ యోజించి, నూరువేల సంవత్సరముల తరువాత,శంబరుడు; విష్ణు దేవునిచే హతుడగును. అంత వరకు మీరు, కపట యుద్ధ మొనర్చుచు తప్పుకొని పారిపోవుడు. అపుడు వారు అహంకార బద్ధులగుదురు. ఇపుడు వారు వాసనా రహితులగుటచే, వారిని జయించుట కష్టము. ఆశాపాశము లందు వాసనాబద్ధులు అయిన వారు యుద్ధమున తప్పక నశింతురు.
ఈ దేహేంద్రియములు నేను ఈ పుత్రధనాదులునావి, అను అహంభావులు, సమస్త ఆపదల పాలగుదురు. సర్వజ్ఞుడగు ఆత్మను, దేహాదులుగ భావించువాడు, జనన మరణ రూపమగు దీనత్వమును పొందును.
ఈ లోక మందు, ఆత్మ కంటె అన్యముగ మరొకటి లేదు. అను బుద్ధి కల్గి విశ్వసించుటయె, నిజమైన జీవితము. దామవ్యాళ కటాదులు, దేహ భావము పొందు నంతవరకు వేచియుండుడు. తృష్ణ వలన సమస్త విపత్తులు సంభవించును. ధీరుడైనను కులీనుడైనను, మహాత్ముడైనను తృష్ణచే బద్దుడగు చున్నాడు.
ఎపుడు శంబరునిచే సృష్టించబడిన దామాదులు అజ్ఞానులై, వాసనల నాశ్రయించుదురో, అపుడే వారు పరాజయ మొందుదురు అని బ్రహ్మ యింద్రునితతో చెప్పెను. అంతట దేవతలు కొంత కాలము మిన్న కుండి, తదుపరి యుద్ధ భేరీలు మ్రోగించిరి. అపుడు అంతరిక్షమున, పాతాళమున నున్న, దేవ దానవులకు మరల యుద్ధము మొదలయ్యెను. శక్తి, కుంత, బాణ, ఖడ్గ, చక్రములచే యుద్దభూమిని, దేవదానవులు, పరస్పరము చిన్నాభిన్న మొనర్చు చుండిరి. దేవతలు ఒకపుడు మాయా వివాదముతోను, మరొకప్పుడు, దానాధ్యుపాయములతోను, సంధి, విగ్రహము, పలాయనము, ధైర్యము చేతను యుద్ద ప్రక్రియలు కొనసాగించు చుండిరి. అంతట అహంకారము యొక్క, ధృఢాబ్యాసముచే, దామవ్యాళాదులు, అహంకార పూరితులైరి. వారికి ప్రాణభీతి ఏర్పడినది. దేహముభోగము, రోగము, మోహములు, ఆశాపాశములచే బంధింపబడి దీనత్వమును పొందిరి. ధైర్యము క్షీణించెను. బలము సన్నగిల్లెను. స్త్రీ, అన్నపానాది, విషయ భోగములందు, ప్రీతియుత్పన్న మైనది. వేయేల, దేవతలు విజృంభించగా, మరణభీతులగు దైత్యులు, యుద్ధ భూమి నుండి పరుగిడిరి. దానవులు భయవిహ్వలులైరి. దేవతలు సంతుష్టులైరి. పిమ్మట సైన్యము నశించగా, శంబాసురుడు ప్రళయాగ్ని వలె మండిపడుచు దామాది దానవుల కొరకు వెదకగా వారు పాతాళమున కరిగి నివసించసాగిరి. అచట దుష్ట వాసనలతో, కన్నియలతో గూడి, పదివేల సంవత్సరములు గడిపిరి. అంతట వారిని యమ ధర్మరాజు సమీపించి, వారిని రౌరనాది నరకము లందు పడద్రోయించిరి. పిదపదామాదులు, కిరాత జన్మమును పొందిరి. తదుపరి కాకములై జన్మించిరి. మరియు గృధ్వము. శునకత్వము, సూకరముగను, మేషముగను, కీటకములుగను, ఇవ్విధముగ, వివిధ విచిత్ర జన్మలు అనుభవించి, తదుపరి కాశ్మీరము నందలి ఒక జలాశయమున, మత్స్య రూపమున నున్నారు.
ఓరామా! ఇట్లు సంసార తరంగమున చిక్కుకొని, అనేక విచిత్ర జన్మ, పరంపరలు, మరల మరల పొందుచు, నశించుచుండిరి. నేటికిని వారట్లు శాంతిని పొందలేక యుండిరి. అందువలన ఓరామా! వీరి దృష్టాంతముచే, నీవు వాసనల యొక్కదారుణ యనర్ధమును గ్రహించుము.
అంతట శ్రీరాముడు, ఓగురుదేవా, అసద్రూపులగు దామాదులెట్లు, సత్తను పొందిరో తెలియజేయుమని అడిగెను.
అపుడు వసిష్టుడు ఓ రామా! దామాదులు, నీవు నేను కూడ మిధ్యా రూపములే అయివున్నాము. ఇవి ఇప్పుడు అనుభూతములె యైనను స్వప్నమందలి, మరణము వలె, అసద్ రూపములే అగును. జగత్తు సత్యమని తలచు, మాఢులకు, జగత్తు అసత్తని తెలియదు. తత్వ విచారము వలన, జగత్తు అసత్యమని, బోధపడును. జ్ఞాని జగత్తు అసత్యము, బ్రహ్మము సత్యమని పల్కిన, అజ్ఞాని దానిని పరిహసించును.
ఓరామా! ఈ జగత్తంతయు, శాంతమును, శూన్యత్వరహితమును, సద్వస్తు పూర్ణమైయున్నది. అట్టి చిదాకాశమునందే, అసత్యమగు, ఈ సృష్టి అంతయు భాసించు చున్నది.
ఈ చైతన్యము, దామాదుల రూపమును పొందిన అచట దామాదులే యుందురు. ఈదృశ్యమంతయు కేవలమును, మోక్ష రూపమును అగుచుండ, ఈ రెంటికి భేద మెట్లుండును. అంతట రాముడు, దామవ్యాళాదుల, దు:ఖ మెపుడు శమించునని ప్రశ్నింపగా, వసిష్టుడు, వారి చరిత్రను, వారు తెలుసుకున్నపుడు నిస్సందేహముగా వారు ముక్తులగుదురని తెల్పెను. అంతట వారి స్వప్న వృత్తాంతమును, వసిష్టుడిట్లు తెల్పుచున్పాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 YOGA-VASISHTA - 84 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj
🌴 STHITHI-PRAKARANA - 4 🌴
🌻 THE STORY OF SUKRA VENUS - 4 🌻
And it is this mind alone, that is the universe through the conception of excessive differentiations. Whilst you and your son were engaged in Nirvikalpa Samadhi, your son abandoned his fleshy tabernacle through excessive desires and mentally joined, in the Akasa, a Deva lady by the name of Viswaci.
Then he incarnated on earth in the country of Dasarna as the son of a Brahmin. He went the round of lives as a King in the country of Kosala, a hunter in an extensive forest, a swan on the banks of the Ganges, a great King in the Solar family ruling over Poundra country and the Guru of the Solar race in Salwa country.
For the long period of a Kalpa, he passed his life as the King of Vidyadharas; he was the intelligent son of a Muni of great Tapas; a chieftain in Souvira country with large tanks with fishes playing in them; the Guru of Saivites (followers of Siva) in another country; a bamboo cluster in another country, full of fragrance; a stag in a decayed forest; a fierce looking boa-constrictor in a spacious forest. Thus did he pass through various, wombs; going through births high or low, with a impure mind and under the influence of Vasanas and was at last born as the incomparable and true son of a Rishi on the banks of the Ganges.
In this birth, he got the mastery over his weak foes of the illusory organs and wearing matted locks, etc., and going by the name of Vasudeva, has been engaged in Tapas for the last eight hundred years. If you, through your love for your son, wish to behold the series of illusory births which flitted across your son s mind like a whirling dream, you can do so now through your divine vision.‟ So said Yama when the Muni of great culture observed in a moment, through his introvision, all the events of his son s lives reflected in the transparent mirror of the pure mind, which in its turn manifested itself out of the transcendent Jnana-light.
Then this Muni of non-desires returned from his trance (at the end of which he was) by the river Ganges, to his normal state by entering and animating his tenement of body lying in Mandaragiri.
Greatly astonished, he asked of him many pardons (for his conduct) and addressed him thus, „Oh omniscient Kala (time), you are the foremost dispenser of Law; you are the only one thoroughly acquainted with the three periods of time. Persons like myself are mere tyros in Brahma Jnana.‟
Then Yama took hold of Bhrigu s hand and led him out of the caves of Mandaragiri to where the divine river Ganges flowed. There the Rishi saw, with intense delight, his son who passed under the pseudonym of Vasudeva. So willed Yama. Again when Yama willed that Vasudeva should come back from his Samadhi state and see them, the latter accordingly did and seeing them before himself saluted them. Thereupon all the three noble souls seated themselves upon a stone with true love towards one another.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments
Post a Comment