శ్రీ యోగ వాసిష్ఠ సారము - 79 / YOGA-VASISHTA - 79

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 79 / YOGA-VASISHTA - 79 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ

🌴 2. స్థితి ప్రకరణము 🌴
🌻. శుక్రాచార్యుడు: భృగు, యముల వృత్తాంతము - 6 🌻

*ఒక్కొక్కసృష్టి యందు, విభిన్న రూపమున అనేక సృష్టులు గలవు. ఈ వివిధ సృష్టులందు బ్రహ్మత్వమున భేదము లేదు. బీజము, జలసంబంధముచే వృక్షమై మరల బీజముల నుత్పన్నము చేయునట్లు బ్రహ్మమున కామకర్మాదులను జలము యొక్క సంబంధము చేత, మనోరూపమొంది, జనన మరణాదుల కల్పన మొనర్చుచు, అధికారి దేహము లభింప, శ్రవణ, మననాదులచే, జ్ఞానప్రాప్తి నొంది, తద్వారా, పూర్వ శుద్ధమగు, తన బ్రహ్మస్వభావమును, మరల పొందును. అట్లు బ్రహ్మకారంబున, జీవుడే, జగద్రూపమున విజృంభించు చున్నారు. 

మూలమునకు కారణమేమన, నయ్యది చెప్ప శక్యము కాదు. ఏలన, మూలమునకు మూలమే లేనందున, ఆ భావన వర్జిత మైనది. నిర్వకారము, అద్వితీయము, అసంగమమగుటచే, యదార్ధముగ బ్రహ్మ మకారణమైనది. ప్రపంచ మంతము వ్యాపించుట చేత బ్రహ్మమునకు కారణము నిమిత్తాదులు సంభవింపనేరవు.

అందువలన సార భూతమగు బ్రహ్మమును గూర్చియె విచారింప దగియున్నది. బీజము ఆకారవంతము గాని, బ్రహ్మము ఆకార రహితము. అందువలన బ్రహ్మముతో పోల్చదగిన దేదియులేదు. దృశ్యమును గాంచు ద్రష్ట తన స్వరూపమును గాంచలేడు. అలానే ప్రాపంచిక విషయ వాంచలచే, ఆక్రమింప బడిన జ్ఞానము, స్వస్వరూపమైన బ్రహ్మము నెట్లు కనుగొనగలదు. భ్రమ రహితుడగు, ముక్త పురుషుడు దృశ్య రూపము వంటిదియె యగుచు, ఇతరుల పరమార్ధ స్వరూపమును గాంచుట లేదు.

ఓ రామా! దృశ్యము కన్పించుచున్నది; కాని ద్రష్ట కన్పించుట లేవు. కాని యదార్ధముగ ద్రష్టయె గలదు. దృశ్యము లేనే లేదు. ఏ జీవశక్తి ఎట్లు దృశ్య ప్రపంచమున కనిపించునో అట్లు తన యాత్మ చిద్రూప బ్రహ్మండమందున్న దున్నట్లనుభవించును. మరియు సమూనా కారములగు వాసనలు యుదయించుటచే, కొన్ని జగత్‌ మండలములు, పరస్పరము కలియుచుండును. చిత్త మందును, ఆకాశ మందును, శిలయందును, అగ్ని జ్వాలయందును, వాయువు నందును అరణ్యమందును, ప్రతి పరమాణువునందును, వేల కొలది, జగత్‌ స్వరూపములు గలవు. 

ఈ ప్రపంచము దీర్ఘ స్వప్నము వంటిది. కొందరు జీవులొక స్వప్నము నుండి, మరియొక స్వప్నమును పొందుచున్నారు. చైతన్యము, స్వప్నమున యనుభవించిన దంతయు, అక్కాలమున సత్యముగనే యుండును. బీజము నందు; పత్రలతాదుల వలె, వాసనా మయమగు చిదణువు నందు! సూక్ష్మ రూపములగు జగత్తులన్నియు గలవు. 

చిత్‌ పరమాణువు, జగత్‌ పరమాణువునందు; జగత్‌ పరమాణువు, చిత్‌ పరమాణువు నందు, ప్రవేశించుచున్నది. ఏలన చిదాకాశమే చిదాకాశమున లీనమగు చున్నది. బ్రహ్మది కీటక పర్యంతము, సర్వప్రాణుల యొక్క, జీవరూపముచే, వాని యంత: కరణ ఉపాధి వశమున ప్రళయ కాలమున లయమై, మరల సృష్టికాలమున, స్వప్నము వలె దేహ దృష్టిచే, ననుభవించ బడుచున్నది.

చైతన్య రూపమగు అణువు అంత: కరణ యుపాధిచే, స్వయముగ, విశాలమగు దేహ రూపమున స్ఫురించు చున్నది. స్వకీయ జ్ఞాన విస్తారమున, కొన్ని దేహములు, పరస్పరము కలియుచుండును. కొన్ని భ్రమ రహితములై, ఆత్మ యందు స్ధితి కల్గి యుండును. జీవ రూప ప్రతిభాస మందంతటను, మరల జీవ రూప ముదయించుచున్నది. ఆ జీవుని యందు మరల, ఇంకొక జీవరూప ముదయించు చున్నది.

బుద్ది దృశ్య పదార్ధముల నుండి తొలగి, ప్రత్యగాత్మాభిమానము కాగా బాహ్యభ్యంతర ప్రదేశమంతయు నశించును. నేనెవరను? ఈ ప్రపంచమేమి? యను విచార మెవరికి కల్గ లేదో వారికి ఈ దీర్ఘ కాల జీవ విభ్రవము తొలగదు. ఏ మనుజునకు భోగలాలస, దినదినము క్షీణించు చుండునో, అట్టి వానిచే చేయబడు విచారమే సఫలమగును.

ఔషదము సేవించుటచే, ఆరోగ్య మొనగూడునట్లు, ఇంద్రియ మభ్యసించుట చేతనే వివేకము ఫలవంత మగును. ఓరామా! చిత్రమందలి అగ్ని, అగ్నికానట్లు; స్త్రీ, స్త్రీ కానట్లు కేవలము వాచా వివేకమున్ను వివేకము కాదు.

ఓ రామా! మొదట వివేకముచే రాగము సన్నగిల్లును. తదుపరి వైరమును నశించును. జ్ఞాన ప్రాప్తిచే, ఇష్టాయిష్టములు నశించును. జీవునకు బీజభూతమగు బ్రహ్మము, ఆకాశము వలె సర్వ వ్యాపకమై యున్నది. కావున జీవుని యందే జగత్తు కలదో, అద్దాని యందు, అనేక జగత్తులు గలవు. భూమి యందు అనేక, కీటక సమూహములున్నట్లు, జీవుని యందు, అనేక జీవులండును. ఆత్మ సిద్ధికై వివిధ ఉపాసనా క్రమములచే, జీవులు చేయు ప్రయత్నము వలన, అలానే శీఘ్రముగ ఫలమును పొందుదురు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. Yoga Vasishta - యోగ వాసిష్ఠ సారము Channel 🌹, [28.06.20 20:37]
🌹 YOGA-VASISHTA - 79 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 UTPATTI PRAKARANA - 49  🌴

🌻 9.  THE CONCLUSION OF UTPATHTHI PRAKARANA - 10  🌻

At  this  juncture,  a  troop  of  old Neecha  dames  turned  upon  the  spot  with  their minds  full  of  racking  pains,  eyes  trickling  down tears,  and  bodies  emaciated  to  the  last  degree;  and one  of  the  group,  unable  to  overpower  her  grief, opened  her  mouth  wide  agape  and  gasping,  gave went  to  a  long  and  loud  wailing,  wherein  she  thus recounted  the  incidents  connected  with  her children  and  others  who  had  died  on  the  previous date  „oh  my  darlings,  who  have  forsaken  my  lap and  embrace  to  only  perish  in  some  foreign  land, whether  have  you  gone  through  your  bad  Karmas? 

How distressed  will  you  be  at  the  sight  of  strangers faces?  Oh  my  daughter,  my  daughter,  when  will you  too  return  to  alleviate  my  scorching-  fire  of grief  with  the  cool  embrace  of  your  arms  bedecked with  scarlet  garlands.  Oh  my  son-in-law  of  a  King, who  came  to  us  through  our  previous  Tapas,  like  a treasure  newly  discovered,  and  led  to  the hymeneal  altar  my  daughter  after  having  I abandoned  his  harem  containing  ladies  like  unto Lakshmi  herself,  have  you  forgotten  us?  

Will  you again  present  yourself  before  us  with  your  moonlike  face  in  this  very  spot?  Or  are  you  estranged from  us  through  any  paltry  venial  offences committed  by  my  daughter  like  Lakshmi?  Being caught  in  the  snare  of  Karmas  in  the  great  ocean  of dire  births,  you  abandoned  your  regality,  accepted my  daughter‟s  hand  and  degraded  yourself,  a  lord of  men,  into  the  most  degraded  condition  of  an outcaste  through  such  an  alliance.  Our  lives  of  rebirths  flash  like  lightning  and  are  as  impermanent. Dire  indeed  are  the  decrees  of  destiny.‟  So  saying, she  wailed  more  and  more.  

The  King,  having  heard  her  weep,  told  his handmaids  to  go  and  pacify  the  old  dame  and return  with  her,  The  old  lady  having  approached him,  he  accosted  her  thus  „Who  are  you?  who  is your  daughter?  And  who  are  your  children?  Relate to  me  all  without  omitting  any  incident.‟  At  which she  replied  „In  this  hamlet  of  Pariahs  lived  an outcaste  who  was  my  lord.  Through  him,  I  begat  a daughter.  She  lived  as  wife  with  a  king  who  came to  this  forest  like  another  Devendra.  

Through  her good  fate  from  a  long  time,  she  bore  three  children to  him  and  lived  happily;  to  make  amends  for  it, the  fates  become  perverse  and  my  children  were subjected  to  misfortunes  and  died.  After  my daughter  and  others  were  living  happily  for  a  long time,  the  clouds  became  relentless  and  shed  not  a drop  of  water;  there  was  a  drought  all  throughout the  land  and  the  outcastes  flew  in  all  directions  and lay  dead  in  piles  of  carcases  jet  black  as  Yama.  

We have  survived  all  these  shocks  only  to  be  alone, and  to  surfer  all  the  more.‟  Whereupon  the  king wearing  lance,  eyed  his  ministers  with  great marvel  and  ordered  them  to  furnish  the  Neecha ladies  with  all  necessary  things,  relieve  them  of their  pains  and  conduct  them  to  his  kingdom. Having  returned  to  his  city,  he  reflected  over  the situation  and  becoming  convinced  of the  seemingly real  nature  of  the  universe  created  by  the  potent power  of  Maya,  he  sought  initiation  into  the mysteries  of  Brahman  at  our  hands  and  attained quiescence  in  it.  Oh  Ramachandra  of  fate  bounty, this  great  Maya  generates  such  dire  -delusions  as are  indeed  uncrossable.  Through  the  power  of  this Maya,  Sat  will  appear  as  Asat  and  vice-versa.‟  

Continues... 
🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 31 / YOGA VASISHTA - 31