శ్రీ యోగ వాసిష్ఠ సారము - 81 / YOGA-VASISHTA - 81

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 81 / YOGA-VASISHTA - 81 🌹
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 81 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు
📚.  ప్రసాద్ భరద్వాజ

🌴 2. స్థితి ప్రకరణము 🌴
🌻. జాగ్రత్‌, స్వప్న, సుషుప్తావస్థలు  🌻

అంతట శ్రీరాముడు, జాగ్రత్‌, స్వప్న, సుషుప్తావస్ధల భేదములను తెల్పుమని వసిష్టుని కోరెను. 

స్ధిర ప్రత్యయము కల్గివున్నది. జాగ్రత్‌ వ్యవస్త అని, అస్ధిర ప్రత్యయ యుక్తమైనది, స్వప్పమనియు చెప్పబడినది. స్వప్నమున జాగ్రత్‌ లక్షణమున్న, అదియు జాగ్రత్తే యగును. జాగ్రత్‌ స్ధిరముగానిచో, స్వప్నము అని చెప్పబడును. స్ధిర అస్ధిరములే రెంటికి ముఖ్యభేదము. రెడింటి అనుభవము సర్వత్ర సమమైనదే. స్వప్పమును స్వప్నకాలమున స్ధిరత్వముచే జాగ్రత్‌ అగును. అలానే జాగ్రత్‌ అస్ధిరము అయిన అది స్వప్నమే అగును. 

హరిచంద్రునకు ఒక రాత్రి ద్వాదశ సంవత్సర కాలముగ తోచినది. శరీర మెపుడు మనోవాక్కర్మలచే, వ్యవహారము సల్పునో, అపుడు, ప్రాణవాయువు ప్రేరిత మగు జీవ చైతన్యము, తేజము, వీర్యము, జీవము మొదలైన నామములచే, ప్రసిద్ది కెక్కినది. నేత్రాదుల ద్వారా, బాహ్య ప్రదేశమున, వ్యాప్తమగు జీవ చైతన్యము, పలువిధ వికారములచే తనయందే గాంచుచున్నది. సుషుప్తిస్ధితిలో, మనోవాక్కాయ కర్మలచే శరీరము క్షోభ చెందక, జీవ చైతన్యము శాంతముగ, స్వస్తముగా నుండునో, అనగా సమత్వము చెందిన ప్రాణ వాయువు వలన, నేత్రాది చిత్రముల గుండా, బాహ్యభ్యంతరములందు వెళ్ళక యుండును. 

అపుడు, జీవ చైతన్యము, స్వచ్చత కారణమున బ్రహ్మత్వ మందు సుషిప్తి దశను పొందుచున్నది. చిత్తము సర్వ వ్యవహారముల నుండి విముక్తి పొందిన, అపుడు చైతన్యము యొక్క సమత్వము పొంది ఏకాగ్రతచే, బ్రహ్మ సాక్షాత్కారమొంద యోగి, జాగ్రత్‌, స్వప్న, సుషిప్తి స్ధితులందు, వ్యవహరించు చున్నను, అతడెల్లపుడును, తురీయమందున్నవాడె అగును. అపుడు బీజ రూపమందున్న, విశాల వృక్షమును, యోగి తన యోగశక్తిచే వివేచించి, దానిని తన యంత: కరణమున శ్రీఘ్రముగ నవలోకించును. 

ప్రాణ వాయువు కొంచెము సంక్షబిత మైనపుడు, చైతన్యముననే నున్నానను భావము పొందును. అధికముగ సంక్షుచితమైన, ఆకాశగమనమును పొందును. శ్లేష్మముచే పూర్ణమైన జీవుడు, తన అంత:కరణమున, జలాదులను గాంచును. పిత్తము అధికమైన, జీవ చైతన్యము బాహ్యమున అనుభవించును. రక్తముచే పూర్ణమైనపుడు రక్తవర్ణములగు తత్‌ సంబంధ అనుభములు పొందుచుండును. ఈ జాగ్రదాదులు కేవలము మనస్సు యొక్క యదార్ధ స్వభావమును బోధించుటకే. 

ధృడ నిశ్చయముగల చిత్తము, ఏ పదార్ధమును అధికముగ భావించునో, యద్దాని రూపమునే చెందుచున్నది. ఈ మనస్సు జగత్‌ విస్తార మంతమొనర్చుచున్నది. మనస్సే పురుషుడు. మనస్సెటులుండునో, శరీరము అచటికి అవశ్యముబోవుచున్నది. కాని శరీరమున్న చోట మనస్సు వుండకపోవచ్చు. కావున సత్యమైన, ఆత్మయందు, మనస్సును వుంచి, దేహేంద్రియాదుల భ్రమను వీడుము. 

సుగంధమునుగాని, దుర్గంధమునుగాని పీల్చిన ఆ రూపమునే పొందుచున్నట్లు, మనన శక్తిచే చంచలమగు యీ మనస్సే యెట్టి భావమును గ్రహించునో, అట్టి రూపమునే పొందును. ఈ కారణముచే, తమ తమ వాసనలచే, కల్పితమగు సిద్ధాంతమును, యుక్తులచే నిర్ణయించి, యంత:కరణమున గల, యనురాగముచేత ఆరూపమునే అహంకారముగ నిశ్చయించుకొనును. 

శరీరమందే యాకారము సంభవించునో, బుద్ది ఇంద్రియము లందు అదియే సంభవించుచున్నది. పదార్ధమును భావన చేయగ, మనస్సు ఆ పదార్ధ రూపమునే పొందును. శరీర మందే యాకారము సంభవించునో; బుద్ధి, ఇంద్రియము లందు, నదియె సంభవించుచున్నది. జ్ఞానేంద్రియములు, తమ తమ విషయములందు ప్రవర్తించునపుడు, కర్మేంద్రియములు, తదనుగుణముగ ప్రవర్తించును. 

ఈ విధముగ, మనస్సు యొక్క బీజమే, కర్మ అనబడును. కావున పుష్ప గంధమువలెనే, మనస్సు కర్మలు రెండును అభిన్నములైనవి. కనుక కర్మ ఫల మనుభవించిన, సత్వరమున బంధమున దగుల్కొనును. భిన్నభిన్న మతముల వారు, తాము వచించు యుపాయముల వలననే మోక్షము గల్గునని నిర్ణయించి, అన్యోపాయములను, గ్రహింపక గ్రంధములను రచించి, తన సిద్దాంతమును, ప్రవచించి, ఇతరులకు కూడ అట్లే బోధించుచున్నారు. 
🌹 🌹 🌹 🌹 🌹


🌹 YOGA-VASISHTA - 81 🌹
✍️ Narayan Swami Aiyer
📚 🌻 Prasad Bharadwaj

🌴 STHITHI-PRAKARANA - 1 🌴

🌻 THE STORY  OF SUKRA VENUS - 1  🌻

🌷 Summary:  
Having  in  the  previous  Prakarana  given out  the  Ajnana  stages  to  show  that  the  play  of  the mind,  arising  out  of  Chaitanya,  constitutes  this universe,  as  also  the  7  Jnana  stages  to  relieve  one from  that  universe,  the  author  begins  with  this Prakarana  of  five  stories  to  show  that  this  universe shines  as  Chaitanya  only,  even  after  its  rise  and during preservation.   

Without  the  aid  of  a  painter  or  a  canvas  or  any other  materials  of  painting,  the  picture  of  the universe  appears  depicted  on  the  stainless Chidakas.  

Having  itself  appeared,  it  is  ever  seeing- itself,  (as  there  is  none  else  for  it  to  see).  Therefore this  universe  is  like  a  Swapna  in  Jagrat  and  not  like the  state  of  Sushupti  (sleep),  when  all  conceptions of  organs  are  lost.  The  reflections  of  all  the universes  in  the  non-  differentiated  Atma-Jnana which  is  witness,  all  full,  immaculate  and  all - pervading  is  like  that  of  the  image  in  a  glass.  They shine  through  Brahman  without  any  relationship of  cause  and  effect.  Their  true  nature  can  be  said  to be  the  reflection  itself.  

May  you,  oh  Rama,  through painful  endeavours  contemplate,  as  one,  upon  the eternal  Brahman  which  is  partless,  the  Atman  (Self) of  all,  the  Jnana  and  the  all-pervading  Chidakasa. Should  you  attain,  such  certitude  of  mind,  it  will  be free  of  all  fluctuations  and  become  of  the  nature  of Atma  Jnana  itself.  Just  as  one  stone  has  in  it  carved many  pictures,  so  in  the  one  Brahman  the  worlds manifest  themselves.  Since  there  is  no  cause  or effect  associated  with  Brahman,  there  is  really nothing  to  be  called  the  universe.  Atma-Jnana alone  is.  All  the  universes  are  but  the  reflections  in the  one certitude of  Brahman.   

To  illustrate  the  truth  of  my  remarks,  you  shall hearken  to  the  story  of  (Venus)  Sukracharya.  In days  of  old,  Muni  Bhrigu  was  engaged  in  the performance  of  immutable  Tapas  on  the  slope  of the  lofty  and  ancient  mountain  called  Mandaragiri. His  son  who  rejoiced  in  the  name  of  Sukra  was  a remarkably  intelligent  person  and  shone  like  the moon.  He  never  used  to  part  from  the  feet  of  his father.  He  was  in  that  great  Laya  (neutral)  state which  is  inter  mediate  between  the  incomparable Chit  and  Achit  states (52) .  

Whilst  he  was  thus  in  an intermediate  state  unaware  of  them  both,  like  King Trisanku (53)  who  was  left  in  the  middle  of  the  sky without  being  able  to  go  higher  up  or  come  lower down  to  the  earth,  his  father  was  in  Nirvikalpa Samadhi.  Then  the  son,  who  never  used  to  part from  his  father,  remained  separate  and  looked  up through  the  pure  Akasa  where  he  saw  a  Deva (celestial)  lady  approaching  him.  

Her  graceful tresses  were  bedecked  with  Mandara  flowers,  the odour  of  which  was  gently  wafted  by  the  zephyrs as  she  trudged  along  with  the  gait  of  a  sheelephant.  Having  eyed  her  fully  before  him,  he became  quite  enamoured  of  her;  and  then  closing his  two  eyelids,  he  revelled  in  the  vast  fields  of  his mental  region,  through  the  over-powering  desire in  him.  

Note : 52. The  state  of  Brahman  is  said  to  be  that  neutral  state  which  is  between or  above  the  (Chit)  intelligence  and  (Achit)  matter  of  the  universe.     

53. This  King  sought  of  Vasistha  to  be  transported  physically  to  the heavens  but  he  was  refused;  and  hence  he  requested  Viswamitra  who unable  to  take  him  up  to  Swarga,  the  heavens  left  him  in  the Antariksha,  the  intermediate  space.   

Continues..
🌹 🌹 🌹 🌹 🌹

Comments

Popular posts from this blog

🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 / Yoga Vasishta - 8 🌹

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 43 / YOGA-VASISHTA - 43

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 31 / YOGA VASISHTA - 31