శ్రీ యోగ వాసిష్ఠ సారము - 74 / YOGA-VASISHTA - 74
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 74 / YOGA-VASISHTA - 74 🌹 ✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు 📚. ప్రసాద్ భరద్వాజ 🌴. 2. స్థితి ప్రకరణము 🌴 🌻. శుక్రాచార్యుడు భృగు, యముల వృత్తాంతము - 1 🌻 శ్రీరాముడు వసిష్టు నుద్దేసించి, మనస్సు ఈ ప్రపంచ మందు ఎట్లు గలదో తెలుపుమని యడిగెను. అంతట వసిష్టుడు; ఐందవులు స్ధూల శరీరులైనప్పటికి, సమాధి స్ధితులై యుండి, వారి మనంబున పెక్కు జగంబులు కనిపించునట్లు, ఈ మనస్సు నుండియె జగత్తు స్ధితి, గల్గియున్నది. అటులనే యింద్రజాలముచే వ్యాకుల మొనర్చ బడిన చిత్తము గల లవణునకు, చండాలత్వము ఎట్లు సంభవించెనో అట్లే, ఈ మనంబున, జగత్తు ప్రతిష్టితమై యున్నది. అలానే భృగు మహర్షి పుత్రుడైన శుక్రాచార్యుడు, చిరకాలము స్వర్గ సుఖ మనుభవించ వలెనను ఇచ్చయు, అప్సరసను పొంద వలయునను తలంపును. గలుగుటయు, అపుడు స్వర్గమునకు జని, జన్మాంతరము స్వర్గమున, స్వర్గ సుఖమున, అప్సరసలతో భోగము ననుభవించుటయు సంభవించిన రీతి, ఈ జగత్తున సంభవించుచున్నది. అపుడు శ్రీరాముడు, శుక్రాచార్యుని స్వర్గ సుఖము, అప్సరసను ఎట్లు పొందగల్గెనో తెలుపుమని చెప్పెను. అంతట వసిష్టుడు, భృగు యముల సంవాద మను వృత్తాంతము...