శ్రీ యోగ వాసిష్ఠ సారము - 248 / YOGA-VASISHTA - 248
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 248 🌹 ✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు 📚. ప్రసాద్ భరద్వాజ 🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 45 🌴 🌻. పిశాచములు - 2 🌻 ఈ గ్రంధముయొక్క దర్శనముచేతనే మనుజులకు మంచువలె సమస్త పదార్ధములందు అంతఃకరణ శీతలత్వముదయించుచున్నది. మనుజులు స్వభావముగనే విషయములచే వశీకృతులగుచున్నారు. కనుకనే యుద్ధ,శౌర్యాదులచే ధన, స్త్రీ సంపాదనకు కృషి సల్పుచున్నారు. అట్టి వారు ఎపుడు వాటియందు విరక్తులై తత్వజ్ఞానము పొంది సుఖపడుదురుగాక. పాషాణాఖ్యానము వలన, జగత్తు భ్రమయని బ్రహ్మాండమయిన చిద్రూపమగు ఆత్మయొక్క వర్ణనను ఇచట తెలుపబడినది. ఈ జగత్తేదియు నెచ్చటను ఎపుడును యుండియుండలేదు. ఏకరసమై,చిద్ఘనమైనట్టి బ్రహ్మమే, బ్రహ్మమందు అఖండరూపమున యధారీతి స్థితికల్గియున్నది. స్వప్నమందలి నగరములు చిద్రూపములే యగునట్లు, ఈ జగత్తున్ను, బ్రహ్మము చిన్మాత్రమేయని ఎఱుగుము. బ్రహ్మదేవుని (సమిష్టిజీవుని) రూపములో స్థూల సూక్ష్మ జగత్‌రూపమను దృశ్యముయొక్క పరిస్థితి ఏర్పడినప్పటికి, జన్మరహితమగు చిదాకాశము తన చిత్‌స్వరూపమును, త్యజింపకయే స్థితినొందియున్నది. సువర్ణమందు సువర్ణమ్ కలదుగాని శిలాత...