Posts

Showing posts from 2020

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 257 / YOGA-VASISHTA - 257

Image
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము -  257 🌹 🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 54 🌴 ✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు 📚.  ప్రసాద్ భరద్వాజ 🌻. 135. జీవన్ముక్తులు - 1 🌻  దేహధర్మము అనగా వ్యవహారాధులు, జీవన్ముక్తునకు వర్తింపవు. ముక్త చిత్తము మరల ఎన్నటికి బంధింపబడదు.  తొడిమనుండి పడిన ఫలము,మరల ప్రయత్నము చేసినను, ఎవని చేతను ఆ తొడిమ బంధింపబడజాలదు. కాబట్టి అట్టి వారు ఇతరులచే జీవన్ముక్తుని తెలియబడజాలరు.  ధారణాదులచే గూడిన యోగులు, ఇతరులచే నెఱుగబడుదురు కాన మోక్షము ధారణాదులవలె ఇతరులచే నెఱుగబడినది కాదు. అది మధుర పదార్ధముల ఆస్వాద సౌఖ్యమువలె స్వాద్వైక వేద్యమే యైయున్నది.  అభ్యంతరమున శీతలత్వముతో గూడిన(శాంతి) చిత్తమే ముక్తియని, సంతప్త చిత్తమే బంధమని చెప్పబడుచున్నది. కావున బంధమోక్షములు చిత్తాదీనములే గాని, దేహాదీనములు కావు. దేహమునందు బంధమోక్షములు లేవు.  శరీరము ముక్కలు ముక్కలుగ కోయబడినను, ఏడ్చుచున్నను, నవ్వుచున్నను, జీవన్ముక్తునకు అంతఃకరణమున దేహసంబంధ దుఃఖము, సుఖము కొంచెమైననుండదు.  నిత్యమై అశరీరమైన ఆత్మస్వభావము పొందియుండుటచే జీవన్ముక్తులకు దేహాదిభావన నెపుడును నుండనే...

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 256 / YOGA-VASISHTA - 256

Image
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము -  256 🌹 🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 53 🌴 ✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు 📚.  ప్రసాద్ భరద్వాజ  🌻 134. విపశ్చి దుపాఖ్యానము - 2 🌻 ఓ రామచంద్రా| ఇట్లు ప్రళయమువంటి మహాయుద్ధమునందు కొన్ని సైన్యములు ఓడిపోవుచు కొన్ని జయించుచుండ, భేరి మహాశంఖముల శబ్ధములు ప్రతిధ్వనులతో నాకసమున ఖడ్గములు శబ్ధమొనర్చు చుండగ రాజు నాల్గు దిక్కులకు జనెను. తన సైన్యము దుర్భలముగను, శత్రుసైన్యము బలయుక్తముగ నుండెను. ఆ సైన్యము మహా సముద్రము వలె నుండుట రాజు వీక్షించెను. అంతట రాజు ఆ శత్రుసైన్యమును నిర్మూలింప, శివుడు అస్త్రమును సంధించినట్లు బాణములను నలువైపుల సంధించెను.  తన సైన్యము హితము కొరకు, శత్రు సైన్యము దమనము కొరకు నాతడు అగ్నిదేవునికి ప్రణమిల్లి, మంత్రము జపించి శీఘ్రముగ దారుణాస్త్రమును ప్రయోగించెను.  అట్లేదాని సహాయము కొరకు, శత్రు జనిత తాపశాంతికొరకు, అస్త్రములన్నింటికి ప్రభువగు పర్జన్యాస్త్రమును గూడ ప్రయోగించెను. అపుడా భయంకరమైన ఆయుధములు నదులవలె ప్రవహింపజొచ్చెను.  అపుడు ప్రళయకారులైన మహా వాయువులు వీవదొడగెను. శత్రుసైన్యము శీఘ్రముగ నెగురగొట్టబడెను. యుద్...

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 255 / YOGA-VASISHTA - 255

Image
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము -  255 🌹 🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 52 🌴 ✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు 📚.  ప్రసాద్ భరద్వాజ  🌻 134. విపశ్చి దుపాఖ్యానము - 1 🌻 అవిద్య నశించనిచో, జగత్తునకు అంతములేదు. అని తెల్పు అవిద్యోపాఖ్యానము వర్ణించబడినది. శ్రీరాముడు, ఈ అవిద్య ఎంతకాలముండును. ఎట్లు అది వర్తించును? అని అడుగగా వసిష్ఠుడిట్లు పలికెను.  ఈ అవిద్య ఎవరికి ఉండునో, అట్టి అజ్ఞానులకు బ్రహ్మమువలె అంతమేయుండదు. ఈ విషయములో ఈ కథను వినుము.  పూర్వకాలమున ఒకానొక వస్తువునందు, ఒకప్రదేశమున వివిధ అవస్థలలో ఒక త్రైలోక్యము కలదు.  అందు ఒక భూభాగమందు మనుజులు, గజములు, అశ్వములతో యోగ్యమైన సమప్రదేవమున తతమితయను పేరుగల ప్రసిద్ధ నగరము కలదు అందు విపశ్చిత్తు అను పేరుచే విఖ్యాతి పొందిన భూపాలుడొకడు కలడు. అతడు సర్వ శాస్త్ర ప్రవీణుడగుటచే అతని సభకూడ ప్రసిద్ధి చెందినది.  ఆ రాజుయొక్క అనంత గుణములు వర్ణించుటయందు, కవులు అసక్తులైరి. అయినను ఆ రాజు వారిని గౌరవించుచుండెను. అతడు బ్రాహ్మణులయందు, దేవతలయందు భక్తి కల్గియుండెను.  అతని వద్ద సర్వ సమర్దులైన నల్గురు మంత్రులు మహా బలవంతులు ఉండ...

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 254 / YOGA-VASISHTA - 254

Image
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము -  254 🌹 🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 51 🌴 ✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు 📚.  ప్రసాద్ భరద్వాజ  🌻 133. చిదాకాశము(బ్రహ్మము) 🌻 ఓ రామచంద్రా| ఏక కాలమున జన్మించిన, ఇద్దరు సొదరులకు వేరువేరు పేర్లు పెట్టబడినట్లు, జాగ్రత్‌ స్వప్నరూపుడగు అఖండ చైతన్య ప్రతిబింబములను రెండు ప్రపంచములు; జాగ్రత్‌ స్వప్నమని వేరువేరు పేర్లు పెట్టబడినవి.  క్షణమాత్రములో, ఒక ప్రదేశమునందే, అతి దూరమునున్న మరియొక ప్రదేశమునకు దృష్టి జనినపుడు, ఆరెండు ప్రదేశముల మధ్మనుండు నిర్విషయమగు జ్ఞానముయొక్క స్వరూపమే చిదాకాశమని చెప్పబడుచున్నది.  కోర్కెలన్నియు శమించినట్టి శాంతచిత్తుడగు మనుజునకు, సర్వవైషమ్య రహితమైనట్టి ఏ స్వాభావిక సుఖస్వరూపముయొక్క యనుభవమగుటచే, అట్టిదే చిదాకాశ రూపమగును. వర్ష రుతువునకు ముందుగాని, శరదృతువునందుగాని వృద్ధిపొందు తృణ,గుల్మ,లతాదులయొక్క మమత్వరహితమగు యానందభావమే చిదాకాశము.  రూపసంకల్పాది సమస్త బాహ్యాంతర విషయ ముక్తుడగు జీవిత పురుషునియొక్క నిర్మల ఆనంద భావమేదికలదో, అదియే చిదాకాశము. బ్రహ్మదేవుడు; కాష్ట శిలలు, పర్వతములందు చేష్ట రహితమగు ఏ స్థితిని న...

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 253 / YOGA-VASISHTA - 253

Image
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము -  253 🌹 ✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు 📚.  ప్రసాద్ భరద్వాజ 🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 50 🌴 🌻. 132. పంచభూతములు, జీవుడు 🌻 ఓ రామచంద్రా| ఆకాశము శబ్ధ తన్మాతమ్రు, వాయువు, స్పర్శ తన్మాత్రముకాగ, ఆయాకాశవాయువుల సంఘర్షణచే రూప తన్మాత్రయగు తేజము, తేజముయొక్క ఉష్ణ శాంతిచే రసతన్మాత్రయగు జలము, వీటన్నిటియొక్క సంయోగము వలన గంధతన్మాత్రయగు పృధివి ఏర్పడుచున్నవి. నిరాకార ఆకాశమునుండియే ఇవన్నియు ఏర్పడినవి.  బ్రహ్మమే సర్వపదార్ధ స్వరూపమైయున్నది. ఈ పంచభూతములు అసత్యములైనను స్వప్న దశయందువలె సత్యములుగ అనుభూతములగును.  జాగ్రత్‌ స్వప్న రూపములతో చైతన్యమే ప్రకాశించుచున్నదనియు, చిత్‌ స్వభావముచే ఈ రెంటికి భేదములేదనియు నిచట వర్ణింపబడినది.  స్వప్నమందు వాస్తవముగ జగత్తులేదు.  చిత్‌ రూపమగు ఆత్మయే అట్లు  ప్రకాశమయ స్వరూపముతో భాసించుచున్నదనియు, అట్లే జాగ్రత్‌నందు, ప్రకాశించుచున్నదనియు, స్వప్నపదార్ధములవలె అసత్తయినను, ఈ త్రిలోకముల భాసించుచున్నది.  కావున స్వప్నమందు జగత్తు శూన్యమైనట్లు, జాగ్రత్తును శూన్యమేయైయున్నది. సూర్యుడు గత దినమున, నేడు ఒకడ...

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 252 / YOGA-VASISHTA - 252

Image
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము -  252 🌹 ✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు 📚.  ప్రసాద్ భరద్వాజ 🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 49 🌴 🌻. 131. చైతన్యస్థితి 🌻 చైతన్యముయొక్క నిత్యత్వము, ఏకత్వము, స్వాతంత్య్రము, సత్‌శాస్త్రముయొక్క మహత్యము ఇచట వర్ణింపడినది.  జాగ్రత్‌, స్వప్న, సుషుప్తులగు త్రివిధ అవస్థలందు సాక్షియై, శాంతరూపియై ఖేద రహితమైనదగు శరీరము నశించినను,చిదాకాశము నశింపదు.  దృశ్యమని ఎరుగబడుచున్న ఇదియంతయు చైతన్యముయొక్క వివర్త మాత్రమే. రామచంద్రా| ఉపదేశవాక్యములచే, అవిద్య ఉపశమించినప్పటికిని, జీవన్ముక్తి అభ్యాసములేక సంభవించదు.  ఆత్మజ్ఞానము తెలిసియున్నపటికిని అహంభావాది దోషములతో యుండుటవలన; కథన, బోధన, చింతనాది అభ్యాసములు లేకున్న, మరపువలన తెలియనిదే అగును. ఎవడు ఏ వస్తువును గూర్చి ప్రార్ధించునో, దానికొరకై నిరంతరశ్రమ చేసిన తప్పక పొందగలడు.  ఆధ్యాత్మ శాస్త్రముకంటే మించినది మరొకటిలేదు. దీనివలన సంసారమార్గముయొక్క భ్రమ తొలగును. సంసారబంధమై, అతి భయంకరమై,దీర్ఘమైనట్టి అజ్ఞానము, ఆత్మజ్ఞానము లేకుండ నశింపదు.  ఆకలిగొన్న సర్పము, రసహీనమైన వాయువును భక్షించునట్లు, విచారములే...

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 251 / YOGA-VASISHTA - 251

Image
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము -  251 🌹 ✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు 📚.  ప్రసాద్ భరద్వాజ 🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 48 🌴 🌻. 130. జీవన్ముక్తుడు 🌻 ఈ సంవిద్రూప ఆకాశమునే కొందరు బ్రహ్మమనియు, కొందరు విజ్ఞానమనియు, మరికొందరు శూన్యమనియు, కొందరు శివుడనియు, ఇంకొందరు ఆత్మయనియు వచించుచున్నారు. కాని చిన్మాత్రము మరొక రూపమును పొందకయేయున్నది.  దుష్టకర్మలచే మరణానంతరము, నరకాది రూపమగు భయముగలదన్నచో, ఆ భయము ఇచట, రాజదండనాదులచే అట్టి దుష్కర్మలకుండనేయున్నది.  కావున ఇహపరలోకములందలి శ్రేయస్సు కొరకు ఎట్టి దుష్కర్మలనాచరింపకుడు. నేను చచ్చెదనని ఏల బల్కెదవు. చిద్రూపుడునగుటచే, నేను మరణానంతరము ఉందును అని తలచవలెను.  నిర్వికల్ప సమాధియందు నిమగ్నమైట్టి బుద్ధిగలవానికి క్షోభ,దుర్భిక్షాది దోషములు అంటవు. అట్టివాడు మరణముచే దుఃఖముగాని, జీవితముచే సుఖము పొందడు. దేనిని వాంఛించడు, దేనిని ద్వేషింపడు; కారణము అతడు వాసనారహితుడు.  జీవన్ముక్తునకు శిలలు వన వృక్షములు మృగములు శిశువుల, స్ధావర జంగమాది సమస్త జీవులందును సమసదృష్టికల్గియుండును.  జీవన్ముక్తుడు జాగ్రత్తునందున్నను సుషుప్తునివల...

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 250 / YOGA-VASISHTA - 250

Image
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము -  250 🌹 ✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు 📚.  ప్రసాద్ భరద్వాజ 🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 47 🌴 🌻.  129. క్రిమి కీటకముల అనుభవము 🌻 క్రిమి,కీటక, తిర్యక్‌,స్ధావర, జన్మలందు ప్రపంచమున ఎట్టి అనుభవముండును.  ఓ రామాచంద్రా| సమస్త స్ధావర జంగమ ప్రాణులును, వానివానికి యోగ్యములగు భోగములయొక్క సుఖ సంపత్తినందు స్థితిగల్గియుందురు. అల్పప్రాణులకు, మనకు భోగేచ్ఛ కలదు కాని, మనకు అట్టి భోగములందు అల్ప విశ్వాసములు కొద్ది విఘ్నమును మాత్రమే గలవు.  ఓ రామచంద్రా| బ్రహ్మాండ శరీరుడగు విరాట్‌, స్వభోగముకొరకై ఎట్లు ప్రయత్నించుచున్నాడో, అట్లే సూక్ష్మములైనట్టి క్రిమి కీటకాదులును తమ శరీరములందు ప్రయత్నించుచున్నవి.  పక్షులు, చీమలు,సూక్ష్మజీవులు, క్రిములు మున్నగువన్నియు, స్వభోగముకొరకై ప్రయత్నించుచున్నవి. వృక్షములు కొంత జాగరూకములై, శిలలు ఘోరనిద్ర యందు, క్రిములు కొంత జాగరూపులై, నిద్రాశీలురైయుందురు. సుఖదుఃఖములతో కూడియుండును.  సుకుమారులైన మనుష్యులవలె, సుఖనిద్రయందు, శీతోష్ణస్థితులందు ఇట్టి దుఃఖము వేదన కల్గును. రాగద్వేష, భయ,ఆహార, మైధున జనితములగు సుఖదుఃఖ...

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 249 / YOGA-VASISHTA - 249

Image
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము -  249 🌹 ✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు 📚. ప్రసాద్ భరద్వాజ 🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 46 🌴 🌻. పిశాచములు - 3 🌻 ఆత్మజ్ఞానము పొందువరకే, ఆయా సిద్ధాంతములన్నియు సత్యములగును ఆత్మజ్ఞానము పొందిన పిదప ఆత్మయే సత్యము కాని మరొకటి కాదు.  కావున సత్‌ శాస్త్రము ననుసరించి వ్యవహరించువాడు విచారముతో, సజ్జనుడు, నిషిద్ధ ఆచరణ లేనివాడుయగు మహాత్ముని ఆశ్రయించవలెను. అట్టి వ్యక్తులు దుర్లభమగుట సత్యమే. కాని ప్రయత్నపూర్వకముగ వెదకిన అట్టి వారు మనుష్యులందు, దేవతలందు యుందురు.  వారు నిత్యము ఆనందస్థితిలోనుందురు. మూఢులగు తక్కినవారు సంసారసాగరమున, భోగములందు తృష్ణాదులయందు క్రింద పైన బడి కొట్టుకొనిపోవుదురు. ఇక గంధర్వులు, విద్యాధరులు యక్షులు రాక్షసులు ఆత్మ వివేకము లేనివారై, ఐహిక కర్మలనాచరించుచు అహంకారాది లక్షణములతో పుట్టుచు గిట్టుచుందురు.  దేవతలందు కేవలము; యమ,చంద్ర, రుద్ర,సూర్య, వరుణ, బ్రహ్మ, విష్ణు, బృహస్పతి, శుక్రాచార్యులు, అగ్ని, ప్రజాపతులు మొదలగు సత్‌ పురుషులు జీవన్ముక్తులై వివేకులైయున్నారు. మనుష్యులందు రాజులు మునులు బ్రాహ్మణులు మున్నగువారు కొద్దిమంది జీ...

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 248 / YOGA-VASISHTA - 248

Image
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము -  248 🌹 ✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు 📚.  ప్రసాద్ భరద్వాజ 🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 45 🌴 🌻. పిశాచములు - 2 🌻 ఈ గ్రంధముయొక్క దర్శనముచేతనే మనుజులకు మంచువలె సమస్త పదార్ధములందు అంతఃకరణ శీతలత్వముదయించుచున్నది.  మనుజులు స్వభావముగనే విషయములచే వశీకృతులగుచున్నారు. కనుకనే యుద్ధ,శౌర్యాదులచే ధన, స్త్రీ సంపాదనకు కృషి సల్పుచున్నారు. అట్టి వారు ఎపుడు వాటియందు విరక్తులై తత్వజ్ఞానము పొంది సుఖపడుదురుగాక.  పాషాణాఖ్యానము వలన, జగత్తు భ్రమయని బ్రహ్మాండమయిన చిద్రూపమగు ఆత్మయొక్క వర్ణనను ఇచట తెలుపబడినది.  ఈ జగత్తేదియు నెచ్చటను ఎపుడును యుండియుండలేదు.  ఏకరసమై,చిద్ఘనమైనట్టి బ్రహ్మమే, బ్రహ్మమందు అఖండరూపమున యధారీతి స్థితికల్గియున్నది.  స్వప్నమందలి నగరములు చిద్రూపములే యగునట్లు, ఈ జగత్తున్ను, బ్రహ్మము చిన్మాత్రమేయని ఎఱుగుము. బ్రహ్మదేవుని (సమిష్టిజీవుని) రూపములో స్థూల సూక్ష్మ జగత్‌రూపమను దృశ్యముయొక్క పరిస్థితి ఏర్పడినప్పటికి, జన్మరహితమగు చిదాకాశము తన చిత్‌స్వరూపమును, త్యజింపకయే స్థితినొందియున్నది. సువర్ణమందు సువర్ణమ్‌ కలదుగాని శిలాత...

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 247 / YOGA-VASISHTA - 247

Image
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము -  247 🌹 ✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు 📚.  ప్రసాద్ భరద్వాజ 🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 44 🌴 🌻.  పిశాచములు - 1 🌻   వసిష్ఠుడు తన శరీరము శిధిలమైయుండగా, సిద్ధునితో ఎట్లు సంభాషణవ్యవహారములు గావించెనో శ్రీరామునకు తెల్పుట.  నేను మొదట జగత్తున సంచరించుచు, సిద్ధుల సేవలందును, నగరములందును తిరిగి తుదకు ఇంద్రుని పట్టణము చేరితిని. అచట నాకు స్థూలశరీరము లేకపోవుటచే, సూక్ష్మశరీరమున నున్న నన్నెవరు గాంచలేదు. మనోమాత్రుడనగు నేను, మనోమయ ప్రాణులతో మాత్రమే వ్యవహరించుచుంటిని.  ఇచట స్వప్నానుభవమే అఖండ దృష్టాంతము. స్వప్నమున నున్నవారిని అతని గృహమందలి ఇతరులెవరు జూడజాలనట్లు, ఎదుటనున్నప్పటికిని నేను దేవతలచే జూడబడలేదు.  నేను సర్వులను చూడగలను గాని, నన్నెవరు గాంచలేరు. గాని యోగసిద్ధులు గాంచగలరు. దేవతల స్థానములందు నేను అనిర్వచనీయమైన పిచాచత్వమును గాంచితిని. ఈ ప్రపంచమున పిచాచములెట్లుండునో వినుము.  మంచి నడవడిలేనివాడు, ప్రపంచానుసారము మాట్లాడనివాడు, సూక్ష్మదేహమును ధరించి స్వప్నమువలె మనఃకల్పితములగు హస్తపాదాదులు కల్గియుందురు. వారు తక్కిన ఆకార...

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 246 / YOGA-VASISHTA - 246

Image
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము -  246 🌹 ✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు 📚.  ప్రసాద్ భరద్వాజ 🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 43 🌴 🌻.  సిద్ధుని దర్శనము  🌻  వసిష్ఠ మునీంద్రముని కుటీరమున,ధ్యానస్తుడగు సిద్ధుని దర్శనము, ఆ కుటీరపతనము, సిద్ధుని వృత్తాంతము.  అట్లు కుతూహలముతో వివిధ జగంబులు దర్శించిన పిదప.  ఇట్టి క్రియనుండి ప్రయత్నపూర్వకముగ తొలగి, నా పూర్వఆకాశమందున్న, సమాధి కుటీరమునకు వెళ్ళగా, నాశరీరమచ్చట గాన్పించలేదు. సమాధి నిష్టుడగు ఒక సిద్ధుడచ్చట గలడు.  అతడు బ్రహ్మపధమును పొందినవాడు, బ్రహ్మరూపియు, పద్మాసనమున కూర్చుని శాంతుడు, నిశ్చలుడు క్షోభరహితుడు నిర్మలుడై యొప్పుచుండెను. అతని గాంచి నేనిట్లు భావించితిని. ఈతడు మహాసిద్ధుడై, విశ్రాంతి కొరకై ఇచటకు అరుదెంచినట్లున్నది.  నా స్ధూలశరీరము నశించుటచే, సూక్ష్మశరీరముతో నేను నిజ సప్తర్షి లోకమునకు బోవ నిశ్చయించుకొనగ, వెంటనే ఆ కుటీరము నశించిపోయి కేవలము ఆకాశము మాత్రమే మిగిలియున్నది. అతడు నిరాధారుడై క్రింద పడెను. అపుడు నేను సూక్ష్మశరీరముతో, అతనితో పాటు పృధివికేతెంచితిని.  అతడు యోగబలముచే దృఢమైన వజ్రశ...

శ్రీ యోగ వాసిష్ఠ సారము - 245 / YOGA-VASISHTA - 245

Image
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము -  245 🌹 ✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు 📚.  ప్రసాద్ భరద్వాజ 🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 42 🌴 🌻. అభ్యాసము, ప్రభావము - 8 🌻 తేజోరూపుడనై, అనేక దశల విహరించుచు, జిహ్వాదులద్వారా, ప్రతి గృహమందు సమస్త జీవులందు సమస్త లోకములను ప్రకాశింపజేయుట యందు, సూర్యచంద్రాదుల కిరణములచే అంధకారమును తొలగించుట గాంచితిని.  ఆ ప్రకారము, సర్వపదార్ధములను ప్రకాశింపజేయునదియు మరియు ధాతువులందు సువర్ణము, మనుజులందు పరాక్రమము, మెరుపులు, దావాలనమువలె కనిపించినది.  ఎపుడీ దృశ్యమంతయు నాకు నిరామయమగు బ్రహ్మరూపమే అగునో, అపుడు బ్రహ్మరూపస్ధుడనగునేను నవ్విధముగ గాంచితిని. ఈ విధముగ తేజోరూపములో నేను పరమాణువు యొక్క దేశమందును, అనేక జగత్తులను గాంచితిని.  అవియును, జగత్తు చిదాకాశముకంటే భిన్నములు కావు. అట వాయుధారణచే వాయురూపమొంద, అద్దాని కర్మయొక్క విస్తారము; పిదప ఆకాశధారణచే ఆకాశరూపముగ స్వయంలో స్థితినొందుట వర్తించబడినది.  వాయుధారణ ద్వారా వ్యాపించి విస్తరించిన వాడనై, లతలను, కమల, వుత్పల, కుందాది పుష్ప సమూహముయొక్క సుగంధముల నాస్వాదించితిని. శీఘ్రముగామియగుటచే, అవయవరహితమైనను...