శ్రీ యోగ వాసిష్ఠ సారము - 235 / YOGA-VASISHTA - 235
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 235 🌹 ✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు 📚. ప్రసాద్ భరద్వాజ 🌴 4. నిర్వాణ ప్రకరణము (ఉత్తరార్థము) - 32 🌴 🌻. అహంకారము - 3 🌻 ఒకచోట భవిష్యత్ కాలరూపమునగు, ఒకచోట వర్తమాన కాలరూపమునగు, ఒకచోట భూతకాలరూపమునగు, ఒకచోట సృష్టి, ఒకచోట ప్రళయము ఇట్లు వివిధ కల్పనారూపములచే ఆత్మయగు బ్రహ్మమే నిశ్చలముగ స్థితిపొందుచున్నది. ఈ సమస్త జగత్ భ్రమలకు ఆత్మజ్ఞానము లేకపోవుటయే కారణమైనది. దృశ్యమునుండి మరలించి, ఆత్మవైపు దృష్టి నిలిపిన ఈ జగత్‌భ్రమ నశించిపోవుచున్నది. ఈ ప్రకారముగ వివేకదృష్టిచే నిశ్చయించి, అధికారియగు జీవుడు, అణిమాధ్యష్ట సిద్ధులను, ఈశ్వరత్వమును కూడ మాయామాత్రమని ఎఱిగి,యద్దానిని తృణమువలె జూచుచు నిరతిశయానంమయుడై, స్వాత్మయందే సుస్థిరుడైయుండును. చిదాకాశరూపుడగు వసిష్ఠుడు బ్రహ్మాండములన్నింటిని తన దేహమువలె గాంచుట, తమ స్వప్న సదృశ్యమైన ఆకాశరూపిణియగు స్త్రీతో సంభాషించుట. నేనెపుడైతే చిదాకాశరూపుడనైతినో,నేను గమనశీలుగనైయుండలేదు. నేనచట స్థితినొందియుండలేదు. నా ఆత్మయందే ఈ జగత్తుల గాంచితిని. నాకు చర్మనేత్రము లేకున్నను, చిద్రూపనేత్రముచే, నేనపుడు అనేక జగంబులను నాయందు చూచితిని. (ఆత్మ) ఆ ...