శ్రీ యోగ వాసిష్ఠ సారము - 50 / YOGA-VASISHTA - 50
🌹. శ్రీ యోగ వాసిష్ఠ సారము - 50 / YOGA-VASISHTA - 50 🌹 ✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధరరావు 📚. ప్రసాద్ భరద్వాజ 🌴. ఉత్పత్తి ప్రకరణము 🌴 🌻. ఐందవో పాఖ్యానము - 2 🌻 ఇహ పరలోకములలో సర్వశ్రేయస్సు నొసగున దేది, అని తలచుచు సకల ఐశ్వర్యములను పొందు, మండలాధిపతి, అంతకు మించి రాజు, చక్రవర్తి, ఇంద్రుడా, బ్రహ్మత్వములను గూర్చి ఆలోచించు చుండగా, వారిలో జ్యేష్టుడు ఇట్లు చెప్పెను. సమస్త ఐశ్వర్యములలోను, కల్ప మందు కూడ నశింపని బ్రహ్మమే యుత్తమ మైనదని చెప్పెను. తక్కిన అందరును, అందుకు సమ్మతించి దానిని పొందు మార్గమును ఇట్లు నిర్ణయించిరి. అగ్రజుడు ఇట్లు చెప్పెను. ''పద్మాసనాదీనుడును ప్రకాశవంతుడును అగు బ్రహ్మయే నేను నాశక్తిచే బ్రహ్మండమునంతయు సృజించుచు మరల సంహార మొనర్చుచున్నాను''. ఇట్లు భావన చేయుచు, చిరకాలము భ్రమర కీటక న్యాయము వలె బ్రహ్మ పద ప్రాప్తి గల్గు వరకు, నిశ్చలముగ ధ్యానము చేయుడని పల్కెను. అంతట వారుధ్యాన నిష్ణులై బాహ్యవృత్తుల నిరోధించి, చిత్తమునంతర్ముఖ మొనర్చి, బ్రహ్మపదమును గూర్చి చింతించసాగిరి. నేను యజ్ఞ స్వరూపుడను, వేదములు, మానవకోటి, సిద్ధులు, స్వర్గము, భూమండలము, పాతాళ లోక