శ్రీ యోగ వాసిష్ఠ సారము - 85 / YOGA-VASISHTA - 85

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 85  / YOGA-VASISHTA - 85 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ

🌴 2. స్థితి ప్రకరణము 🌴
🌻. దామవ్యాళ కటాదుల స్వప్న వృత్తాంతము  - 1 🌻

కాశ్రీర దేశమున, యొక తటాకములో, మత్స్య జన్మ నెత్తిన పిదప, గ్రీష్మ ఋతువు నందు, మహిషములు ఆ తటాకమును త్రోక్కివేయుటచే, ద్వంసమైన చెరువు నందు వారు మువ్వురును నశించి మరల సార పక్షులుగా జన్మింతురు. ఆసార పక్షులు, స్వేతకమలము లందు, ఉత్తమ లతలందు, తరంగ సమూహము లందును, ఉత్తమ భోగముల ననుభవిరచి, చిరకాలము, విహరించిన పిదప శుద్దత్వము నొందిరి. 

వివేక దృష్టిచే విచారించి, సత్వ రజస్తమో గుణములు భిన్నములు కాగా, వివేకబుద్ధి జనించి, ముక్తి కొరకై వారు మువ్వురు, వేరగుదురు. తదుపరి వారు అనుష్టానమను నగరమున, ప్రద్యుమ్న శిఖర మందు గల గృహము లన్నింటిలో శ్రేష్టమగు ఒక గృహమందు గల గోడపై, రాతి యందొక గూడు వుండును. ఆ గూటి యందు వ్యాళుడను దానవుడు చటకపక్షి (పిచ్చుక) రూపమున వుండును. 

ఆ నగర మందు, శ్రీ యశస్కరదేవుడను రాజు కలడు. రాజ గృహమున నున్న పెద్ద స్ధంభము యొక్క వెనుక భాగమున గల రంధ్రము నందు, ధాముడను పేరు గల, దైత్యుడు, అల్ప శబ్దమొనర్చు మశకమై యుండును. ఆ నగర మందే రత్నావళి విహారమను, ఒక విహారము కలదు. ఆ నగర మందే, నరసింహుడను పేరు గల ఒక జ్ఞానియగు మంత్రి నివసించుచుండెను. ఆ మంత్రి గృహమున కటుడను, అసురుడు రజిత పంజరమున సారికయను పేరు గల పక్షిగ వుండెను. 

ఆ నృసింహుడను మంత్రి, శ్లోకరూపమున రచించబడిన, దామవ్యాళు కటాదుల యుత్తమ చరిత్రను పఠించెను. ఆ సారిక తన యా చరిత్రను విని శంబరాసురునిచే కల్పింపబడిన, తన జీవ రూపమును త్యజించి, యెద్దాని యందు సంసార రూపము, సమూలముగ నశించునో, అట్టి యుత్తమ మగు మోక్షమును ప్రాప్తి నొందును. 

రాజ మందిర స్ధంభమున నివసించు ఆ మశకమమును, ఆ స్వీయ చరిత్రను విని, మోక్ష రూపమున, పరమ శాంతిని పొందును. ప్రద్యుమ్న శిఖర సమీప వాసియగు ఆచకటమున్ను, అచటి నివాసులచే, నా చరిత్రను విని, పరమోత్తమమగు నిర్వాణ మొందెను. 

ఓ రామా! ఇట్లు దామ, వ్యాళుల వృత్తాంత క్రమమంతయు నీ కెరిగించితిని. ఈ విధముగ నామ రూపాత్మకమగు, ఈ ప్రపంచ మంతయును శూన్య రూపమును, మాయా మాత్రమును అయియున్నది. అజ్ఞానులగు మూఢుల, దామ, వ్యాళ, కటాదుల వలె పతనము నొందుదురు. 

కేవలము తర్క శాస్త్రమును, ఆశ్రయించువారు పరమ పురుషార్ధ రూపమగు, తమ ఆత్మ రూపమును నశింపజేసుకొనుచున్నారు. కాని స్వానుభవముచే, శ్రుతి మార్గమున నుసరించి, యుత్తము గతిని పొందువానికి, వినాశమెప్పటికి చేకూరదు. ఎవని అంత:కరణమున, నిత్యము సత్వగుణము స్పురించుచుండునో, అట్టివానిని, ఇంద్రాది దేవతలు సదా రక్షించు చుందురు. 

అపమార్గము నవలంభించువారు, అమృత పానమొనర్చినను మృతి చెందెదరు., శమదమాది గుణములచే, విఖ్యాతి నొందిన వానికి, అనగా సత్పురుషులకు, నాశన రహితమగు, పరమోత్తమ శ్రేయము లభించును. అట్టి వానికి, సమస్త ఆపదలు శమించును. తుచ్ఛములగు ప్రాపంచిక విషయభోగములు, మృత్యువుతో అంతమగును. 

వేదాంత శాస్త్రమును, నిత్యము విచారించిన, మృత్యుభయము నశించి, నాశన రహితమును, నిత్యమునగు, నిరతి శయానందము లభించును. ధనాదుల గూర్చి విచారణ త్యజించి, మోక్ష మార్గమున, జాగరూకుడవు కమ్ము, ఉత్తమ ఆచార మార్గమున, పవిత్ర ఆచరణ, వివేకబుద్ధి గల్గి ప్రాపంచిక సౌఖ్యములు, కేవలము దు:ఖ ప్రదములేనని ఎఱింగి శాస్త్రమందభిరుచి గల్గిన వానికి, ఆయువు, యశస్సు, గుణము, సౌభాగ్యము మున్నగునవి వృద్ధి పొందును. 

కావున ఓ రామా! మోక్ష ఫలము కొరకై శుభయత్నమును విడువకుము. 

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹

🌹 YOGA-VASISHTA - 85 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 STHITHI-PRAKARANA - 5 🌴

🌻 THE STORY  OF SUKRA VENUS - 5 🌻

Then  the  son  eying these  two,  remarked  thus  „Through  your  presence here,  I  have  been  cleansed  of  all  the  delusions arising  from  stainless  Tapas,  Yajnas  and  wealth. 

Even  copious  draughts  of nectar  will  not  yield  such bliss  as  your  advent  here.‟  Thereupon  Bhrigu  saw him  endearingly  and  blessed  him  thus  „May  bliss ever  increase  in  you,  may  you  possess  Jnana  fully, and  may  Ajnana  fly  from  you.‟  Then  closing  his two  mutilated (56)  eyes,  Sukra  reviewed  all  his  past lives  through  his  Jnana-Vision.  Thus  was  he  freed in  a  moment  from  future  births.  

After  observing  all  through  his divine  vision, Sukra remarked  in  wonder  thus  „Passing  strange  is  it  that the  dire  delusion  called  Prakriti  (matter),  having transformed  itself  into  this  universe,  flourished friendly  in  my  mind.  I  have  known  all  that  should be  known  I  have  seen  all  that  should  be  seen.  I have  been  released  from  the  pains  incidental  to  the many  re-births.  I  have  been  whirling  in  them  for  a long  time.  

I  have  attained  Atma-Jnana,  the  good effects  of  all.  Therefore,  sirs,  let  us  here  after  betake ourselves  to  Mandara  hills  and  see  the  body  lying there.  Do  not  think  that  I  have  either  love  or  hatred towards  objects,  albeit  my  intention  is  to  visit  the skeleton  of  my  body  due  to  Karma  and  derive happiness  therefrom.‟  After  Vasudeva  spoke  thus, all  the  three  started  for  Mandara  hills  and  reached it  in  a  moment.  

When  these  triumvirs  who  had known  the  extent  and  true  nature  of  the  whole universe  arrived  at  the  spot,  Vasudeva  surveyed, with  unmingled  plea  sure,  his  former  body  as  the son  of  Bhrigu  and  then  casting  his  glances  at  his father,  asked  him,  whether  it  was  that  bony  body which  he  had  reared  up  as  his  sons.  Then continuing,  he  said  „Oh  father,  this  body  you brought  up  before  with  rare  happiness,  being without  pains,  desires,  doubts,  or  sense  of  gain  or loss  was  in  a  state  of  immutable  bliss  with  mind destroyed.  Is  there  any  happiness  to  Jivas  (egos) other  than  in  the  state  when  the  mind  is  destroyed? 

This  solitary  body  had  then  attained  the  bliss  of those  who  have  got  by  the  All-pervading  Jnana wherein  one  is  drowned  in  the  one  ocean  of  the great  bliss,  or  the  extreme  quiescence  or  that  Atmic certainty,  wherein  the  Jnanis  are  free  from  all pains.  It  is  only  through  dint  of  my  rare  Tapas,  I have  been  able  to  witness  the  miracles  I  have  seen here.‟  

So  said  Vasudeva,  when  Kala  (Yama)  who  was  by interrupted  him  with  these  words.  „Now  sir,  enter this  body  like  kings,  their  cities.  And  there  be administering  the  duties  of  a  guru (57)  to  the  Asuras who  need  correction/  Having  given  these  orders  to Sukra,  he  bid  adieu  to  them  both  and  instantly disappeared  from  the  very  spot  where  he  was standing.  

At  his  departure,  the  father  and  son  were greatly  grieved.  But  Sukra  of  great  prowess abandoned  the  conception  of  Vasudeva  and  then entered  his  former  body  according  to  Yama  s injunction.  Thereupon  the  matchless  Bhrigu  bathed with  the  waters  in  his  bowel  purified  through Vedic  Mantras  the  body  of  Sukra  into  which  the son  had  to  enter  through  sheer  fate.  

Note : 56. The  eyes  of  S  ukra  were  mutilated  at  the  time  when  Bali  ac  ceded  to the  request of  Vishnu as Dwarf.   
57.  If  Asura  means egos,  Sukra  (Venus)  is  their  guru. 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 31 / YOGA VASISHTA - 31