శ్రీ యోగ వాసిష్ఠ సారము - 82 / YOGA-VASISHTA - 82

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 82 / YOGA-VASISHTA - 82 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ

🌴 2. స్థితి ప్రకరణము 🌴
🌻. చిత్త జయము  🌻
 
ఓ రామా! సమాధి నభ్యసించుటచే బాహ్యభ్యంతర జగత్తుల గూర్చిన మననము మిధ్యయనియెఱుంగుము. కేవలమునే గాంచుటచే, స్వభావము నిర్మలమగును. కేవలము సాక్షిభూతుడుగ నుండుట చేతనే జీవుని ఆత్మ నిర్మలమగును. భోగములందు రమణీయముగ దోచుచు, రసహీనమగు భోగములందును, యిచ్చ లేకుండ వాని ఆత్మ నిర్మలమగును. చిల్లగింజచే జలము, నిర్మలమగునట్లు జ్ఞానము చేత మనస్సు నిర్మలమగును. ప్రాత:కాలమున సూర్యోదయముచే, ఆకాశము ప్రకాశించునట్లు; గురుసేవ, శ్రవణ, వానన, నిధి, ధ్యాసలచే, సమాధులచే, హృదయ సరోవరము వికసించును. 

ఆత్మ సాక్షాత్కారము పొందిన వాని ద్రృష్టిలో, బ్రహ్మ విష్ణు హరాదులు, అధికారాదులందు క్షేశమును పొందగలరు. జనన మరణములు, అజ్ఞానినే వశపర్చుకొనునుగాని, జ్ఞానిని కాదు. పరమాత్మ సర్వవ్యాపకుడైనను తాను, రోమము యొక్క అగ్రభాగమందలి, కోటి భాగము యొక్క లక్షవభాగము కంటె, ఇంకను సూక్షమైనవాడని తెలిసిన వాడే సత్యమును జూచినవాడగును. జీవాత్మ, తద్భిన్నమగు, ఈ జగత్తంతయు చైతన్య జ్యొతి మాత్రమేనని యెఱింగి, పరమాత్మకు అభిన్నముగ గాంచువాడే ఆత్మజ్ఞుడగును. వ్యాధి భయాదులచే నుద్విగ్నమును, జనన మరణ యుక్తమగు యీదేహము నేను గాదు. అని ఎఱిగిన వాడే యదార్ధజ్ఞాని. 

అహంకారము గాని, యీ దృశ్యముగాని, యొకింతయులేక, అంతయు నిరామయమగు, బ్రహ్మము మాత్రమేనని; భూత, భవిష్యత్‌ వర్తమానము లందును, సమత్వస్ధితిని కల్గిన, మధ్యమ స్ధితి కల్గియున్న తన రూపము నెవడు గాంచునో, అతడే సమ్యక్‌దర్శి. విషయ చింత రహితము, సుఖదు:ఖములు, శాస్త్రము, గురువు, దేవతాదు లందు శ్రద్ధ, నిత్యానిత్య వివేకము. ''ఇవన్నియునేనే'' యని, అనుభవము గలవాడే యదార్ధతత్వదర్శి. తర్కముచే, నగమ్యమును, సమ్మక్‌ జ్ఞానము కల్గి యుండుటచే యొవనికి త్యాజ్య, గ్రాహ్యముల కల్పన నశించునో, యాతడే పురుషుడు. బ్రహ్మండము లందంతటను యొకే బ్రహ్మము వ్యాప్తమై యున్నదని నిశ్చయముగలవాడు, ఈ జగత్తు యొక్క సృష్టి స్ధితి, లయము, కల్పన యందెవనికి, అపరిచ్చిన్నమగు బ్రహ్మము గలదో, అట్టి సాక్షాత్‌ శివస్వరూపుడైన, జ్ఞాన యుక్తుడైన, జీవన్ముక్తునకు నేను నమస్కరించుచున్నాను. 
ఈ శరీరమునకు, నగరమను పేరు కల్గుటకు కారణము సమస్త గుణములచే నలరారుచు; జ్ఞానికి, అనంత విలాస పూర్ణమును ఆత్మ దర్శనముచే ప్రకాశితమగు చున్నది. ఈ దేహము జంఘ ద్వయము, యుపస్తేంద్రియము, కేశసంపదచే, ఆవరింపబడియున్నది. రెండు కనుబొమలు, లలాటము, పెదవులు, లావణ్యమైన ముఖముతో ఈ శరీరము, అతిఆరమణీయముగ నున్నది.

వక్షస్ధలమను తటాకము నందు కుచములు, భుజములు, ఉదరము, జిహ్వాది యుత్తము ద్వారముల ద్వారా, విషయములను నగర వాసులీ, దేహనగరమున ప్రవేశించుచున్నారు. కంఠము ద్వారా శబ్ధము, ముఖద్వారమున, దంతముల చేతను, జిహ్వచే భోజనము లారగించుచున్నది. రోమములను దీర్ఘతృణములు, పృష్ట పర్యంతము వ్యాపించిన, అరణ్యముచే మనోహరముగా నున్నది. అధోమార్గము ద్వారా, మలమూత్రములు, చిత్తమను వన వాటిక యందు, ఆత్మ చింతన అను అంగన, బుద్ధి యింద్రియములు. ఇవన్నియు తత్వ జ్ఞానమునకు, ఉత్తమ సుఖమైన మోక్షము కొరకే గాని, దు:ఖము, కొరకు గాదు. 

ఓ రామా! ఈ శరీర నగరము అజ్ఞానికి; దు:ఖము, జ్ఞానికి సుఖములను కలుగజేయుచున్నది. ఈ శరీరము నశించిన, జ్ఞానికి తుచ్చ వస్తువు నశించిన దగును. శరీరము నిలచి వున్న, భోగ మోక్షములకు హేతవగును. జ్ఞానికి ఈ శరీరము ఒక రధము వంటిది. శబ్ధ, స్వర్శ, రూప, రస, గంధములు, బంధువుల భోగ మోక్షములు దీని వలన లభించునుగాన, జ్ఞానికి లాభదాయకే అగును. దు:ఖ రహితుడు, స్వస్త చిత్తుడుఅయిన జ్ఞాని, ఈ శరీర నగరమున, అధీనము గలవాడై సుఖముగ నుండును. జ్ఞాని, లోభ, మొహ, అధర్మముల దరి జేరక యుండును. బాహ్యభ్యంతరము లందు, పరమాత్మను దర్శించుచు, ఆధ్యాత్మిక, ఆది భౌతిక స్ధితులలో మునిగియుండును. 

ఆత్మతత్వ మెరిగినవానికి, ఈ శరీర నగరము, నిత్యము, సుఖమునే కలుగజేయును. ఘటము నశించినను, ఘటాకాశము, మహకాశమున నశించనట్లు, దేహ నగరము నశించినను, జ్ఞానికేమియు నాశనము లేదు. జ్ఞాని ఆత్మ ఈ శరీరమున నున్నను. అంతట వ్యాపించినదై, ప్రారబ్ధ భోగముల ననుభవించున దై మోక్షమును పొందుచున్నది. ఇట్లు వ్యవహార దృష్టి, యంతయు, చేయుచున్నదై, యదార్ధమున, నాతడేమియు చేయని వాడే అగును. 

ఆకాశమందున్న సూర్య భగవానుడు, లతలచే పరివేష్టితమగు, వనమును జూచునట్లు, జ్ఞానియు, దు:ఖ వంతము, నాశనకరము అగు, ఈ లోకము లన్నింటిని జూచుచు. కాలకూట విషము శ్రీశంకర భగవాసుని, కంఠమును, కలుషిత మొనర్పక కేవలము శోభనే కలుగజేయునట్లు, జ్ఞానిచే భోగ సముదాయము దు:ఖమును గాక, సుఖమునే కలుగచేయును. జగత్తంతయు మిధ్య అని ఎఱిగిన పిదప, అనుభవించబడు భోగములును సంతుష్టినే కలుగజేయును. చేతిని చేతితో నలిపి, దంతములను దంతములతో కొఱికి, అవయవములన అవయములచే నాక్రమించి, ఏ విధముగనైనను సర్వ ప్రయత్నములచే యింద్రియములను శత్రువులను జయించవలెను. ఈ పృధ్వీ తలమంతటను, చిత్తమును జయించినవారె, బాగ్యవంతులు, బంధ విముక్తులు అగుటచే సుఖంబుగ నుందురు. 
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 82 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 STHITHI-PRAKARANA - 2 🌴

🌻 THE STORY  OF SUKRA VENUS - 2  🌻

Coming  to the  conclusion that  she  belonged to  Deva  loka,  he  resolved  upon  going  to  that  Loka (world),  when  lo!  he  saw  that  Loka  before  him  and Indra,  the  lord  of  Devas  shining  in  it  like  lightningflashing  clouds  and  seated  on  his  beautiful  throne, eulogised  by  the  Devas  therein.  Thereupon  formal courtesies  were  exchanged  between  Sukra  and Indra.  

Whilst  Sukra  was  living  there  amidst luxurious  enjoyments,  the  self  same  Deva  lady with  budding  breasts,  whom  he  had  before  seen, emerged  out  of  a  group  of  damsels  and  presented herself  before  him.  The  eyes  of  Sukra  gleamed  with inexpressible  delight  at  the  sight  of  this  fair creature  who,  in  turn,  returned  his  glances.  While thus  their  hearts  and  eyes  were  melting  into  one with  love,  Sukra  who  never  failed  to  bring  into existence  whatever  he  willed  through  his  Sankalpa willed  that  sable  darkness  should  envelop  the space.  

With  intense  gloom  enveloping  therein  as  at the  end  of  a  Kalpa,  all  who  were  there  fled  to  other quarters  panic-struck  and  thus  cleared  the  field  for the  pair.  Then  the  celestial  damsel  was  embraced by  Sukra,  beneath  the  foliage  of  the  beautiful  Kalpa tree  of  Paradise.  

Thus  the  pair  passed,  eight  Chatur Yugas (54)  in  sensual  enjoyments  without  any  let  or hindrance.  Then  fearing  lest  all  his  Dharmas should  be  wasted  thus,  he  descended  to  Bhu  loka (earth)  from  Deva  loka.  It  was  here  (on  earth)  that he  forgot  all  about  his  pristine  reality.  In  his descent  from  Indra  loka,  Sukra  s  Jiva  commingled itself  with  the  soft  rays  of  the  full  moon  and became  the  cool  snow.  This  snow  falling  on  paddy fields  converted  itself  into  paddy.  

The  rice  arising from  the  fertile  stalks  was  cooked  and  eaten  by  a Brahman  of  Dasarna  country  and  was  converted into  the  seminal  fluid  in  him.  Sukra,  who  was  thus in  the  form  of  sperm  in  the  Brahmin,  ultimately came  out  as  his  son (55)  out  of  the  womb  of  his spouse.  Associating  himself  with  Tapaswins,  he performed  rare  Tapas  for  the  period  of  a  Manu,  in a  forest  encircling  the  golden  mountains  of Mahameru.  Then  Sukra  bore  an  offspring  of  a  man through  a  hind.  

Through  the  Ajnana  (Ignorance) with  which  he  was  enslaved  to  the  material  things of  the  world,  through  his  fond  love  to  his  off spring,  he  fell  off  from  his  true  state.  Passing through  a  series  of  incarnations  subject  to  births and  deaths  generated  by  his  illusory  Vasanas,  he  at last  incarnated  in  the  body  of  a  Tapaswin,  as  the son of  a  Muni  on the banks  of the  holy  Ganges.   

Note : 
54.  Chatur-Yugas  are  otherwise  called  Mahay  ugas.  Each  Maha  Yuga  is composed  of  the  4  Yugas,  Krita,  Treta,  Dwapara  and  Kali.   

55. This  shows  clearly  that  Venus  stands  for  the  egos  of  human  beings. This describes the  general pilgrimage  and  incarnation  of  egos.   

Continues... 
🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 31 / YOGA VASISHTA - 31