శ్రీ యోగ వాసిష్ఠ సారము - 90 / Yoga Vasishta - 90
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 90 / Yoga Vasishta - 90 🌹 ✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు 📚. ప్రసాద్ భరద్వాజ 🌴 2. స్థితి ప్రకరణము 🌴 🌻. సృష్టి ఎలా యుత్పన్నమయినది 🌻 శ్రీరాముడు సత్యమైన పరబ్రహ్మము నుండి సృష్టి ఎలా వుత్పన్నమయినదో తెలుపు మనగా వసిష్టుడిట్లు చెప్పెను. బ్రహ్మమే ఈ జగద్రూపమున, బ్రహ్మముననే యూహింపబడుచున్నది. బ్రహ్మమందే వివిధ కల్పనలు సంభవించును. కారణము అవి సర్వశక్తి వర్జితము. చిదాత్మ ప్రధమమున, చిత్త సహిత జీవరూపము చెందుచున్నది. చిత్తము చేతనే అది కర్మమయ, వాసనా మయ మనోమయ శక్తు లన్నింటిని సంచయ మొనర్చుచున్నది. పిదప అట్టి శక్తులను ఫలరూపమున దర్శింపజేయుచు, మరల తిరోభావముచే నశింపజేయుచున్నది. జీవు లందలి, వివిధ సృష్టులై, సమస్త పదార్ధముల యొక్క ఉత్పత్తి బ్రహ్మము నుండియె నిరంతరముగ గల్గుచున్నది. మరల అతని యందే లయమగుచున్నది. అంతట శ్రీరాముడు, అగ్ని యందు, శీతలత్వము, జలమందు దహనశక్తియు, సంభవించిన విధమున, జడత్వమగు, అదృశ్యమగు బ్రహ్మము నుండి, యీ జగత్తు ఎట్లు ఉత్పన్నమగు చున్నది? బ్రహ్మము నుండి యుత్పత్తి అయిన, యీ బ్రహ్మము, బ్రహ్మము వలె గాక మనస్సు యింద్రియములుగా ఎట్లు మారుచున్నది. దీపము నుండి ద