శ్రీ యోగ వాసిష్ఠ సారము - 78 / YOGA-VASISHTA - 78

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 78 / YOGA-VASISHTA - 78 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ

🌴 2. స్థితి ప్రకరణము  🌴
🌻. శుక్రాచార్యుడు: భృగు, యముల వృత్తాంతము - 5 🌻

అందువలన, బాహ్యలోకోచిత వ్యవహరములు నడుపుచూ, అంతరంగమున, వ్యవహార రహితుడై ఆత్మ యందు, ధృడభావము కల్గి వైషమ్యము లేక కోర్కెలన్నింటిని త్యజించి యుండును. శారీరక, మానసిక దు:ఖములు జనన, మరణ రూపమగు, సంసార మార్గమున, మమత్వమను భయంకర యంధకూపమున నీవు పడకుమా అని వసిష్టుడు శ్రీరామునకు తెల్పెను. మరియు సమస్త కోర్కెలు విడనాడి ఆత్మలచే, ఆత్మ యందు, స్ధితి కల్గి యుండి, కర్తవ్య మగు కర్మలు, ఫలాసక్తి లేకయె యొనర్చుము. ఏలయనగా కర్తవ్య కర్మలననురించుట నిశ్చయముగ దేహ స్వభావమై యున్నది.

ఓరామా, నీవు నిర్మలము శుద్దము, సర్వాత్మయు, సంకర్తయగు బ్రమ్మమే. అదే భావముతో నుండుము.

తదుపరి కాలుడు, శుక్రాచార్యుని తన తాప శరీరము త్యజించి, యాభృగూత్పన్న తనువు నందు ప్రవేశింపుమని కోరెను. అనంతరము, తపమొనర్చి, పిమ్మట దైత్యుల గురుత్వము, నీచె యొనర్పదగి యున్నది అని చెప్పెను. శుక్రాచార్యులు తన పూర్వశరీరమున ప్రవేశించగా, భృగువు అ శరీరముపై తన కమండలములోని నీటిని ప్రోక్షించెను. క్రమముగా ఆ శరీరము పూర్వ వికాసము పొందెను. శుక్రాచార్యుడు లేచి నిలబడి, తండ్రిని సమీపించి, అతనికి అభివాదము తెల్పెను. తన కుమారుని ఆలింగనము చేసుకొని, భృగువు దేహధర్మముచే, మమత్వమును పొందెను.

వారిరువురు, ఆనందముతో, పూర్వ వైభవము పొంది, మందర పర్వత ప్రాంతమున, తపంబొనర్చుట సాగించిరి. వారు ఆత్మ స్వరూపమున స్ధితిని పొందిరి. తదుపరి కాలాను గుణ్యముగ, శుక్రాచార్యులు, అసురుల గురుత్వము పొందెను.

అంత శ్రీరాముడు, శుక్రాచార్యుడు ఇతరుల వలె స్వర్గాది సుఖముల నేల పొందకుండిరి అని వసిష్టుని ప్రశ్నించెను. అందుకు వసిష్టుడు, శుక్రాచార్యుడు పూర్వ కల్ప మందు, దోష రహితుడై అంతిమ జన్మమున బ్రాహ్మణ వంశమున కళంకరహితుడై జన్మించుటచే, అతని చిత్తము నిర్మలమైయున్నదని, నిర్మల చిత్తముతో, మనస్సున ఏది కోరిన అది ఫలవంత మగునని పల్కెను.

ఈ దృశ్య ప్రపంచ మంతయు, ప్రతి జీవుని చిత్తమున, మిధ్యారూపమున ఉదయించుచు నశించుచుండును. ఒకని స్వప్న వ్యవహారములు, ఇంకొకని స్వప్న వ్యవహారములు, వేరుగా నుండును. శుక్రుని వలె సంకల్ప మాత్ర శరీరులుగను, మిధ్యను సత్యముగా తలంచు వారుగను, మన మందరము యుత్పన్నమైతిమి.

అనాదియగు అజ్ఞానమందు స్ధితి పొందియున్న చిత్తమే, సకల విధ కార్యయుక్తమగు, యీ జగత్తని యెరుగుటచే, చిత్తము తనంతట తాను నశించును. చిత్తమే జగత్తు; జగత్తే, చిత్తము. ఈ రెంటిలో ఒకటి నశించిన, రెండవది నశించును, మలినమగు, మణిని శుద్ధమొనర్చిన ప్రకాశవంతమగునట్లు, శుద్ధ చిత్తము నందు, సత్య స్వరూపమే కనిపించును. చిరకాలము ఏకాగ్రతను ధృడముగ నభ్యసించిన, చిత్తము శుద్ధమగును. వివిధ సంకల్పములచే కలుషిత మొనర్పకుండవలెను. జీవుడెట్టి వాసనలచే బద్దుడగునో, అట్టి వాసనాను సారము, 

తన యందుసర్వమును గాంచును. స్వప్నమందలి, స్వకల్పిత శరీరమే, యిందుకు దృష్టాంతము. ఇక ఈ జగత్తు దీర్ఘ స్వప్నమేయగును. మలిన మనస్సు శుద్ధమనస్సుతో కలియనేరదు. శుద్ధచిత్త తత్వములు పరస్పరము కలియును. సంపూర్ణ వాసనాక్షయము, భూత ప్రపంచ వర్జితము వలన, శుద్ధి లభించుటతో, చిత్తము శుద్ధి నొంది, పరము కైవల్య పదమగు మోక్షమును పొందును.

ఓ రామా! జీవులందరును, తమ తమ కల్పిత ప్రపంచము లందు, స్ధూల, సూక్ష్మ, కారణ శరీరముల సంబంధము కల్గి వానితో తాదాప్యము పొందుచు జగత్తును భిన్నముగా గాంచుచున్నారు. అందుకుఏకరసమగు, చైతన్యముల యొక్క సర్వవ్యాప్తి చేతనే సిద్ధించుచున్నది. ఒకని చిత్తము, మరొక చిత్తమందలి, మనోరాజ్యమును, దర్శింపజాల కుండుటయు, భోగానుభవము నొందజాలకుండుటయు, మనోజీవ భేదములకు కారణమైయున్నది. 

ఇట్లు భిన్న మనో రాజ్యములగు సృష్టులను గూర్చిన, కర్మవాసనాదులు సమమగుటచే నేకా కారమున, ఫలోన్ముఖమై మేళనము చెంద, వ్యష్టి, సమిష్టి స్ధూల దేహసత్తము, అపుడెరుంగ బడుచున్నది. హఠ యోగాభ్యాసముచే శుద్ధ ప్రాణవాయువు, మరొకని శరీర మందు ప్రవేశించి, వాని దేహప్రాణములు, తన వశము జేసుకొని శబ్దాది పదార్ధముల నెరుంగునట్లు, శుద్ధమనంబు, మరొక శృష్టి కాశ్రయ భూతమగు, మనోరాజ్యము నెఱుంగును.

జీవులందరి యొక్క జాగ్రత్‌, స్వప్న, సుషిస్త్యవస్ధలకును ఆశ్రయము ఆత్మయే కాని దేహము కాదు. ఇట్లు, జీవాత్యయె, అవస్దాత్రయమగుటచే, తరంగము జలము కంటే వేరుకానట్లు దేహమును, ఆత్మకు భిన్నము కాదు. తత్వజ్ఞాని, సుషుప్త్యాంతము నందు, తురీయముతో ఐక్యమొంది, ఆత్మభావమును పొంది, జీవభావము నుండి నివృత్తి పొందును. అజ్ఞాని స్వకల్పనచే, దేహాకారమయమగు, కల్పనా రూప ప్రపంచము నందు ప్రవృత్తుడగును. చిద్వస్తువు సర్వ వ్యాపియగుటచే, యొకానొక జీవుడు, మరియొకని సృష్టి యందును, ప్రవేశింప గల్గుచున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. Yoga Vasishta - యోగ వాసిష్ఠ సారము Channel 🌹, [28.06.20 20:37]
🌹 YOGA-VASISHTA - 78 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 UTPATTI PRAKARANA - 48  🌴

🌻 9.  THE CONCLUSION OF UTPATHTHI PRAKARANA - 9  🌻

There  is  no  doubt  that  if  a person  masters  these  seven  states,  he  becomes  an emancipated  person  whether  he  animates  beasts full  of  Ajnana,  whether  he  conforms  to  the  worldly observances  or  not,  or  whether  he  is  associated with  body or  dies.   

Tatwa-Jnana  is  the  release  from  the  trammels  of one  s  own  mind.  Such  a  release  alone  leads  to  the attainment  of  Moksha.  If  the  illusions  of  the  world are  considered  as  unreal  as  a  mirage  in  a  desert, then  the  Ajnana  in  the  man will  bid  adieu  to  him.  If this  Avidya  or  ignorance  be  considered  unreal, then  it  will  be  annihilated.  

Those  transcendentally holy  personages,  who  have  cognized  all  the  true Jnana  states  through  Samadhi  which  leads  to  the realisation  of  their  own  Atman,  do  truly  deserve the  worship  and  meditation  of  all.  Those  who  have subjugated  their  long  standing  foes  of  the  sensual organs  and  have  reached  thereby  the  supreme  state in  which  they  are  reverenced  by  all  and  do  regard, as  insignificant,  the  position  of  even  Devendra  and emperors are  the  knowers  of  these  seven  states.  But those  who  have  not  so  attained  these  septenary states  are  simply  drowned  in  the  ocean  of  births. 

The  proper  means  to  subjugate  the  mind  is  Jnana or  the  development  of  spiritual  wisdom.  And  it  is done  only  through  the  path  of  (the  realisation  of) these  Jnana  Bhumikas.  Without  the  aid  of  these transcendent  Jnana  Bhumikas,  the  noble  Brahmic State  can  never  be  attained.  That  Self-shining principle  is  non-dual  which  has  not  the heterogeneity  of  conceptions  such  as  you,  I,  or  one self  or  another,  etc.,  which  is  difference-less, stainless  or  causeless;  which  is  the  surprise-less bliss,  the  quiescent  Jnana  and  the  one,  without destruction,  name,  highness  or  lowness,  being,  or non-being,  beginning  or  end,  affinities,  positive  or negative  (attributes),  and  diversity;  it  is  above  the reach  of  Manas  and  speech,  the  bliss  of  bliss  and the  Plenum  of  all  bereft  of  all  desires.  This  is  that Brahman  to  which  you  can  reach,  through  the septenary Bhumikas.   

Now  listen,  oh  Rama,  to  the  marvellous  effects  of Maya.  After  the  great  King  Lavana  had  recovered from  his  trance,  he  saw,  through  his  mirror  of mind,  the  forests  on  the  slopes  of  the  Vindhya Mountains,  and  consulted  with  his  courtiers  as  to whether  it  was  possible  for  him  to  go  and  see thosesit.es  through  his  physical  vision  and  witness (if  true)  the  events  enacted  therein;  and  being resolved  upon  trying  the  experiment,  he  started with  all  his  suite  towards  the  south  and  came  in sight  of  the  Vindhya  hills,  like  a  King  bent  upon extending  his  conquests  in  all  directions.  He  roved about  in  all  quarters  except  the  north  but  all  in vain.  But  all  at  once  (in  the  northern  direction),  he saw  the  forest  he  had  lived  in  formerly,  as  if  his thoughts  had  taken  a tangible  form.   

Scrutinizing  the  scene,  he  observed  the  several places  and  towns  in  the  forest  he  had  passed  in  as Neecha  (outcaste)  which  were  like  unto  the  city  of Yama.  To  his  great  surprise,  the  King  of  Kings observed,  without  fail,  all  the  huts  of  Neechas  of both  sexes  who  were  tenanting  them  then;  and  his heart  began  to  give  way  under  the  grief  caused  by his  old  associations.  

Continues.. 
🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 31 / YOGA VASISHTA - 31